Dog Adoption: పిజ్జా కొంటే.. కుక్క పిల్ల ఫ్రీ..

ఓ రెస్టారెంట్‌ ఓనర్ క్రియేటివ్‌ ఆలోచన

Courtesy: Twitter

Share:

Dog Adoption: ఎవరూ రెండు అడుగుల ఆశ్రయం కూడా కల్పించని కుక్కలు(Dogs) వీధుల్లో ఎన్నో మానసిక, శారీరక బాధలను అనుభవిస్తాయి. ఆకలి, దాహం, ప్రతికూల వాతావరణం, జబ్బులు, ప్రమాదాలు, గాయాలు ఇలా చెప్పుకుంటూ పోతే అవి ఎన్నో అవస్థలు పడతాయి. కొందరు వాటికి ఫుడ్(Food) అందించడానికి బదులుగా రాళ్లతో, కర్రలతో కొట్టి కిరాతకంగా హింసిస్తారు. ఇలాంటి కుక్కలకు ఒక లవింగ్ హోమ్‌(Loving home) కల్పిస్తే అవి జీవితాంతం సుఖపడతాయి. వాటిని దత్తత(Adoption) తీసుకుంటే ఒక లైఫ్ ఇచ్చినట్లు కూడా అవుతుంది. అలాంటి ఆలోచనలు చేసే జంతు ప్రేమికులు(Animal Lovers) ఎందరో ఉన్నారు. కానీ వారి ప్రయత్నంలో పెద్దగా సక్సెస్ అవ్వరు. అయితే తాజాగా న్యూయార్క్‌ (New York)లోని ఒక పిజ్జా షాప్(Pizza shop) మాత్రం హోమ్‌లెస్ డాగ్స్‌ (Homeless Dogs)కు పర్మనెంట్ హోమ్ కనిపెట్టడంలో సక్సెస్ అవుతోంది.

 

ఇందుకోసం ఆ షాప్ ఓనర్ క్రియేటివ్‌గా ఆలోచించింది. ఆ షాప్ పేరు జస్ట్ పిజ్జా & వింగ్ కో (Just Pizza & Wing Co). ఈ రెస్టారెంట్ నయాగరా సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (SPCA)తో పార్ట్నర్‌షిప్‌ కుదుర్చుకుంది. నయాగరా (SPCA)లో చాలా కుక్కలు యజమానుల కోసం వేచి చూస్తున్నాయి. నిస్సహాయక స్థితిలో ఉన్న వీటిని అడాప్ట్(adapt) చేసుకోవాలని సొంత పిజ్జా బాక్స్‌లపై(Pizza Box) రెస్టారెంట్ ఒక రిక్వెస్ట్ రాసి కస్టమర్లకు అందిస్తోంది.

దత్తత(Adapt) తీసుకోదగిన కుక్కల ఫొటోలు, వివరాలను ప్రచురిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. “దయచేసి నన్ను దత్తత తీసుకోండి. నేను నయాగరా సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (SPCA)లో ఉంటున్నా, నా పేరు ఇగ్గీ, వయసు మూడేళ్లు, మీతో కలిసి నివసించాలనుకుంటున్నా.” అని పిజ్జా బాక్స్‌లపై(Pizza Box) ఒక బ్యూటిఫుల్ కుక్క ఫొటోతో పాటు పోస్టర్(Poster) లాంటి ఫ్లైయర్‌ ప్రింట్ చేసి కస్టమర్లకు అందిస్తున్నారు.

ఆలోచన ఎలా వచ్చిందంటే..ఈ హార్ట్ టచింగ్ మెసేజ్ చదివిన కస్టమర్లలో చాలామంది కదిలిపోయి వాటిని అడాప్ట్(Adapt) చేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. పిజ్జా ఔట్‌లెట్ యజమాని మేరీ అల్లాయ్ SPCAలో వాలంటీర్‌గా పనిచేస్తున్నప్పుడు, ముఖ్యంగా కరోనా సమయంలో(Covid) కుక్కల కోసం ఇళ్లను కనుగొనడంలో సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు డిఫరెంట్‌గా థింక్ చేయాలని అనుకుంది. ఆమె ఎస్పిసీఏ (SPCA) ఈవెంట్ ప్లానర్ అయిన కింబర్లీ లారుస్సాను సంప్రదించింది. పెంపుడు జంతువులను దత్తత(Adopt animals) తీసుకోవడాన్ని ప్రోత్సహించడానికి పిజ్జా బాక్స్‌లను(Pizza Box) ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగించడానికి ఆమె అనుమతి కోరింది.

ఇందుకు లారుస్సా(Larussa) అంగీకరించింది. కుక్కల ఫొటోలు(Dog Imag

es), వాటి పేరు, వయస్సు, పర్సనాలిటీ, అడాప్షన్ రిక్వైర్‌మెంట్స్(Adoption Requirements) వంటి వివరాలతో కొన్ని ఫ్లైయర్లను మేరీకి పంపింది. మేరీ వాటిని ప్రింట్ చేసి కస్టమర్లకు డెలివరీ చేసే ముందు పిజ్జా బాక్స్‌(Pizza Box)లకు జత చేసింది. ఫ్లైయర్ నుంచి కుక్కను దత్తత తీసుకున్నవారికి ఆమె 50 డాలర్ల పిజ్జా షాప్ గిఫ్ట్ సర్టిఫికేట్ కూడా అందించింది. ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన సమయం నుంచి వందలాది కుక్కలను లవింగ్ ఫ్యామిలీస్ అడాప్ట్(Adopt loving families) చేసుకున్నాయి. దాంతో ఈ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్(Success) అయ్యింది.

కస్టమర్లు పిజ్జా బాక్స్‌లపై కుక్కల క్యూట్ ఫేస్‌లు చూసి ముగ్ధులయ్యారు, చాలామంది వాటిని దత్తత తీసుకోవడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. వారిలో కొందరు సోషల్ మీడియాలో ఫొటోలు, స్టోరీస్ కూడా పంచుకున్నారు, ఇది మరింత ప్రచారం చేసింది, ఇతరులు ఈ ఫ్లైయర్స్‌ షేర్ చేయడం మొదలుపెట్టారు. దీనికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దానితో తాను ఆనందంతో పొంగిపోయానని మేరీ(Meri) తెలిపింది. సమాజానికి, జంతువులకు సహాయం చేయడంలో తనకు మక్కువ ఉందని, తన దుకాణంలో వివిధ కారణాల కోసం డొనేషన్ బాక్స్‌లు కూడా ఉంచానని తెలిపింది.

మేరీ, ఆమె పిజ్జా రెస్టారెంట్(Pizza restaurant) స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్‌ను నెటిజన్లు కూడా ప్రశంసించారు. ఇది అద్భుతమైన, అందమైన, తెలివైన ఆలోచన అని వ్యాఖ్యానించారు. వారిలో కొందరు ఉద్వేగానికి కూడా లోనయ్యారు. ఈ మంచి పనితో కదిలిపోయామని, దేవుడు అన్ని జంతువులను ప్రేమిస్తారని చెప్పారు.