Hamas: చీకటి గదుల్లో.. సరైన ఆహారం లేకుండా.. హమాస్ చెరలో బందీల వ్యధలు

విడుదలైన బందీల కథనం

Courtesy: Twitter

Share:

Hamas: ఖతార్- మరియు ఈజిప్ట్ మధ్యవర్తిత్వ ఒప్పందం శుక్రవారం అమలులోకి వచ్చినప్పటి నుండి హమాస్(Hamas) 50 మందికి పైగా ఇజ్రాయెల్ (Israel) మహిళలు మరియు పిల్లలను విడుదల చేసారు. వారిలో 17 మంది థాయ్లాండ్ (Thailand) పౌరులు ఉన్నారు. అక్టోబరు 7 హమాస్‌ (Hamas) దాడుల్లో పట్టుబడిన 160 మందికి పైగా బందీలు ఇప్పటికీ గాజా స్ట్రిప్లో ఉన్నారు.

ఇజ్రాయెల్తో (Israel) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. హమాస్‌ (Hamas) విడతల వారిగా 50కి మందికి పైగా బందీలను విడుదల చేసింది. ప్రతిగా ఇజ్రాయెల్‌ (Israel) కూడా పాలస్తీనా (Palestine) ఖైదీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 7 ఇజ్రాయెల్పై మెరుపుదాడికి దిగి అక్కడి పౌరులను, చిన్నారులను అపహరించి బందీలుగా చేసుకున్న హమాస్ తర్వాత వారి పట్ల కఠినంగా వ్యవహరించింది. వారికి సరైన ఆహారం కూడా అందించకపోవడంతో పాటు చిన్నారులను చీకటి గదిలో వేసి చిత్రహింసలకు గురిచేసింది. మేరకు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది.

విడుదలైన బందీలు (Hostages) ఎవరూ తమను పరిస్థితులలో ఉంచారో ఇప్పటి వరకు చెప్పలేదు. బందీలుగా ఉన్నపుడు తమ పరిస్థితుల గురించి వివరాలను వెల్లడించకుండా ఉండమని ఆదేశించినట్లు ఆసుపత్రులు చెబుతున్నాయి. కానీ వారికి చికిత్స చేస్తున్న వైద్య నిపుణుల నుండి కొన్ని వివరాలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. విడుదలైన 17 మంది థాయ్(Thai) జాతీయులు చికిత్స పొందిన షామీర్ మెడికల్ సెంటర్లోని (Shamir Medical Centre) వైద్య బృందం అధిపతి రోనిత్ జైడెన్స్టెయిన్ (Ronit Zeidenstein), బందీలకు సరైన ఆహారం ఇవ్వలేదని చెప్పారు. కొద్దిపాటి అన్నం, చిక్కుడు గింజలు, డబ్బాలలో నిల్వ చేసిన ఆహారాన్ని ఇచ్చే వారని అందుకే పోషకాహార లేమితో (Nutritional deficiency) బాధపడ్డారని చెప్పారు. మా వద్దకు వచ్చిన వ్యక్తులు చాలా తక్కువ సమయంలో10 శాతం లేదా అంతకంటే ఎక్కువ బరువును (Weight) కోల్పోయారన్నారు.

హమాస్ (Hamas) విడుదల చేసిన బందీల్లో మెరవ్ రవివ్ (Merav Raviv) ముగ్గురు బంధువులు కూడా ఉన్నారు. బందీలుగా ఆమె కజిన్, ఆంటీతోపాటు మరొకరు అనుభవించిన కష్టాలను ఆమె వెల్లడించారు. వారికి వేళాపాళా లేకుండా కాసింత అన్నం, బ్రెడ్ అందించేవారని తెలిపారు. గత 50 రోజుల్లో వారు ఏడు కేజీల బరువు తగ్గారని వివరించారు. రిసెప్షన్ లాంటి ప్రాంతంలో కుర్చీలనే మంచాలుగా చేసుకుని నిద్రపోయేవారని తెలిపారు. బాత్రూములకు వెళ్లేందుకు గంటలకొద్దీ వేచి చూడాల్సి వచ్చేదని పేర్కొన్నారు.

బందీలుగా ఉన్న అందరూ బరువు తగ్గారని తెలిపారు. వారి చెరలో క్షణమొక యుగంగా గడిచిందని, రోజులు లెక్కపెట్టుకుని, ప్రాణాలు అరచేత పెట్టుకుని గడిపామని 85 ఏళ్ల యాఫా అడార్ (Yafa Adar) మనవడు అడ్వా అడార్ (Adv adar) తెలిపారు. ఆమె కూడా బరువు తగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులు చనిపోయారని ఉగ్రవాదులను నమ్మించడం ద్వారా ఆమె బతికి బయటపడ్డగలిగారని అడార్ గుర్తు చేసుకున్నారు. ఆమె విడుదల ఆనందంగా ఉన్నా.. ఉగ్రవాదులు ఆమె ఇంటిని ధ్వంసం చేయడం బాధగా ఉందని చెప్పారు.

వోల్ఫ్సన్ మెడికల్ సెంటర్లోని (Wolfson Medical Center) వైద్యురాలు కొంతమంది బందీలను భూగర్భంలో ఉంచినట్లు వివరించారు. వారిని వెలుతురులో కేవలం రెండు గంటలు మాత్రమే ఉంచారని తెలిపారు. సోమవారం విడుదలైన 12 ఏళ్ల ఫ్రెంచ్ బాలుడు ఐటాన్ యహలోమిని (Eitan Yahalomi) చీకటిగదిలో 16 రోజులపాటు తనను ఒంటరిగా నిర్భందించారని, బాంబుల శబ్దానికి ఎంతగానో భయపడ్డానని చెప్పాడు. పెన్సిల్ లేదా పెన్నుతో రాసుకుంటానని అడిగినప్పుడు కూడా, హమాస్అనుమతించలేదు. ఎందుకంటే వారు సమాచారాన్ని వ్రాతపూర్వకంగా ప్రసారం చేస్తారని భయపడ్డారు. దీంతో చిన్నారుల పట్ల కూడా హమాస్ఉగ్రవాదులు కఠినంగా వ్యవహరించారో తెలుస్తోందని కథనాలు పేర్కొన్నాయి.

కాగా.. కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందంలో భాగంగా 50కి పైగా బందీలు విడతల వారిగా బయటకు వచ్చారు. వారంతా నవ్వుతూ.. హమాస్‌(Hamas) మిలిటెంట్లకు వీడ్కోలు చెప్తున్న వీడియోలు ఇటీవల నెట్టింట్లో వైరల్గా మారాయి. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్‌ (Israel) బందీల తలపై తుపాకీ గురిపెట్టి వారితో బలవంతంగా నవ్విస్తున్నారంటూ ఆరోపించిన విషయం తెలిసిందే.