Health: ఇలా చేస్తే ఆరోగ్యం మీ చేతుల్లోనే

100 సంవత్సరాలు జీవించేందుకు ఇది మంచి చిట్కా

Courtesy: Twitter

Share:

Health: పాత రోజుల్లో (Old Days) మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా (Health) ఉండే వారు. వారు అలవోకగా 90 సంవత్సరాలకు పైనే జీవించే వారు. కానీ ప్రస్తుతం ఎన్ని కష్టాలు పడినా కానీ ఆరోగ్యం (Health)  అనేది మనకు అందని ద్రాక్షలానే మారిపోయింది. ఈ రోజుల్లో 65 సంవత్సరాలు దాటడమే గగనంలా కనిపిస్తోంది. ఇక 90 సంవత్సరాల జీవనం (Life Span) గురించి పూర్తిగా మర్చిపోవాలి. అటువంటిది నేటి రోజుల్లో ఓ వ్యక్తి 90 సంవత్సరాలకు పైగా జీవించారు. ఆయన తన ఆరోగ్యం గురించి తాను అంతలా ఆరోగ్యంగా ఉండేందుకు ఎటువంటి ఆహారం (Food) తీసుకుంటున్నాడో దాని గురించి పూర్తిగా వివరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో (Video) సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ వావ్ ఇట్స్ అమేజింగ్ థింగ్ అంటూ కామెంట్లు (Comments) చేస్తున్నారు. 

నా ఆరోగ్య రహస్యం అదే.. 

ఓ వృద్ధుడు (Old Man) తాను 90 సంవత్సరాల వయసులో కూడా ఫిట్ (Fit) గా ఉండేందుకు తనకు ఏం సహాయపడిందో తెలియజేశారు. ఓ డాక్టర్ ఆయన్ను మీ ఆరోగ్య రహస్యం ఏమిటి అని ఆ వీడియో క్లిప్ లో అడుగుతోంది. దీర్ఘాయువు, ఆరోగ్యం మరియు ఆనందం వెనుక రహస్యం ఏమిటి? అని ఆ డాక్టర్ (Doctor) ఆ వ్యక్తిని ప్రశ్నించింది. దీంతో అతను సమాధానం ఇవ్వడం మొదలుపెట్టాడు. నేను ఈ రోజు వరకు క్రమం తప్పకుండా వ్యాయామం (Exercise) చేస్తున్నాను. ఈ రోజు వరకు నేను ఉదయం 4 గంటలకే నిద్ర లేచాను. ఒకటిన్నర నుంచి రెండు గంటల పాటు యోగా (Yoga) చేస్తాను. నేను చాలా సింపుల్ ఫుడ్ (Simple Food) తీసుకుంటాను. నేను కూడా నాన్ వెజ్ (Non-Veg) తింటాను కానీ చాలా తక్కువ పరిమాణంలో. నేను పెద్దగా గొడవలు పెట్టుకోను. అని అతడు వెల్లడించాడు. ఈట్ సింపుల్, థింక్ సింపుల్ (Eat Simple-Think Simple) అని అతడు చెప్పిన మాటలను చాలా క్లుప్తంగా ఆ వైద్యురాలు చెప్పింది. వృద్ధుడు వ్యాయామం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. మీరు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి (Request) చేశాడు. అతను వైద్యురాలితో  చెప్పినట్లుగా, అతను రాత్రి 10 గంటలకు విశ్రాంతి తీసుకుంటాడు. ఈ క్లిప్ చాలా పెద్దగా ఉంది. కానీ డాక్టర్ మాత్రం చిన్న క్లిప్ పోస్ట్ చేసి యూజర్లలో (Users) ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. డాక్టర్ క్యాప్షన్‌ లో ఇలా వ్రాశారు. ఈ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ క్లిప్ ను డాక్టర్ ఆ వృద్ధుడి అనుమతి తీసుకునే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని కూడా డాక్టర్ (Doctor) అక్కడ ధృవీకరించారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ క్లిప్‌ ను చూసి మెచ్చుకుంటున్నారు. అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వారిలో ఒకరు ఇది కాలం చేసిన తన తండ్రిని (Father) గుర్తుచేస్తుందని రాశారు. 90 సంవత్సరాలకు చేరుకున్నా అతడు కోవిడ్ (Covid) మహమ్మారి వల్ల మరణించాడట. కానీ ఒక యూజర్ మాత్రం డిఫరెంట్ విషయాన్ని పంచుకున్నారు. ఆ యూజర్ తాత ఎప్పుడూ వ్యాయామం చేయకున్నా మరియు క్రమం తప్పకుండా జంక్ ఫుడ్ (Junk Food) తీసుకున్నా కానీ అతడికి ఏం కాలేదట. ఆయన తాత ఇన్ని పనులు చేసినప్పటికి కూడా.. 90 ఏళ్ల వయస్సు వచ్చినా కానీ ఏ వ్యాధితో బాధపడలేదని వినియోగదారు రాశారు. మన తాతయ్యలు బలంగా ఉండడానికి ఒక కారణం వారి శారీరక శ్రమ. సాంకేతికత రాకముందు ప్రతి పనికి శారీరకంగా చురుగ్గా ఉండాల్సి వచ్చేది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు వైరల్ (Viral) అవుతున్నాయి. 

కారణం అదే.. 

మనలో చాలా మందికి ఆరోగ్యం (Health)  తొందరగా పాడు కావడానికి ప్రధాన కారణం జంక్ ఫుడ్ (Junk Food) అని అంతా అంటుంటారు. కానీ జంక్ ఫుడ్ మాత్రం ఒక్కటే కారణం కాదని పైని విషయం చూశాక అర్థం అవుతోంది. మన జీవన విధానంలో వచ్చిన మార్పులు కూడా మన ఆరోగ్యం (Health)  తొందరగా చెడిపోవడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. పాత రోజుల్లో ఇంతలా టెక్నాలజీ (Technology) లేకుండేది. వారికి ఏ పని కావాలన్నా వారే చేసుకోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం అంతా టెక్నాలజీ మహిమ వచ్చి చేరింది. మనకు ఎటువంటి పని కావాలన్నా కానీ చిటికెలో మిషన్లతో (Missions) పూర్తవుతోంది. ఇది కూడా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. చెమట (Sweat) అన్నదే పట్టకుండా ఇలా చేయడం వల్లే మనల్ని ఇలా అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయని అంతా కామెంట్లు చేస్తున్నారు. పాతతరం వారికి చెమటలు పట్టేవి. కానీ ప్రస్తుతం మనకు చెమట అన్నదే రాకుండా మనం చూసుకుంటున్నాం. కొంచెం వేడిగా ఉన్నా కానీ ఏసీలు గట్రా ఆన్ చేసుకుంటున్నాం. ఈ విషయం కూడా మన ఆరోగ్యం (Health)  మీద తీవ్రంగా ప్రభావం చూపుతుందని అంతా అంటున్నారు. ఇలా చేస్తూ మనం చేజేతులా అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు.

Tags :