Palestinian Doctor: ఇజ్రాయెల్ ఆదేశాలను ధిక్కరించిన పాలస్తీనా వైద్యుడు

నేను వెళ్తే చికిత్స ఎవరు చేస్తారని హుకుం..

Courtesy: Pexels

Share:

Palestinian Doctor: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య (Israel-Palestine War) యుద్ధం ఘోరంగా జరుగుతోంది. యుద్ధంలో పాలస్తీనా (Palestine) ప్రజలు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా కానీ ఇజ్రాయెల్ (Israel) మాత్రం తన దాడులను తగ్గించడం లేదు. ఎలాగైనా సరే హమాస్ (Hamas) గ్రూప్ ను మట్టుబెట్టాలని ఇజ్రాయెల్ (Israel) యోచిస్తోంది. ఇజ్రాయెల్ అధికారులు మాత్రమే కాకుండా స్వతహాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహునే (PM Netanyahu) చెప్పడం గమనార్హం. యుద్ధం తగ్గించమని ఇజ్రాయెల్ ను ప్రపంచదేశాలు (World Countries) కోరుతున్నాయి. అయినా కానీ ఇజ్రాయెల్ మాత్రం ఎవరు చెప్పింది పట్టించుకోవడం లేదు. గాజా (Gaza) స్ట్రిప్ లో ఉన్న హమాస్ గ్రూప్ కు సంబంధించిన వారిని అంతం చేసే వరకు తమ పోరు ఇలాగే కొనసాగుతుందని ఇజ్రాయెల్ పేర్కొంటుంది. 

ఎదురుతిరిగిన వైద్యుడు 

గాజా స్ట్రిప్ లో నివాసం ఉన్న అనేక మందిని తరలిపొమ్మని ఇజ్రాయెల్ (Israel)ఇప్పటికే హెచ్చరించింది. దీంతో అనేక మంది పౌరులు దక్షిణం వైపుకు వెళ్లారు. వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పెట్టే పేడా సర్దుకొని వెళ్తున్న వీడియోలు (Videos) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను చూసి అనేక దేశాలకు చెందిన వారు అయ్యో పాపం అని అన్నారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం వారు సురక్షితంగా ఉండాలంటే ఖాళీ చేసి వెళ్లాలని తెలిపింది. కానీ గాజాలో ఉన్న ఓ వైద్యుడు (Palestinian Doctor) మాత్రం ఇజ్రాయెల్ ఆదేశాలను ధిక్కరించాడు. కానీ అతడు ప్రాణాలు (Life)  కోల్పోయాడు. గాజాలోని అల్-షిఫా హాస్పిటల్‌ (Hospital) లో పాలస్తీనా నెఫ్రాలజిస్ట్ (Palestinian Doctor) హమ్మమ్ అల్లాహ్ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించినట్లు ఓ మీడియా సంస్థ (Media) తెలిపింది. అతడు మరణానికి ముందు తన చివరి ఇంటర్వ్యూలో దక్షిణం వైపు వెళ్లేందుకు నిరాకరించాడు. ఇజ్రాయెల్ హెచ్చరికలను (Israel Warning) అతడు పట్టించుకోలేదు. అంతే కాకుండా నేను దక్షిణం వైపుకు వెళ్తే మరి ఇక్కడకు వచ్చే రోగులను (Patients) ఎవరు చూసుకుంటారని ప్రశ్నించాడు. తన రోగుల పట్ల వైద్యునిగా తన కర్తవ్యం గురించి మాట్లాడాడు. దక్షిణం వైపుకు వెళ్లే ప్రసక్తే లేదని అతడు వెల్లడించాడు. నేను వెళ్తే, నా రోగులకు ఎవరు చికిత్స చేస్తారని అన్నారు? వారు జంతువులు కాదు. సరైన ఆరోగ్య సంరక్షణ పొందే హక్కు వారికి ఉందని వెల్లడించారు. నేను మెడికల్ స్కూల్‌ (Medical School) కి మరియు నా పోస్ట్‌ గ్రాడ్యుయేట్ డిగ్రీలకు మొత్తం 14 సంవత్సరాలు వెళ్ళానని, నేను నా జీవితం గురించి కాకుండా నా రోగుల గురించి ఆలోచిస్తున్నానని తెలిపాడు. అల్లాహ్‌ తో కలిసి పనిచేసిన తోటి నెఫ్రాలజిస్ట్ అయిన బెన్ థామ్సన్ కూడా పాలస్తీనాలో స్వతంత్య్ర జీవితాన్ని తాను కోరుకుంటున్నట్లు మీడియాకు వెల్లడించాడు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అల్లాహ్ (Allah) తన తండ్రి, అతని అత్తయ్య మరియు అతని బావతో సహా మరణించాడని థామ్సన్ చెప్పాడు. ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడి తాకినప్పుడు అల్లాహ్ తన భార్య ఇంటిలో ఉన్నాడని పేర్కొన్నాడు. అల్లాహ్‌ కు భార్య మరియు 4 మరియు 5 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. 

ఇప్పటికే సమస్యలు

సైలెంట్ గా ఉన్న తమ మీద అనవసరంగా దాడి చేసిన హమాస్ భరతం పట్టాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం తీసుకుని హమాస్ కు ఎక్కువగా పట్టున్న గాజా స్ట్రిప్ (Gaza Strip) మీద దాడులకు దిగుతోంది. దీంతో గాజా స్ట్రిప్ అల్లకల్లోలం అవుతోంది. తాము దాడులను ఆపే ప్రసక్తే లేదని అవసరం అయితే ఇక్కడి నుంచి వెళ్లాలని ఇజ్రాయెల్ (Israel) గాజా సిటీలో ఉన్న పౌరులకు సూచించింది. దీంతో అనేక మంది గాజా సిటీలోని వారు దక్షిణం వైపుకు వెళ్లారు. కానీ కొందరు మాత్రం గాజా సిటీలోనే ఉండి తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఉత్తర గాజాలోని ఆసుపత్రులు, ఇప్పటికే విద్యుత్తు అంతరాయాలతో (Current) పోరాడుతూ ఉన్నాయి. ఆ ఆసుపత్రులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరో విషాద వార్త ఏమిటంటే.. అక్కడ ఆసుపత్రులకు విద్యుత్ సరఫరాతో పాటు మందుల (Medicines) సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.  గాజా స్ట్రిప్‌ లోని అతిపెద్ద ఆసుపత్రి అల్-షిఫా పని చేయడం ఆగిపోయింది. మరియు తీవ్రమైన ఇజ్రాయెల్ దాడుల (Israel Attacks) మధ్య రోగుల మరణాలు పెరుగుతూనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) ఆదివారం ప్రకటించింది. గాజాలోని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అల్-షిఫా ఆసుపత్రిలోని నియోనాటల్ యూనిట్‌ లో సేవ నుంచి నిష్క్రమించిన తరువాత ముగ్గురు శిశువులు మరణించినట్లు తెలిపింది. ఇన్ని మరణాలు సంభవిస్తున్నా కానీ ఇజ్రాయెల్ మాత్రం తన దాడులను ఆపడం లేదు. ఇలాగే దాడులు కొనసాగిస్తే గాజా సిటీ మొత్తం స్మశానంలా మారే ప్రమాదం ఉందని కూడా పలువురు హెచ్చరిస్తున్నారు. అయినా కానీ హమాస్ (Hamas) ఉగ్రవాదులను