Elon Musk: అప్పటి వరకు ప్రతిరోజూ ఈ ట్యాగ్ ధరిస్తా: ఎలాన్‌ మస్క్‌

హమాస్ ఉగ్రవాదుల్ని చంపడం తప్ప వేరే మార్గం లేదు..

Courtesy: Twitter

Share:

Elon Musk: టెక్ దిగ్గజం టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా హమాస్‌(Hamas) వద్ద  బందీలుగా ఉన్నవారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

 సామాజిక మాధ్యమంలో యూదు వ్యతిరేక పోస్టులకు మద్దతు తెలిపి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌(Elon Musk) విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఇజ్రాయెల్‌(Israel)కు వచ్చారు. ఈ సందర్భంగా ఓ బందీ తండ్రి ఇచ్చిన మెటల్‌ ట్యాగ్‌ (డాగ్ ట్యాగ్) స్వీకరించి..  హమాస్‌తో(Hamas) పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు(Israel) తన మద్దతు ప్రకటించారు. ఈ ట్యాగ్‌ను హమాస్‌(Hamas) వద్ద ఉన్న బందీలు విడుదలయ్యే వరకు ధరిస్తానని చెప్పారు.

తన పర్యటనలో భాగంగా మస్క్ (Musk)..ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు, ప్రధానితో సమావేశమయ్యారు. బందీల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషయాన్ని అధ్యక్ష కార్యాలయం ఎక్స్‌ వేదికగా వెల్లడిస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఓ బందీ కుటుంబం..‘మా హృదయాలు గాజాలో బందీ అయ్యాయి’ అని రాసి ఉన్న మెటల్ ట్యాగ్‌ను(Metal Tag) మస్క్‌కు అందించింది. ‘మీ ఆత్మీయులు విడుదలయ్యే వరకు ప్రతిరోజూ నేను దీనిని ధరిస్తాను’ అని ఆ పోస్టుకు మస్క్‌ బదులిచ్చారు.

ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో(X) యూదు వ్యతిరేక పోస్టుల గురించి మస్క్‌ వద్ద అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్ (Isaac Herzog) ప్రస్తావించారు. అలాంటి పోస్టుల కట్టడిలో ఆయన కీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూతో (Benjamin Netanyahu) కలిసి మస్క్‌ సోమవారం హమాస్‌ దాడి చేసిన కిబుట్జ్‌లో పర్యటించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన అక్కడికి చేరుకున్నారు. తన ఫోన్‌లో అక్కడి భయానక దృశ్యాల ఫొటోలు, వీడియోలను తీసుకున్నారు. మస్క్‌ కంపెనీ స్టార్‌లింక్‌ శాటిలైట్‌ (Starlink satellite) ఇంటర్నెట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని ఇజ్రాయెల్‌ కమ్యూనికేషన్ల మంత్రి ష్లోమో కర్హి (Minister Shlomo Karhi) తెలిపారు.

ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌లో(Isaac Herzog) ఎలాన్ మస్క్ (Elon Musk) భేటీ అయిన సందర్భంలో ఈయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్, గాజాలో కలిపి 16,000 మందికి పైగా మరణాలకు కారణమైన ఇజ్రాయిల్-హమాస్ (Israel-Hamas) యుద్ధం పరిణామాలపై ఇరువురు చర్చించారు. ఈ సమావేశంలో హమాస్ ఉగ్రవాదులను హతమార్చడం తప్ప వేరే మార్గం లేదని ఎలాన్ మస్క్ అన్నారు.

కొత్త తరం ప్రజలు ‘‘ హంతకులుగా శిక్షణ పొందకుండా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, ప్రజలలో శ్రేయస్సును నిర్మించాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘ నేను ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూతో(Benjamin Netanyahu) ఇప్పుడే మాట్లాడాను. గాజా(Gaza) పరిస్థితిలో మూడు విషయాలు జరగాలి. పౌరులను హత్య చేయాలనే పట్టుబట్టే వారిని చంపడం తప్ప వేరే మార్గం లేదు. వారు తమ మనసును మార్చుకోరు’’ అని మస్క్ ఇజ్రాయిల్(Israel) అధ్యక్షుడితో అన్నారు. రెండో విషయం ఏంటంటే.. కొత్త తరం ప్రజలు హంతకులుగా మారకుండా ప్రజల మధ్య శ్రేయస్సును నిర్మించడం ముఖ్యమని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే నాలుగు రోజుల సంధిలో భాగంగా ఇజ్రాయిల్ (Israel) 150 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అందుకు ప్రతిగా హమాస్ 59 మంది బందీలను విడుదల చేసింది. సంధిని మరో రెండు రోజపులు పొడగించుకోవాలని ఇరుపక్షాలు ఖైదీలను, బందీలను మార్చుకోవాలని భావిస్తున్నాయి. సోమవారం ఇజ్రాయిల్, ఎలాన్ మస్క్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇజ్రాయిల్ ఆమోదంతో గాజాలో(Gaza) స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను స్పేస్ ఎక్స్ అందిస్తుంది.