చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లో 15 మందిని కాల్చి చంపిన యువకుడు

ప్రాగ్ లోని జన్ పలాచ్ స్క్వేర్​లోని చార్లెస్‌ విశ్వవిద్యాలయంలో విద్యార్థి తుపాకీతో కాల్పుల కలకలకం సృష్టించాడు. ఫిలాసఫీ విభాగం భవనంలో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ దారుణ ఘటనలో 15 మంది మృతిచెందగా, దాదాపు 30 మంది గాయపడినట్లు చెక్‌ పోలీసులు గురువారం తెలిపారు.

Courtesy: IDL

Share:

చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని నగరమైన ప్రాగ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రాగ్ లోని జన్ పలాచ్ స్క్వేర్​లోని చార్లెస్‌ విశ్వవిద్యాలయంలో విద్యార్థి తుపాకీతో కాల్పుల కలకలకం సృష్టించాడు. నగరంలోని జాన్‌ పాలాహ్‌ కూడలిలో ఉన్న యూనివర్సిటీ వద్ద ఈ కాల్పులు జరిగాయి. ఫిలాసఫీ విభాగం భవనంలో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ దారుణ ఘటనలో 15 మంది మృతిచెందగా, దాదాపు 30 మంది గాయపడినట్లు చెక్‌ పోలీసులు గురువారం తెలిపారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దుండగుడిని ముట్టబెట్టారు. బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇందులో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

కాల్పులు జరిగిన భవనంలో ఇంకా పేలుడు పదార్థాలు ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. కాల్పులకు పాల్పడిన యువకుడు అదే విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిగా అధికారులు గుర్తించారు. కాల్పుల ఘటన వెనుక ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు లేదా తీవ్రవాదుల ప్రమేయం లేవని చెక్‌ అంతర్గత శాఖ మంత్రి విట్ రాకుసన్ స్పష్టం చేశారు. విచారణలో ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.కాగా, కాల్పుల ఘటనతో యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు అధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఉద్దేశంతో అతను కాల్పులు జరిపాడో ఇంకా తెలియదని, మరోవైపు అనుమానితుడి తండ్రి కూడా గురువారం చనిపోయి కనిపించారని తెలిపారు.ఈ సంఘటనకు ప్రతిస్పందనగా, పోలీసులు ప్రభావిత ప్రాంతాన్ని చుట్టుముట్టారు మరియు సమీపంలో నివసిస్తున్న నివాసితులు తమ భద్రత కోసం ఇంటి నుంచి బయటకు రావద్దని సీజెక్ పోలీసులు పౌరులకు తక్షణ విజ్ఞప్తి చేశారు. 

మెక్సికో ఘటన మరవక ముందే
ఇటీవల మెక్సికోలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గ్వానాజువాటో రాష్ట్రంలోని సాల్వాటియెర్రా పట్టణంలో జరిగిన క్రిస్మస్​ పార్టీలో ఓ సాయుధుడు బీభత్సం సృష్టించాడు. పార్టీల్లో పాల్గొన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 'పొసాడా' అనే పార్టీ అనంతరం హాల్​ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.