Model: షాకింగ్ నిర్ణయం తీసుకున్న బ్రెజిలియ‌న్ మోడల్

రూ. 16 లక్షలు ఇస్తామన్నా కానీ

Share:

Model: పెళ్లి (Marriage) అనేది చాలా మందికి ఒక ముఖ్యమైన కలగా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ పెళ్లిని (Marriage) చాలా గ్రాండ్ గా చేసుకోవాలని అనేక మంది అనుకుంటూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం తమ పెళ్లికి (Marriage) వచ్చిన క్రేజీ ఆఫర్లను (Crazy Offers) తిరస్కరిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇందులో కొన్ని ఆఫర్లు వినే మనకు బాగానే అనిపించినా కానీ వారికి పెద్దగా నచ్చవు. అందుకోసమే వారు ఆ ఆఫర్లను రిజెక్ట్ (Reject) చేస్తుంటారు. కానీ చూసిన మనం మాత్రం అంత మంచి ఆఫర్ అనవసరంగా రిజెక్ట్ చేశారని అనుకుంటూ ఉంటాం. ఇలా ఒక బ్రెజిలియన్ మోడల్ (Model) కూడా పెళ్లి (Marriage) కోసం వచ్చిన క్రేజీ ఆఫర్ ను రిజెక్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది. ఇంతకీ ఆ మోడల్ ఎటువంటి ఆఫర్ రిజెక్ట్ చేసిందో తెలిస్తే ముక్కున వేలేసుకోవడం గ్యారంటీ. 

బ్రెజిలియన్ మోడల్ కు గిరాకీ ఎక్కువే.. 

బ్రెజిల్ (Brazil) కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ మరియు ప్రముఖ మోడల్ (Model) అయిన వనుసా ఫ్రీటాస్ గురించి తెలియని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు. అమ్మడుకి సోషల్ మీడియా (Social media) లో అనేక మంది ఫాలోవర్లు ఉన్నారు. అమ్మడు తరచూ సోషల్ మీడియా జనాలతో టచ్ లో ఉంటుంది. ఈ బ్యూటీకి (Beauty) ప్రస్తుతం పెళ్లి కోసం వచ్చిన ప్రపోజల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మకు తెలియని వ్యక్తి నుంచి రూ. 16 లక్షల కట్నంతో వివాహ ప్రతిపాదన వచ్చిందట. కానీ వనుసా ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఇంత పెద్ద ఆఫర్ ను రిజెక్ట్ (Reject) చేసినందుకు అమ్మడు సోషల్ మీడియాలో ఒక్కసారి ట్రెండ్ (Trend) అయింది. ఆమె నిర్ణయం అనేక మందికి ఆశ్చర్యం కలిగించింది. ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. వనుసా ఫ్రీటాస్ యూత్ లో మాంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అమ్మడు ఒక్కటనే కాకుండా అనేక మ్యారేజ్ ప్రపోజల్స్ ను అందుకుంటోంది. అంతే కాకుండా అమ్మడు దుబాయ్ (Dubai) ట్రిప్ లో ఉన్నపుడు మరో క్రేజీ మ్యారేజ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. వనుసా ఫ్రీటాస్ చెప్పిన దాని ప్రకారం.. దుబాయ్ పర్యటనలో, ఒక అజ్ఞాత వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటే బ్యూటీకి 300 ఒంటెలను బహూకరించే ఆఫర్‌ తో వచ్చాడట. కానీ ఈ బ్యూటీ అతడి ఆపర్ ను కూడా రిజెక్ట్ చేసింది. 300 ఒంటెలంటే (300 Camels) మాటలు కాదు. వీటి విలువ దాదాపు ఒక లక్ష బ్రెజిలియన్ రియల్స్ కు సమానం. కానీ ఇలా క్రేజీ ప్రపోజల్ (Praposal) తీసుకొచ్చిన ఆ వ్యక్తికి అప్పటికే పెళ్లయిందని, అతడికి మరో ఐదుగురు భార్యలు ఉన్నారని ఆ తర్వాత తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్రీటాస్ వెంటనే ప్రతిపాదనను తిరస్కరించింది. 

దుబాయ్ ట్రిప్ లో కూడా.. 

ఈ ప్రతిపాదన నా దుబాయ్ ట్రిప్‌ లో రెండవ రోజున వచ్చిందని,  అనేక రకాల విలాసవంతమైన ఆఫర్లతో ఈ ట్రిప్ ఉత్సాహం కలిగించిందని అమ్మడు వెల్లడించింది.ప్రతిపాదనను (Praposal) తిరస్కరించినప్పటికీ, ఆ వ్యక్తితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు మోడల్ (Model) వెల్లడించింది. ఆమె ఆలోచనాత్మక నిర్ణయం మరియు పరిస్థితులను మేనేజ్ (Mange) చేసే విధానం చాలా బాగుందని అంతా ఆమెను అభినందిస్తున్నారు. ఇందుకోసం ఆమె అనేక మంది సోషల్ మీడియా (Social Media) యూజర్ల వద్ద నుంచి ప్రశంసలను కూడా అందుకుంటోంది. మోడల్ ఆమె నిర్ణయాలలో చిత్తశుద్ధి కీలకమని పేర్కొంది. అంతే కాకుండా ఆ బ్యూటీ ఇలా చెప్పింది.. ఇన్ఫ్లుయెన్సర్ (Influencer) గా ఉండేందుకు దాని పరిమితులు ఉన్నాయని, కానీ నేను ఎల్లప్పుడూ నా పట్ల నిజాయితీగా ఉంటానని వెల్లడించింది. ఇది అద్భుతమైన ప్రతిపాదన అని  కానీ నేను డబ్బు (Money) కోసం నా గుర్తింపు మరియు విలువలను త్యాగం చేయలేకపోయానని అమ్మడు వెల్లడించింది. వనుసా ఫ్రీటాస్ 120,000 మంది ఫాలోవర్స్ ను కలిగి ఉంది. అమ్మడు ఇన్ స్టాలో ఫొటోలు షేర్ చేసినపుడు వాటికి వేలల్లో లైక్స్, కామెంట్స్ రావడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. 

బ్యూటీ రోజు చేసే పనులను గురించి తన ఫాలోవర్లతో ఎప్పుడూ పంచుకుంటూ ఉంటుంది. ఆమె 20 సంవత్సరాల వయస్సు నుంచి జిమ్‌ (Gym) కి వెళ్తోందట. ఇటీవల, మోడల్ తన ఫిట్‌ నెస్ (Fitness) స్థాయి పురుషులను ఎలా భయపెడుతుందనే దాని గురించి గొప్పగా చెప్పుకుంది, కొంతమంది ఆమె కండరాలు చాలా బాగున్నాయని ప్రశంసిస్తున్నారట. ఇటువంటి ఇబ్బందికరమైన మ్యారేజ్ ప్రపోజల్ రావడం ఎవరినైనా ఆలోచింపజేస్తుందని మోడల్ పేర్కొంది. కేవలం డబ్బు కోసం మాత్రమే వివాహం చేసుకోము కదా అని అంటోంది. వివాహం చేసుకునేందుకు వ్యక్తి గుణాలు నచ్చడంతో పాటు మనలో కూడా ఆ వ్యక్తి అంటే ఒక అభిప్రాయం రావాలని చెప్పుకొచ్చింది. ఇలా క్రేజీ మ్యారేజ్ ప్రపోజల్స్ ను రిజెక్ట్ చేయడంతో ఈ బ్రెజిలియన్ మోడల్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ (Trend) అవుతోంది. సోషల్ మీడియా యూజర్లు ఈ ఘటనపై తమకు నచ్చిన విధంగా కామెంట్లు (Comments) చేస్తున్నారు.