Canada: మేము కాదు వాళ్లు అంటూ సమాధానం ఇచ్చిన ఇజ్రాయిల్

చిన్న బిడ్డలను చంపొద్దు అంటూ కెనడా..

Courtesy: Pexels

Share:

Canada: ఎక్కడ చూసినా సరే హింస కనిపిస్తోంది. ఇప్పటికీ రష్యా(Russia)- యుక్రేన్(Ukraine) దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం (War) ఇంకా చల్లారక ముందే మరో యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హమ్మస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడిని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ తనని తాను రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ చేస్తూ గాజా (Gaza)లో చేస్తున్న పనులు హద్దులు మీరుతున్నాయని చైనా (China), కెనడా (Canada) వంటి దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల కెనడా (Canada) అధ్యక్షుడు, గాజాలో చిన్న బిడ్డలను, ఆడవాళ్లను హింసించొద్దు, చంపొద్దు విజ్ఞప్తి చేయడం జరిగింది.

చిన్న బిడ్డలను చంపొద్దు అంటూ కెనడా..:

గాజాలో మహిళలు, పిల్లలు మరియు శిశువులను చంపడంపై కెనడా (Canada) అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, బెంజమిన్ నెతన్యాహు, ఇది హమాస్ (Hamas) చేస్తున్న పని అని, ఇజ్రాయెల్ కాదని అన్నారు.

1,200 మంది ఇజ్రాయెల్లను పొట్టను పెట్టుకున్న అక్టోబర్ 7 హమాస్ (Hamas) జరిపిన దాడులను ప్రస్తావిస్తూ, ఇజ్రాయిల్ (Israel) అధ్యక్షుడు నెతన్యాహు X లో ఇలా పోస్ట్ చేసారు, ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని హింసించే వైనం ఇజ్రాయెల్ దేశానిది కాదని, యూదులపై జరిగిన అత్యంత ఘోరమైన భయానక సంఘటనలలో హమాస్ (Hamas) పౌరులను తలలు నరకడం, మనుషుల్ని అమానుషంగా చంపడం, ఊచకోత కోసిందని గుర్తు చేయడం జరిగింది. మనుషులకు హాని తలపెట్టే క్రమంలో హామాస్ ఉన్నదని, మనుషులను సురక్షితంగా కాపాడే క్రమంలో ఇశ్రాయేలు ఉందని ఇజ్రాయిల్ (Israel) అధ్యక్షుడు నెతన్యాహు వెల్లడించారు.

ఇజ్రాయెల్ గాజాలో సేఫ్ జోన్లలో పౌరులను సురక్షితంగా ఉంచినప్పటికీ, హమాస్ (Hamas) వారిని తుపాకీలతో వదిలివేయకుండా అడ్డుకుంటుందని ఇజ్రాయిల్ (Israel) అధ్యక్షుడు గుర్తు చేశాడు. అయితే ఇప్పటివరకు ఇజ్రాయిల్ (Israel), హమాస్ (Hamas) మీద జరిపిన దాడులలో సుమారు 11 వేల మంది ప్రాణాలు కోల్పోయారని గాజాలోని ఇటువంటి పరిస్థితి నెలకొనడం చాలా బాధాకరం అంటూ వెల్లడించారు. అంతేకాకుండా పసివాళ్ళు ఇంక్యుబేటర్ లేకుండా, చలికి తట్టుకోలేక హాస్పటల్లో ఉన్న పరిస్థితిని చూసి చలించిపోయామంటూ కెనడా (Canada) అధ్యక్షుడు గుర్తు చేశాడు. అయితే ఇప్పటికైనా గాజాలో జరుగుతున్న హింసను మానుకోవాలంటూ ఇజ్రాయిల్ (Israel)ని తన వైపు నుంచి విజ్ఞప్తి చేశాడు కెనడా (Canada) అధ్యక్షుడు. ప్రపంచమంతా కూడా చూస్తుందని, ఎవరైతే తమ కుటుంబ సభ్యులను కోల్పోయారో వారందరూ ఆర్తనాదాలు చేయడం తాము గమనిస్తూనే ఉన్నామని, ఇప్పటికైనా ప్రపంచ శాంతి కోసం చిన్నపిల్లల్ని, ఆడవాళ్లను చంపడం మానుకోవాలంటూ ఇజ్రాయిల్ (Israel) అధ్యక్షుడిని హెచ్చరించడం జరిగింది కెనడా (Canada) అధ్యక్షుడు. అంతేకాకుండా మరోవైపు హమాస్ (Hamas) లోని పాలస్తీయులను మానవులను రక్షించే ఆయుధాలుగా వాడడం మానుకోవాలంటూ హమాస్ (Hamas) ని విజ్ఞప్తి చేశాడు కెనడా (Canada) అధ్యక్షుడు.

చైనా అభిప్రాయం:

గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) చర్యలు ఆత్మ రక్షణ పరిధికి మించి ఉన్నాయని, అంతే కాకుండా ఇజ్రాయెల్ (Israel) ప్రభుత్వం గాజా (Gaza) ప్రజలపై సామూహిక శిక్షను నిలిపివేయాలి అని చైనా (China) విదేశాంగ మంత్రి వాంగ్ యి తెలిపారు. గాజా (Gaza)లో హమాస్ (Hamas) మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ (Israel) దాడులకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించినందున, వాంగ్ తన సౌదీ అరేబియా కౌంటర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్కు పిలుపు మేరకు, వాళ్ళ తరఫునుంచి మాట్లాడటం జరిగింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇజ్రాయెల్ (Israel) చర్యలు స్వీయ రక్షణ పరిధిని మించిపోయాయి అని వాంగ్(Wang) అన్నారు. అంతేకాకుండా గాజా (Gaza)లోని ఎక్కువ గుంపులుగా ఉండే ప్రదేశాలను ఖాళీ చేయాలని, సురక్షిత ప్రాంతాలకు ముందుగానే తరలి వెళ్లాలి అని అభిప్రాయపడ్డారు. 2.3 మిలియన్ల మంది ప్రజలు ప్రమాదంలో ఉన్నట్లు పేర్కొన్నారు. హమాస్ (Hamas) దాడుల అనంతరం, ఇజ్రాయెల్ (Israel) గాజా (Gaza)లో 2,200 మందిని చంపిన ఇస్లామిస్ట్ గ్రూపును లక్ష్యంగా చేసుకుని భారీ ప్రతీకార బాంబు దాడిని ప్రారంభించింది. ప్రధానంగా చైనా (China) ప్రచురించిన కొన్ని నివేదికల ప్రకారం, ప్రత్యేకించి హమాస్ (Hamas) సంబంధించి దాడుల గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.