Colombia: జంక్ ఫుడ్ కి సంబంధించిన చట్టం తీసుకువచ్చిన కొలంబియా

జీవనశైలి మీద దృష్టి..

Courtesy: Pexels

Share:

Colombia: ఇప్పుడున్న జీవన శైలి (Life style)లో చాలామంది జంక్ ఫుడ్ (Junk Food) వాటి మీద ఎక్కువ మాక్కువ చూపిస్తున్నారు. ఆకలి వేసిన వెంటనే ఏదో ఒకటి తినేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఆరోగ్య (Health) విషయం పక్కనపెడితే, ముందు ఏదో ఒకటి తినేద్దాంలే అనే ఆలోచనతో ఉంటున్నారు. దీనివల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు తమ జీవన శైలి (Life style)లో ఎంతో మార్పుని ఎదుర్కోవాల్సి వస్తోంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని, మొట్టమొదటిసారిగా కొలంబియా (Colombia) జంక్ ఫుడ్ (Junk Food) కి సంబంధించిన ఒక చట్టాన్ని (Law) తీసుకువచ్చింది. 

 

చట్టం తీసుకువచ్చిన కొలంబియా: 

 

కొలంబియా (Colombia)లోని జీవనశైలి (Life Style)లో వచ్చిన మార్పుల కారణంగా సంభవించే వ్యాధులను అధిగమించే ప్రయత్నంలో, కొలంబియా (Colombia) ఇటీవల అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌పై పన్ను విధిస్తూ కొత్త చట్టాన్ని (Law) ఆమోదించింది. దీనిని 'జంక్ ఫుడ్ (Junk Food) చట్టం (Law) గా సూచిస్తూ, ఈ కొత్త బిల్లు ప్రపంచంలోనే మొట్టమొదటిది. నివేదికల ప్రకారం, ఇది ఇతర దేశాలకు ఉదాహరణగా ఉండవచ్చు. 

 

గార్డియన్‌లోని ఒక నివేదిక ప్రకారం, సంవత్సరాల తరబడి వస్తున్న మార్పుల కారణంగా ఒక నిర్ణయం చేసిన తరువాత, "జంక్ ఫుడ్ (Junk Food) చట్టం (Law) " ఇటీవలే అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా జీవన శైలి (Life style)లో విషయాలు క్రమంగా లెవీని ఇటువంటి జంక్ ఫుడ్ (Junk Food) చట్టం (Law) ఒకటి ప్రవేశపెడతారు. జంక్ ఫుడ్ (Junk Food) వంటి ఆహారాలపై అదనపు పన్ను వెంటనే 10% నుండి ప్రారంభమవుతుంది, వచ్చే ఏడాది 15%కి పెరుగుతుంది, ఇలా 2025లో 20%కి చేరుకుంటుంది అని నివేదిక పేర్కొంది. 

 

వెబ్‌సైట్, హెల్త్ పాలసీ వాచ్ ప్రకారం, సాసేజ్‌లు, తృణధాన్యాలు, జెల్లీలు, జామ్‌లు, ప్యూరీలు, సాస్‌లు, మసాలాలతో సహా అధిక షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్, ఉప్పు, కొవ్వులతో కూడిన అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్‌లు పన్నులను ఎదుర్కొంటున్నాయి. ఒక సగటు కొలంబియన్ రోజుకు 12 గ్రాముల ఉప్పును వినియోగిస్తున్నాడని నివేదికలు పేర్కొన్నాయి. ఇది లాటిన్ అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుంది. సోడియం వంటి అధిక వినియోగం అధిక రక్తపోటు, ఊబకాయం మరియు మరిన్ని సహా వివిధ ఆరోగ్య (Health) ప్రమాదాలకు దారితీస్తుంది. వాస్తవానికి, కొలంబియా (Colombia) మెయిల్‌మాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని చేసిన రీసెర్చ్ ప్రకారం, అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్ (Junk Food) వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భసయ సంబంధించిన ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉందని తేలింది. 

 

చక్కెర, కొవ్వు వంటి అనారోగ్యకరమైన పదార్ధాల అధిక కంటెంట్ ఉన్న ఆహారాలపై కొలంబియా (Colombia) తప్పనిసరి ఆరోగ్య (Health)హెచ్చరికలను కూడా ప్రవేశపెడుతోందని గార్డియన్‌లోని నివేదిక పేర్కొంది. ఆరోగ్య (Health)హెచ్చరిక లేబుల్ ఉన్న ఉత్పత్తులపై పన్ను వర్తించబడుతుంది. 

 

ఆయుష్షుని పెంచే మధ్యధరా జీవనశైలి: 

 

మధ్యధరా (మెడిట‌రేనియ‌న్) జీవనశైలి (Life Style) మంచి జీవన నాణ్యత కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. అక్కడ జీవ‌న‌శైలే ఆరోగ్యానికి (Health) కూడా మంచిది. ఇటీవల జరిగిన ఒక కొత్త రీసెర్చ్ ప్రకారం, మొదటిసారిగా, వేరే ప్రాంతంలో నివసించేవారు జీవనశైలి (Life Style) యొక్క ప్రయోజనాలను పరిశీలించింది. మధ్యధరా జీవనశైలి (Life Style), మనిషి ఆయుష్షుని పెంచే విధంగా ఉన్నట్లు తేల్చి చెప్పింది. 

 

మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్ అనే మెడికల్ జర్నల్‌లో వచ్చిన నివేదిక ప్రకారం, మెడిటేరియన్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు జీవన శైలి (Life style) అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వారు ఆహారం (Food)గా తీసుకునే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, శారీరిక శ్రమ, సంతోషకరమైన బంధాలు, ఇంకా మరెన్నో పరిగణలోకి తీసుకున్న తర్వాత, ముఖ్యంగా అక్కడ నివసించే వారి మెరుగైన ఆరోగ్యం (Health), విశ్రాంతి సమయం, తక్కువ సంఖ్యలో ఉన్న మృతుల రేటు, ఇవన్నీ కూడా మెడిటేరియన్ జీవన శైలి (Life style) యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తున్నాయి. 

వివరంగా చెప్పాలంటే, ఈ జీవనశైలి (Life Style)ని పాటించే వారిలో మరణాల ప్రమాదం 29% తక్కువ. అంతేకాకుండా క్యాన్సర్ మరణాల ప్రమాదం 28% తక్కువ ఉన్నట్లు వెల్లడైంది. ఈ జీవనశైలి (Life Style) యొక్క ప్రతి అంశం అన్ని కారణాల మరణాలు అనేవి చాలా తక్కువగా ఉండటాన్ని సూచిస్తున్నాయి. అయితే మెడిటేరియన్ జీవనశైలి (Life Style)లో భాగమైన, శారీరక శ్రమ, విశ్రాంతి మరియు సామాజిక అలవాట్లు మరియు అనుకూలత అనేది నిజానికి గొప్ప ప్రయోజనాలతో ముడిపడి ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.