Hamas-Israel: హమాస్‌ ఉగ్రదాడి గురించి వాళ్లకు ముందే తెలుసా?

Hamas-Israel: ఇజ్రాయెల్‌(Israel)పై అక్టోబర్‌ 7న హమాస్‌(Hamas) జరిపిన నరమేధానికి సంబంధించిన సమాచారం గాజా(Gaza)లోని ఫొటో జర్నలిస్టులకు ముందే తెలుసా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హమాస్‌ ఉగ్రవాదులు (Hamas Terrorists) జరిపిన మారణకాండకు ప్రతీకారంగా గాజాపై (Gaza) ఇజ్రాయెల్‌ (Israel) సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. హమాస్‌ మూలాలను నాశనం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో కెనడాలోని ఇజ్రాయెల్‌ దౌత్యవేత్త ఇడిట్‌ షమిర్‌(Edit Shamir) ఎక్స్‌ (ట్విటర్‌)లో చేసిన పోస్టు చర్చనీయాంశమవుతోంది. అక్టోబర్‌ 7న హమాస్‌(Hamas) ఉగ్రవాదులు […]

Share:

Hamas-Israel: ఇజ్రాయెల్‌(Israel)పై అక్టోబర్‌ 7న హమాస్‌(Hamas) జరిపిన నరమేధానికి సంబంధించిన సమాచారం గాజా(Gaza)లోని ఫొటో జర్నలిస్టులకు ముందే తెలుసా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హమాస్‌ ఉగ్రవాదులు (Hamas Terrorists) జరిపిన మారణకాండకు ప్రతీకారంగా గాజాపై (Gaza) ఇజ్రాయెల్‌ (Israel) సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. హమాస్‌ మూలాలను నాశనం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో కెనడాలోని ఇజ్రాయెల్‌ దౌత్యవేత్త ఇడిట్‌ షమిర్‌(Edit Shamir) ఎక్స్‌ (ట్విటర్‌)లో చేసిన పోస్టు చర్చనీయాంశమవుతోంది. అక్టోబర్‌ 7న హమాస్‌(Hamas) ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేస్తారన్న సంగతి గాజాలోని ఫొటో జర్నలిస్టులకు ముందే తెలుసా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్‌లో ప్రముఖ వార్తా పత్రిక ‘హానెస్ట్‌ రిపోర్టింగ్‌’(Honest reporting) నివేదికను ఆమె ఎక్స్(ట్విట్టర్)లో ఉటంకించారు. 

హమాస్‌(Hamas) ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేస్తున్న సమయంలో తీసిన ఫొటోల్లో గాజా కేంద్రంగా పని చేస్తున్న కొందరు ఫొటో జర్నలిస్టులు ఉన్నారు. వారు కూడా ఉగ్రవాదుల కదలికలను కెమెరాల్లో బంధిస్తున్నట్లు అందులో ఉంది. దీనిని బట్టి అక్టోబర్‌ 7న జరిగిన దాడులకు సంబంధించి వారికి ముందస్తు సమాచారం ఉండే ఉంటుందని ఇడిట్‌ షమిర్‌(Edit Shamir) అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్‌(Israel)పై దాడి చేయడానికి ముందు గాజా సరిహద్దులో హమాస్‌ చీఫ్‌ యాహ్యా సిన్వర్‌(Yahya Sinwar)తో హస్‌ ఇసాలయ్‌(Has Isalai) అనే ఫొటో జర్నలిస్టు ఫొటో దిగాడు. 

ఆయనతో పాటు మరో ఐదుగురు ఫొటో జర్నలిస్టులకు హమాస్‌ దాడుల గురించి ముందస్తు సమాచారం తెలిసే ఉంటుందని ‘ హానెస్ట్‌ రిపోర్టింగ్‌’(Honest reporting) తన నివేదికలో పేర్కొంది. హమాస్‌ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నప్పుడు ఈ ఆరుగురూ ఇజ్రాయెల్‌(Israel) లోనే ఉన్నారు. వీరంతా అంతర్జాతీయ పత్రికలకు ఫ్రీలాన్సర్లుగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ ట్యాంకర్‌ను హమాస్‌ ఉగ్రవాదులు కాల్చేయడం, పలువుర్ని అపహరించిన ఫొటోలను వీళ్లే తీసినట్లు సమాచారం.

మరోవైపు హమాస్‌(Hamas) దాడి గురించి ఫొటో జర్నలిస్టులకు ముందే తెలుసు అని చెప్పేందుకు గాజాలోని ఓ ఔత్సాహికుడు చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు మరింత బలాన్నిస్తోంది. ‘హమాస్‌కు చెందిన జర్నలిస్ట్ హస్‌ ఇసాలయ్‌ ఇజ్రాయెల్‌పై దాడిచేసిన చిత్రాలను తీసి, మీడియా సంస్థలకు అమ్ముకున్నారు. ప్రస్తుతం గాజాలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి అది కూడా కారణమే’ అంటూ టెలిగ్రామ్‌(Telegram)లో రాసుకొచ్చాడు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఫ్రీలాన్స్‌ జర్నలిస్టులపై చర్యలు తీసుకునే అవకాశముందని గ్రహించిన అంతర్జాతీయ మీడియా సంస్థలు ఫొటో సోర్సులను తమ డేటాబేస్‌(Database)లో తొలగించినట్లు హానెస్ట్‌ రిపోర్టింగ్‌(Honest reporting) తన నివేదికలో పేర్కొంది. 

ఇజ్రాయెల్‌పై దాడి చేయాలని గత కొన్ని నెలలుగా హమాస్‌ ప్రణాళికలు రచించిందని తెలిపింది. దాడులు జరుగుతాయని ముందే తెలిసి.. హమాస్‌ (Hamas) ఉగ్రవాదులకు తెలియకుండా ఫొటో జర్నలిస్టులు డిసెంబర్‌ 7 ఉదయాన్నే ఇజ్రాయెల్‌కు చేరుకున్నారా? లేదా వ్యూహంలో భాగంగానే వాళ్లను హమాస్‌ ముందుగా పంపించి ఉంటుందా? అని హానెస్ట్‌ రిపోర్టింగ్‌ సందేహం వ్యక్తం చేసింది. హమాస్‌ జరిపిన దాడుల్లో 1,400 పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో 200 మందికి పైగా సామాన్యులను హమాస్‌ ఉగ్రవాదులు బందీలుగా తీసుకెళ్లిపోయారు. 

హమాస్‌(Hamas) మిలిటెంట్లను ఏరివేసే లక్ష్యంతో ఇజ్రాయెల్(Israel) భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే యుద్ధ విమానాలతో విరుచుపడుతోన్న ఇజ్రాయెల్‌.. భూతల దాడుల్ని కూడా తీవ్రతరం చేసింది. గత నెల భూతలదాడుల్ని ప్రారంభించిన నాటి నుంచి హమాస్‌కు చెందిన 130 టన్నెళ్ల (సొరంగాలు) ప్రవేశ ద్వారాలను సైన్యం ధ్వంసం చేసిందని ఐడీఎఫ్(Israel Defense Forces) వెల్లడించింది. హమాస్‌కు చెందిన టన్నెళ్లు, రాకెట్‌ లాంచర్లు, ఇతర ఆస్తుల్ని గుర్తించి ధ్వంసం చేసేందుకు కంబాట్ ఇంజినీరింగ్ విభాగం మార్గం సుగమం చేస్తోందని పేర్కొంది. 

ఇదిలా ఉంటే.. హమాస్‌ అగ్ర నేత యాహ్యా సిన్వర్‌(Yahya Sinwar)ను చుట్టుముట్టామని, అతడు ఉన్న బంకర్‌ను నియంత్రణలోకి తీసుకున్నామని ఇజ్రాయెల్‌ సైన్యం బుధవారం ప్రకటించింది. యుద్ధం తుది దశకు చేరుకుందని తెలిపింది. సిన్వర్‌ను గాజా బిన్‌ లాడెన్‌గా ఇజ్రాయెల్‌ భావిస్తుంటుంది. అతడే లక్ష్యంగా గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్‌ దిగింది.