చైనాలో భారీ భూపకంపం.. 118 మంది మరణం

Earthquake in China: చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప ధాటికి 118 మంది మరణించారు. 400 మందికిపైగా గాయపడ్డారు

Courtesy: x

Share:

బీజింగ్: చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాయవ్య చైనాలో పెద్ద సంఖ్యలో భవనాలు కుప్పకూలిపోయాయి. భూకంప ధాటికి 118 మంది మరణించారు. 400 మందికిపైగా గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాయవ్య చైనాలోని గన్సు, కింగ్‌హై ప్రావిన్సులలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీనితీవ్రత 6.2గా నమోదయింది. భూమి లోపల 35 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభవించాయని, గన్సు ప్రావిన్సులోని లాన్‌జ్ కు 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని చైనా మీడియా తెలిపింది. అర్ధరాత్రివేళ భూకంపం రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు పలు భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో భారీ నష్టం సంభవించింది. మంగళవారం తెల్లవారుజున అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.