Canada: హర్దీప్ హత్య కేసులో ఆధారాలు ఎక్కడ అంటున్న భారత్

Canada: గత జూన్‌లో ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా (Canada) ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్‌దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా (Canada) ప్రధాని […]

Share:

Canada: గత జూన్‌లో ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా (Canada) ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్‌దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) పార్లమెంటుకు తెలియజేశారు. కానీ ఇప్పటివరకు ఈ హత్య (Murder) కేసు (Case)లో, భారత దేశ హస్తం ఉందని ఎటువంటి ఆధారాలు లేవంటూ భారత్ (India) తేల్చి చెబుతోంది. దీనికి సంబంధించి కెనడా (Canada) కూడా ఎటువంటి ఆధారాలు సమర్పించలేదని నివేదించింది భారత్ (India). 

ఆధారాలు ఎక్కడ అంటున్న భారత్: 

జూన్‌లో జరిగిన నిజ్జర్‌ (Hardeep Nijjar) హత్య (Murder)లో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందన్న ఆరోపణకు మద్దతుగా కెనడా (Canada), తన మిత్రదేశాల నుంచి భారత్ (India)‌కు ఎలాంటి విశ్వసనీయమైన ఆధారాలు అందలేదని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ (Sanjay Kumar Verma) ది గ్లోబ్ అండ్ మెయిల్‌కి తెలిపారు. కెనడా (Canada) తన వైపు నుంచి చేస్తున్న దర్యాప్తులో భాగంగా తమకు ఇప్పటివరకు, హత్య (Murder) కేసు (Case)లో భారత్ (India) ప్రమేయం ఉంది అంటూ నిరూపితమయ్యే ఎటువంటి ఆధారాలు అందలేదని వర్మ (Sanjay Kumar Verma) అన్నారు. అసలు ఇప్పటివరకు దర్యాప్తులో పురోగతి ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించారు వర్మ (Sanjay Kumar Verma). అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా, భారతదేశ మీద ఇటువంటి నిందలు ఎలా వేస్తారు అంటూ కెనడా (Canada)ను మరొకసారి ప్రశ్నించడం జరిగింది. 

ప్రశ్నించిన కెనడా పోలీసులు: 

ఇటీవల రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) బృందాలు సర్రేలోని ISI ప్లాంట్ అని ఆరోపించిన రహత్ రావ్ ఆఫీసులకు వెళ్లడమే కాకుండా, ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Nijjar) హత్య (Murder)కు సంబంధించి రెండు గంటలపాటు అతనిని ప్రశ్నించినట్లు వర్గాలు తెలిపాయి. RCMP సిబ్బంది ముందు తన సోషల్ మీడియా పేజీల నుండి అన్ని పోస్ట్‌లను తొలగించమని రావును కోరినట్లు వెల్లడించారు. అయితే నిజానికి కెనడా (Canada) పోలీసులు,  ISI ప్లాంట్ అని ఆరోపించిన రహత్ రావ్ ఆఫీసులను సందర్శించడానికి గల ముఖ్యమైన కారణాన్ని గోప్యంగానే ఉంచినట్లు తెలుస్తోంది. అయితే కచ్చితంగా నిజ్జర్‌ (Hardeep Nijjar) హత్య (Murder) కేసు (Case)కు సంబంధించి ప్రశ్నించి ఉండవచ్చు అని నివేదికలు పేర్కొన్నాయి.

భారత్ మీద ఎటువంటి ప్రభావం: 

ఇటీవల కెనడా (Canada)కు చెందిన 21 మంది దౌప్తవేత్త (Diplomat)లను తమ కుటుంబాలను అనైతికంగా భారతదేశ చట్ట విరుద్ధంగా ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా కెనడా (Canada) వారికి వీసా  (Visa)లు మంజూరు చేయకపోవడం వంటి  నిర్ణయాలు భారతదేశం (India) తీసుకున్నట్లు, కెనడా (Canada) చెప్పడమే కాకుండా, ఇప్పుడు ప్రతి చర్యగా కెనడా (Canada) తన వైపు నుంచి మరొక నిర్ణయాన్ని ముందు పెట్టడం జరిగింది. కొత్తగా 41 మంది భారతీయ దౌప్తవేత్త (Diplomat)లను కెనడా (Canada) ఉపసంహరించుకుంటున్నట్లు ఇప్పటికే వెల్లడించింది.

మళ్లీ మామూలు స్థితికి: 

కెనడా సెప్టెంబర్‌లో భారత్ (India)‌తో వాణిజ్య చర్చలను నిలిపివేసింది. వాణిజ్య మిషన్‌ను వాయిదా వేసింది, అయితే వాణిజ్య చర్చలను పునఃప్రారంభించేందుకు భారతదేశం ఆసక్తిగా ఉందని హైకమిషనర్ తెలిపారు. ఈ విషయాలను చర్చించడానికి..కెనడియన్ వ్యాపారవేత్తల ప్రతినిధి బృందాన్ని భారతదేశానికి న్యూఢిల్లీ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దౌత్య సంబంధాలను సరిదిద్దుకోవడానికి, వృత్తిపరమైన కమ్యూనికేషన్, సంభాషణలలో ఇరుపక్షాలు పాల్గొనవలసిన అవసరాన్ని వర్మ (Sanjay Kumar Verma) నొక్కిచెప్పారు. ఏదిఏమైనాప్పటికీ, ఎటువంటి ఆధారాలు లేకుండా నిందలు మోపడం, ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తెంపాలని ప్రయత్నిస్తున్న ఎవరైనా సరే పట్టుబడక తప్పదు అంటూ, కెనడా (Canada)లో మరణించిన హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Nijjar) కేసు (Case) విషయం గురించి మాట్లాడారు వర్మ (Sanjay Kumar Verma).