అమెజాన్ లో మరోసారి లేఆఫ్స్.. ఏడాది ప్రారంభంలో షాకిచ్చిన కంపెనీ!

Amazon: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగుల లే ఆఫ్స్ కు దిగింది. గత సంవత్సరం నుంచి ఈ కంపెనీ వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలంగించిన విషయం తెలిసిందే. తా

Courtesy: Top Indian News

Share:

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగుల లే ఆఫ్స్ కు దిగింది. గత సంవత్సరం నుంచి ఈ కంపెనీ వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలంగించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ కంపెనీ స్ట్రీమింగ్, స్టూడియో కార్యకలాపాలు (ప్రైమ్ వీడియో మరియు MGM స్టూడియోస్ విభాగాల) నుండి వందలాది ఉద్యోగులపై లే ఆఫ్స్ విధించింది. ఈ మేరకు ప్రైమ్ వీడియో, అమెజాన్ MGM స్టూడియోస్ విభాగం బుధవారం ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమో ద్వారా తెలిపినట్లు సమాచారం. ఏడాది ప్రారంభంలోనే వందలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైందని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక వెల్లడించింది.

కంపెనీ అనేక రివ్యూలు చేసిన అనంతరం ప్లాట్‌ఫారమ్‌ను మెరుగుపరచడం కోసం పెట్టుబడులను తగ్గించే మార్గాలను గుర్తించిందని సిబ్బందికి తెలియజేశారు. బిజినెస్ ను ఆప్టిమైజ్ చేయడం ఉద్యోగుల తగ్గింపునకు దారి తీస్తుందని పేర్కొన్నారు. అమెజాన్ లైవ్ స్ట్రీమింగ్ సర్వీసెస్ ప్రైమ్ వీడియో స్టూడియో విభాగంలోని మొత్తం ఉద్యోగుల్లో 35 శాతం మందిని తొలగించేందుకు సంస్థ సిద్ధమైంది. దీని ప్రకారం చూసుకుంటే సుమారు 500 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు.  తాజా తొలగింపులు అంతర్జాతీయంగా ఉంటాయని వెల్లడించినట్లుగా బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

"మేము కొన్ని రంగాలలో పెట్టుబడులను తగ్గించడానికి లేదా నిలిపివేయడానికి ఉండే అవకాశాలను గుర్తించాము. అత్యధిక ప్రభావాన్ని అందించే కంటెంట్ మరియు ఉత్పత్తి కార్యక్రమాలపై దృష్టి సారించాము. ఈ నిర్ణయాల ఫలితంగా, మేము అంతటా వందల సంఖ్యలో ఉద్యోగాల్లో కోత విధించే అవకాశం ఉంటుంది." అని లేఖలో పేర్కొన్నట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ లేఆఫ్ డ్రైవ్ నుండి ప్రభావితమైన ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్యను Amazon వెల్లడించలేదు.