మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హఫీజ్ సయీద్‌ను అప్పగించండి.. పాక్‌కు భారత్ అభ్యర్థన!

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హఫీజ్ సయీద్‌పై మోదీ ప్రభుత్వం ఉచ్చు బిగించడం ప్రారంభించింది. ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని భారత ప్రభుత్వం పాక్ ను కోరినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Courtesy: IDL

Share:

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హఫీజ్ సయీద్‌పై మోదీ ప్రభుత్వం ఉచ్చు బిగించడం ప్రారంభించింది. ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని భారత ప్రభుత్వం పాక్ ను కోరినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్‌లోని దౌత్య వర్గాల సమాచారం ప్రకారం, హఫీజ్ సయీద్‌ను అప్పగించడానికి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని అభ్యర్థిస్తూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి  పాక్ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన పంపినట్లు కథనాలు చెబుతున్నాయి. అయితే విదేశాంగ శాఖ ఆ వార్తలను ఇంకా ధృవీకరించలేదు. 26/11 ముంబై దాడికి హఫీజ్ సయీద్ సూత్రధారిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆరుగురు అమెరికన్లు సహా 166 మంది చనిపోయారు.

ఇస్లామాబాద్ పోస్ట్ ప్రకారం, ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని భారత ప్రభుత్వం అధికారికంగా పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హఫీజ్ మహ్మద్ సయీద్ సంస్థ (లష్కరే తోయిబా)ను ఇప్పటికే అమెరికా కూడా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. హఫీజ్‌పై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది.

2008 నవంబరు 26న దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పాటు మరెన్నో ఉగ్రదాడుల్లో హఫీజ్‌ సయీద్‌ కీలక సూత్రధారిగా ఉన్నాడు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదుల్లో ఒకడైన సయీద్‌ను.. ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి తలపై అమెరికా 10 మిలియన్‌ డాలర్ల రివార్డ్‌ ప్రకటించింది. వీటితోపాటు ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించారన్న ఆరోపణలతో పలు మనీలాండరింగ్‌ కేసుల్లోనూ హఫీజ్‌పై ఎన్నో కేసులు ఉన్నాయి.

ముంబయి పేలుళ్ల కేసులో విచారణ ఎదుర్కొనేందుకు అతడిని తమకు అప్పగించాలని భారత్‌ ఎన్నోసార్లు డిమాండ్‌ చేసింది. కానీ, భారత్‌-పాక్‌ మధ్య ఖైదీల అప్పగింత ఒప్పందం లేకపోవడంతో ఈ ప్రక్రియ క్లిష్టంగా మారింది. కాగా.. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారన్న పలు కేసుల్లో హఫీజ్‌ 2019లో అరెస్టయ్యాడు. ఈ కేసులకు సంబంధించి అతడికి 31 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే, ప్రస్తుతం పాక్‌ జైల్లో ఉన్న హఫీజ్‌.. అక్కడి నుంచే దేశ రాజకీయాలను శాసిస్తున్నట్లు పలు కథనాలు చెబుతున్నాయి. సయీద్‌ ఏర్పాటు చేసిన ‘ది పాకిస్థాన్‌ మర్కజీ ముస్లిం లీగ్‌’ (పీఎంఎంఎల్‌) పార్టీ.. వచ్చే ఏడాది జరగబోయే పాక్‌ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇదే పార్టీ తరఫున హఫీజ్‌ తనయుడు తల్హా సయీద్‌ ఎన్‌ఏ-127 స్థానం నుంచి బరిలోకి దిగుతున్నాడు.