Visa: వీసా అప్లై చేసినవారికోసం అమెరికా సన్నాహాలు

వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు కృషి..

Courtesy: Twitter

Share:

Visa: భారతీయ విద్యార్థులకు (Student) ఇతర దేశాలకు వెళ్లి చక్కని పైచదువులు చదవాలని మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఆశపడుతూ ఉంటారు. అయితే క్రమంలోనే పలు దేశాలు తమ వైపు నుంచి భారతీయ విద్యార్థుల (Student) కోసం చక్కని అవకాశాలను కల్పిస్తుండడం విశేషం. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో భారత్కు చెందిన విద్యార్థులకు (Student) అమెరికా (US) రికార్డు స్థాయిలో వీసా (Visa)లు జారీ చేసినట్లు ప్రకటించింది. US నుండి ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తులను దాఖలు చేసిన భారతదేశం (India) నుండి 90,000 కంటే ఎక్కువ వీసా (Visa)లు జారీ చేసినట్లు భారతదేశం (India)లోని US మిషన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అయితే గత ఏడాది సుమారు లక్షల 40 వేల మీసాలను మంజూరు చేసినట్లు US ప్రకటించింది. ప్రస్తుతం కూడా భారతదేశ విద్యార్థుల (Student) కోసం వీలైనాన్ని ఎక్కువ వీసా (Visa)లను మంజూరు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు US వెల్లడించింది.

వీసా అప్లై చేసినవారికోసం:

భారతదేశం (India)తో ప్రజల-ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడానికి బిడెన్ పరిపాలన ప్రయత్నంలో భాగంగా, US గత సంవత్సరం భారతీయ విద్యార్థులకు (Student) 1,40,000 కంటే ఎక్కువ వీసా (Visa)లు జారీ చేసింది. వీసా (Visa) అపాయింట్మెంట్ నిరీక్షణ వ్యవధిని తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. ఒక ఇంటర్వ్యూలో, వీసా (Visa) సేవలకు సంబంధించిన డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జూలీ స్టఫ్ట్ మాట్లాడుతూ, భారతదేశం (India)లోని US మిషన్లు వారానికి ఆరు, ఏడు రోజులు పనిచేశాయని, విద్యార్థులు (Student) తమ తరగతులు ప్రారంభమయ్యే ముందు ఇంటర్వ్యూలు జరిగేలా చూసుకున్నారని చెప్పారు. అనేక వర్గాలలో అత్యధిక సంఖ్యలో వీసా (Visa)లకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున భారతదేశం (India) ప్రత్యేకమైనది. కేవలం సందర్శకులే కాదు, విద్యార్థులే (Student) కాదు, ప్రతి ఒక్కరు ఎవరైతే అమెరికా (US) వెళ్లాలి అనుకుంటున్నారు వారందరికీ కూడా తమ తరఫునుంచి వీసా (Visa)లు మంజూరు చేయాల్సిన డిమాండ్ తమపైన ఉందని గుర్తు చేశారు. కాబట్టి నిరీక్షణ సమయాన్ని తగ్గించడమే తమ ప్రాధాన్యత అంటూ వెల్లడించారు డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జూలీ స్టఫ్ట్.

 

రికార్డ్ స్థాయిలో వీసాలు జారీ చేసిన యూఎస్:

ఇటీవల ట్విట్టర్ పోస్ట్ ప్రకారం, US మిషన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రపంచ దేశాలలో, 4 స్టూడెంటు వీసా (Visa)లలో ఒకటి భారతదేశం (India)లోనే జారీ చేసినట్లు పేర్కొంది. ఉన్నత విద్య లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ను ఎంచుకున్న విద్యార్థులందరికీ (Student) తన వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసింది, యుఎస్ మిషన్. 2022లో, యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులతో (Student) ప్రపంచంలోని అగ్ర దేశంగా భారత్ చైనాను అధిగమించింది. 2020లో దాదాపు 2,07,000 మంది అంతర్జాతీయ భారతీయ విద్యార్థులు (Student) USలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల (Student) సంఖ్య పెరుగుతోందని తాజా నివేదికలు పేర్కొన్నాయి. భారతదేశం (India) నుండి విద్యార్థులను (Student) ఆకర్షించడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు అందించే సులభతరమైన అప్లికేషన్ ఫార్మాలిటీస్, ఆర్థిక సహాయం మరియు స్కాలర్షిప్ ఫలితంగా, ఉన్నత విద్య అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు (Student) నిజానికి ఇది ఒక చక్కని అవకాశంగా మారింది.

ఫ్రాన్స్ కూడా భారతదేశం (India) నుండి సుమారు 30,000 మంది విద్యార్థులను (Student) స్వాగతించాలని తన లక్ష్యాన్ని, విద్యార్థులను (Student) ప్రోత్సహించాలని కోరికను వ్యక్తం చేసింది. 2030 నాటికి భారతీయ విద్యార్థుల (Student) సంఖ్యను పెంచడానికి దేశం ప్రయత్నాలు చేస్తోంది. విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడం, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం మరియు రెండు దేశాల మధ్య స్నేహాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంటున్నారు దేశాలు.