NASA: మీరు కాకపోయినా మీ పేరైనా గురుగ్రహం పైకి వెళ్లాలనుకుంటున్నారా?

ఈ నాసా ఆఫర్ మీకోసమే

Courtesy: Pexels

Share:

NASA: యూరోపా క్లిప్పర్(Europa Clipper) ప్రాజెక్టుపై అవగాహన కోసం నాసా(NASA) ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మీ పేరును గురు గ్రహంపైకి(Jupiter) తీసుకెళ్లడానికి ఓ ఆఫర్ ఇచ్చింది.

గురు గ్రహానికి(Jupiter) ఉపగ్రహమైన 'యూరోపా'(Europa) గురించి పరిశోధన కోసం నాసా(NASA) ఓ ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. 'మెసేజ్ ఇన్ ఎ బాటిల్'(Message in a Bottle) పేరుతో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్(Elon Musk) కంపెనీ స్పేస్‌ ఎక్స్‌కు(Space X) చెందిన ఫాల్కన్ హెవీ(Falcon Heavy) రాకెట్‌ పై 2024లో క్లిప్పర్ యూరోపా ఉపగ్రహం(Europa satellite) చుట్టూ చక్కర్లు కొట్టనుంది. సముద్రాలతో నిండిన ఆ ఉపగ్రహంపై(Satellite) జీవం ఉందో లేదో తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది.

ఈ మెగా ప్రయోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాజాగా నాసా(NASA) ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. 'సెండ్ యువర్ నేమ్ టు యూరోపా' (Send your name to Europe) పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది.  ఈ ప్రాజెక్ట్‌ను 'మెసేజ్ ఇన్ ఎ బాటిల్'(Message in a Bottle) అని పిలుస్తారు 'ఇన్ ప్రైజ్ ఆఫ్ మిస్టరీ: ఎ పోయెమ్ ఫర్ యూరోపా' అనే అమెరికా కవి అడా లిమోన్(Ada Limon) రాసిన కవితతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు పంపించే పేర్లను గురు గ్రహంపైకి పంపించనుంది నాసా(NASA). 

యూరోపా కవితతో పాటు అందరి పేర్లు టాంటాలమ్ మెటల్(Tantalum metal) ప్లేట్లపై చెక్కి దానిని యూరోపా క్లిప్పర్ రాకెట్(Europa Clipper Rocket) లో ఉంచనున్నారు. అలాగే ఈ ప్లేట్లపై మైక్రోచిప్‌లనూ(Micro Chip) ఉంచుతారు. ఈ గురుగ్రహ ఉపగ్రహమైన యూరోపా భూమి నుండి 1.8 బిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటుందని శాస్త్రవేత్తలు(Scientists) చెబుతున్నారు. దాదాపు ఆరు సంవత్సరాల పాటు ప్రయాణిస్తుంది.  అంతరిక్ష పరిశోధనలో భాగం కావడానికి ప్రజలకు ఇది ఒక ప్రత్యేక అవకాశం. నాసా(NASA) ప్రాజెక్ట్ కోసం దాదాపు 700,000 మంది తమ పేర్లను పంపారు. కాలిఫోర్నియాలోని(California) సాంకేతిక నిపుణులు ఈ పేర్లను నిజంగా చిన్న సిలికాన్ చిప్‌లో(Silicon chip) ముద్రించడానికి ప్రత్యేక సాంకేతికతను ఉపయోగిస్తారు. టెక్స్ట్ యొక్క ప్రతి పంక్తి మానవ వెంట్రుక కంటే చాలా చిన్నదిగా ఉంటుంది, సూపర్ స్మాల్ పరిమాణంలో(Super small size) ఉంటుంది .. కేవలం 75 నానోమీటర్లు మాత్రమే.

మీరు 'మెసేజ్ ఇన్ ఎ బాటిల్'(Message in a Bottle) ప్రాజెక్ట్‌లో చేరాలనుకుంటే, మీరు డిసెంబర్ 31లోపు దీన్ని చేయవలసి ఉంటుంది. స్పేస్‌షిప్(Space Ship) చాలా సంవత్సరాలు బృహస్పతి చుట్టూ తిరుగుతూ అనేక సార్లు యూరోపాకు దగ్గరగా ఉంటుంది. ఇది యూరోపా ఉపరితలం, సముద్రం, మంచుతో నిండిన క్రస్ట్ మరియు గాలి గురించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించడానికి ప్రత్యేక సాధనాలను కలిగి ఉంది. బృహస్పతి చంద్రునిపై జీవం ఉంటుందో లేదో తెలుసుకోవడానికి ఈ మిషన్ మాకు సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పేర్లు ఎలా  పంపాలంటే.. మొదట http://go.nasa.gov/MessageInABottle ను క్లిక్ చేసి ఆ లింక్ లోకి వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలి. డిసెంబర్ 31వ తేదీ 2023 లోపు పేర్లు పంపాల్సి ఉంటుంది.  

ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్‌(Falcon Heavy Rocket) ద్వారా ఈ ప్రయోగం చేపట్టనుంది నాసా(NASA). 2024లో ఈ ప్రయోగం చేపట్టనున్నారు. గురు గ్రహం ఉపగ్రహమైన యూరోపా(Europa) సముద్రాలతో నిండి ఉంటుంది. ఆ ఉపగ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోవడమే లక్ష్యం. భూమి నుండి ఈ ఉపగ్రహం 2.6 బిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2024లో ప్రయోగం చేపడితే అన్నీ సవ్యంగా జరిగితే 2030 నాటికి  క్లిప్పర్ రాకెట్(Clipper Rocket) యూరోపా గ్రహం వద్దకు చేరుకుంటుంది. ఈ రాకెట్ యూరోపా చుట్టూ దాదాపు 50 సార్లు తిరుగుతుంది. 

క్లిప్పర్ కంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(European Space Agency) 2023 ఏప్రిల్ లో జూపిటర్ ఐసీమూన్ ఎక్స్‌ప్లోరర్(Jupiter's IceMoon Explorer) లేదా జ్యూస్ పేరుతో ఓ పరిశోధక నౌకను యూరోపా పైకి ప్రయోగించింది. భవిష్యత్తులో అణుశక్తితో నడిచే జలాంతర్గాములను యూరోపాలోని సముద్రాల్లో ప్రయాణించేలా చేసి ఆ ఉపగ్రహం గురించి మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు ఈ ప్రయోగం చేపట్టారు.