Israel Hamas war: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వేళ బిన్ లాడెన్ రాసిన లేఖ వైరల్..

పాలస్తీనాను ఎవరూ బందీ చేయలేరు

Courtesy: Twitter

Share:

Israel Hamas war: ఇజ్రాయెల్ హమాస్(Israel Hamas) మధ్య ప్రస్తుతం యుద్ధం జరుగుతోంది. తమపై చేసిన దాడులకు ప్రతీకారంగా మొత్తం హమాస్(Hamas) నెట్‌వర్క్‌నే నామ రూపాల్లేకుండా చేయాలని ఇజ్రాయెల్(israel) దళాలు గాజాలో(Gaza) మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి. పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న వేళ.. గతంలో అమెరికన్లకు ఒసామా బిన్ లాడెన్(Osama Bin Laden) రాసిన ఒక లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా(viral) మారింది.

ఒసామా బిన్ లాడెన్ (Osama Bin Laden) మీకు గుర్తున్నాడా. అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 దాడులకు పాల్పడిన అల్ ఖైదా(Al Qaeda) అధినేత బిన్ లాడెన్‌ను(Osama Bin Laden) అమెరికా వెంటాడి మరీ చంపింది. బిన్ లాడెన్ పాక్‌లో(Pakistan) తలదాచు కుంటున్నట్లు గుర్తించిన అగ్ర రాజ్య దళాలు.. వాయు మార్గంలో వచ్చి మట్టు బెట్టారు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్-పాలస్తీనా(Israel-Palestine) మధ్య భీకరపోరు సాగుతున్న వేళ.. గతంలో అమెరికా(America) ప్రజలను ఉద్దేశించి బిన్ లాడెన్ రాసిన లేఖ వైరల్ అవుతోంది. 9/11 దాడుల తర్వాత అమెరికన్ ప్రజలకు ఒసామా బిన్ లాడెన్ లేఖ రాశాడు. తాజాగా ఆ లేఖను నెటిజన్లు షేర్(Share) చేస్తున్నారు. అందులో కొందరు బిన్ లాడెన్‌ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించడం గమనార్హం. ఒకే రోజు వేలాది మంది నెటిజన్లు షేర్ చేయడంతో బిన్ లాడెన్(Osama Bin Laden) లేఖ వీడియోలు వైరల్‌(Viral)గా మారాయి.

9/11 దాడుల అనంతరం ఈ లేఖ రాసిన అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్(Osama Bin Laden) .. వారు చేసిన దాడులను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణను కూడా ఆ లేఖలో అందులో బిన్ లాడెన్ ప్రస్తావించాడు. ఇజ్రాయెల్‌కు(Israel) అమెరికా(America) మద్దతు ఇచ్చినందుకే 9/11 దాడులు చేయడానికి ప్రధాన కారణం అంటూ పేర్కొన్నాడు. పాలస్తీనాను ఆక్రమించు కోవడానికి ఇజ్రాయిల్ చేస్తున్న అణిచివేతకు అమెరికా మద్దతు ఇస్తూనే ఉందని తెలిపాడు. దశాబ్దాలుగా పాలస్తీనా ఇజ్రాయెలీల ఆక్రమణలో ఉందని లేఖలో రాశాడు. 2001 సెప్టెంబర్ 11న జరిగిన దాడుల తర్వాత.. అణచివేత, దౌర్జన్యమే అమెరికాపై దాడికి కారణమని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్(George Bush) గ్రహించేదాకా ఎవరూ పాలస్తీనా సమస్య గురించి మాట్లాడలేదని గుర్తు చేశాడు.

ఆ సందర్భంగా పాలస్తీనా(Palastina) భూమిని తిరిగిచ్చే రోడ్ మ్యాప్‌ని(RoadMap) అమలు చేయాలని.. అది ఒక ఇస్లామిక్ భూమి అని బిన్ లాడెన్ ఆ లేఖలో స్పష్టం చేశాడు. అంతేకాకుండా.. పాలస్తీనాను ఎవరూ బందీ చేయలేరని.. పాలస్తీనా సంకెళ్లను విచ్ఛిన్నం చేయడానికి తాము ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు. క్రైస్తవుల రక్తంతో అమెరికా.. దాని దురహంకారానికి మూల్యం చెల్లించుకుంటుందని తీవ్ర హెచ్చరికలు చేశా

డు. ఈ లేఖను 2002 నవంబర్‌లో తన వెబ్‌సైట్‌లో పెట్టిన ‘ద గార్డియన్’(The Guardian) వెబ్‌సైట్ తాజాగా 2023 నవంబర్ 15వ తేదీన తొలగించింది. ఈ లేఖ ప్రస్తుతం వైరల్ కావడంతోనే ‘ద గార్డియన్’ దాన్ని తీసేసింది.

ప్రస్తుతం గాజా భూభాగంలో ఇజ్రాయెల్(Israel) చేస్తున్న గ్రౌండ్ ఆపరేషన్‌(Ground Operation) ప్రపంచ దేశాల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యేలా మారింది. ముఖ్యంగా గాజాలో నివసిస్తున్న సామాన్య పౌరులు.. మరీ ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో కాల్పుల విరమణకు(ceasefire) పిలుపునివ్వాలని అంతర్జాతీయ సమాజం నుంచి డిమాండ్లు వెల్లు వెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో బిన్‌లాడెన్ రాసిన లేఖ బయటకు రావడం సంచలంగా మారింది. అయితే అప్పట్లో పాలస్తీనాపై ఇజ్రాయెల్ దురాక్రమణకు పాల్పడుతుంటే వారికి అమెరికా మద్దతు ఇవ్వడం వల్లే 9/11 దాడులు జరిపామని బిన్‌ లాడెన్ ఆ లేఖలో చెప్పడాన్ని చాలామంది నెటిజన్లు ఏకీభవిస్తున్నారు.