Qatar Court : నేవీ మాజీ అధికారుల మరణశిక్షపై ఊరట

భారత్ విజ్ఞప్తికి ఖతార్ కోర్టు ఓకే..

Courtesy: Twitter

Share:

Qatar Court : ఇజ్రాయెల్(Israel) కు గూఢచర్యం(Espionage) చేస్తూ ఖతార్ లో(Qatar) దొరికిపోయిన 8 మంది భారత నేవీ మాజీ అధికారుల(Ex-Navy Officers) మరణశిక్షపై కాస్త ఊరట లభించింది. వీరికి విధించిన మరణశిక్షపై సమీక్ష కోరుతూ భారత ప్రభుత్వం చేసిన అప్పీలు(Appeals)ను ఖతార్ కోర్టు (Qatar Court) అంగీకరించింది. దీనిపై త్వరలో విచారణ ప్రారంభం కానుంది. భారత్ అప్పీలు మేరకు వారి విడుదలకు ఖతార్ కోర్టు అంగీకరిస్తే నేవీ మాజీ సిబ్బంది క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చేందుకు వీలవుతుంది. వీరి రాక కోసం కుటుంబాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.

గత నెలలో ఎనిమిది మంది మాజీ భారత నౌకాదళ సిబ్బందికి(Indian Navy personnel) మరణశిక్ష(Death Penalty) విధింపుకు సంబంధించి భారత ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ఖతార్ కోర్టు(Qatar Court) గురువారం విచారణకు స్వీకరించిందని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. తాము అప్పీల్‌ను(Appeal) అధ్యయనం చేస్తున్నామని, తదుపరి విచారణ త్వరలో ఉంటుందని ఖతార్ కోర్టు (Qatar Court) తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఖతార్‌లోని స్ధానిక కోర్టు దేశంలో ఏడాది పాటు నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందికి మరణశిక్ష విధించింది.

దీనిని తిరిగి సమీక్షించాలని కోరుతూ భారత విదేశాంగ శాఖ ఖతార్ కోర్టులో అప్పీలు(Appeal) చేసింది. దీనిపై స్పందించిన ఖతార్ కోర్టు (Qatar Court) భారత విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంది. దీనిపై త్వరలో విచారణ జరుపుతామని ప్రకటించింది. భారత నేవీ సిబ్బందికి మరణశిక్ష విధిస్తూ గతంలో ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పును విదేశాంగశాఖ రహస్యంగా ఉంచుతోంది. అయితే వారిని విడిపించేందుకు మాత్రం తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయంపై ఖతార్ అధికారులతో కేంద్రం చర్చలు జరుపుతోందని, భారత పౌరులకు ప్రభుత్వం అన్ని చట్టపరమైన, కాన్సులర్ సహాయాన్ని అందజేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి(Arindam Bagchi) తెలిపారు.

గతేడాది ఆగస్టులో ఖతార్‌లోని(Qatar) ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇజ్రాయెల్‌కు(Israel) గూఢచారులుగా పని చేస్తున్నారనే అనుమానంతో ఎనిమిది మంది మాజీ భారత నేవీ అధికారులను ఖతార్ (Qatar) అదుపులోకి తీసుకుంది. కాగా, వారికి కాన్సులర్ యాక్సెస్(Consular access) మంజూరు చేశారు భారత నేవీ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, నావికుడు రాగేష్‌లను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆగస్టులో అరెస్టు చేసింది. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. అభియోగాలు నిజమని తేలడంతో ఖతార్ కోర్టు(Qatar Court) మరణశిక్ష విధించింది.

నేవీ మాజీల బెయిల్ పిటిషన్లను ఖతార్ అధికారులు పలుమార్లు తిరస్కరించారు. ఈ ఏడాది అక్టోబరులో ఖతార్ కోర్టు(Qatar Court) మరణశిక్షను ప్రకటించింది. కాగా.. గూడచర్యం(Espionage) ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ నేవీ అధికారులందరూ ఇండియన్ నేవీలో 20 సంవత్సరాలు విశిష్ట సేవలను అందించినట్లు రికార్డు ఉంది. వారు ఫోర్స్‌లో బోధకులతోపాటు ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. ఖతార్(Qatar) అదుపులోకి తీసుకున్న మాజీ అధికారులలో ఒకరి సోదరి మీటూ భార్గవ తన సోదరుడిని తిరిగి భారత్ కు తీసుకురావాలని కోరారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)జోక్యం చేసుకోవాలని జూన్ 8న ట్విట్టర్ పోస్ట్‌లో ఆమె విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆలస్యం చేయకుండా మాజీ నావికాదళ అధికారులను వెంటనే భారత్ కు తిరిగి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని మన గౌరవ ప్రధానమంత్రిని మరోసారి కోరుతున్నానంటూ ఆమె పేర్కొన్నారు. ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర మంత్రులు అమిత్ షా(Amith Shah), రాజ్‌నాథ్ సింగ్‌లకు(Rajnath Singh) ఈ పోస్ట్‌ని ట్యాగ్ చేశారు.

Tags :