Robot: రజినీకాంత్ సినిమా రిపీట్.. మనిషిని చంపిన రోబో..!

Robot: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రోబో’(Robot) మువీ గుర్తుందా? ఈ సినిమాలో డాక్టర్‌ వసీగరన్‌ తయారు చేసిన చిట్టీ కారు డ్రైవింగ్‌ చేసే సీన్‌లో ట్రాఫిక్‌ కానిస్టేబుల్ చెయ్యి తడపమంటే చాక్‌తో చెయ్యిపై గాయం చేస్తుంది. అలాగే మరొక సన్నివేశంలో ప్రొఫెసర్‌ బోరా తయారు చేసిన రోబో గన్ను తీయమంటే బన్ను తీస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి దక్షిణ కొరియా(South Korea)లో ఓ ఫ్యాక్టరీలో జరిగింది. సినిమాలోని ఈ సన్నివేశం కామెడీగా […]

Share:

Robot: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రోబో’(Robot) మువీ గుర్తుందా? ఈ సినిమాలో డాక్టర్‌ వసీగరన్‌ తయారు చేసిన చిట్టీ కారు డ్రైవింగ్‌ చేసే సీన్‌లో ట్రాఫిక్‌ కానిస్టేబుల్ చెయ్యి తడపమంటే చాక్‌తో చెయ్యిపై గాయం చేస్తుంది. అలాగే మరొక సన్నివేశంలో ప్రొఫెసర్‌ బోరా తయారు చేసిన రోబో గన్ను తీయమంటే బన్ను తీస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి దక్షిణ కొరియా(South Korea)లో ఓ ఫ్యాక్టరీలో జరిగింది. సినిమాలోని ఈ సన్నివేశం కామెడీగా అనిపించినీ నిజ జీవితంలో మాత్రం ఓ నిండు జీవితం బలైంది. టెక్నాలజీని(Technology) సరిగా వినియోగించకుంటే జరిగే అనర్ధాలు ఎంతటి పెను ప్రమాదాన్ని సృష్టిస్తాయనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ.

వేగవంతమైన సాంకేతిక  అభివృద్ధి కారణంగా ఎంత మేలు జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతోంది. సాంకేతిక విస్తరణలో భాగంగా ఇటీవల కాలంలో రోబోల(Robot) వినియోగం బాగా పెరిగింది. మనిషులు చేసే చాలా పనులను రోబోలు చిటికెలో చేసేస్తున్నాయి. అయితే కొన్నిసార్లు సాంకేతికతను మనం మంచి పనుల కోసం ఉపయోగించినా.. కొన్నిసార్లు చెడుగా మారుతుంది. టెక్నాలజీ(Technology)లో లోపాలుంటే అది ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో చెప్పే ఘటన దక్షిణ కొరియాలో(South Korea) బుధవారం వెలుగుచూసింది. మనిషిని, కూరగాయల డబ్బాను వేరు చేసి గుర్తించడంలో విఫలమైన రోబో(Robot) వ్యక్తి మరణానికి కారణమైంది. 

దక్షిణ జియోంగ్‌సాంగ్‌ ప్రావిన్స్‌(South Gyeongsang Province)లోని వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ పరిశ్రమంలో రోబోటిక్‌ మిషిన్‌లను వినియోగిస్తున్నారు. అవి కూరగాయాలతో నింపిన  డబ్బాలను గుర్తించి కన్వేయర్‌ బెల్ట్‌(Conveyor belt)పై ఎక్కిస్తాయి. ఈ క్రమంలో ఓ రోబో దాని పక్కనే ఉన్న ఓ వ్యక్తిని కూరగాయాల డబ్బాగా(Vegetable can) భావించి.. అతన్ని ఎత్తి కన్వేయర్‌ బెల్ట్‌పై పడేసింది. రోబో వ్యక్తిని గట్టిగా పట్టుకోవడంతో అతని ఛాతీ భాగం, ముఖం ఛిద్రమయ్యాయి. గమనించిన సిబ్బంది వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

రోబోలో(Robot) లోపం వల్ల అది మనిషిని బాక్స్‌లా గుర్తించిందని కంపెనీ వివరణ ఇచ్చింది. రెండు రోజుల క్రితమే రోబో సెన్సర్‌లో లోపం(Sensor error) ఉందని ఫ్యాక్టరీ సిబ్బంది(Factory staff) గుర్తించినట్లు పేర్కొంది. దాన్ని బాగు చేయడానికి తయారీ కంపెనీ నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుడు దాన్ని బాగు చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఆ మరమ్మతు నిర్వహిస్తున్న వ్యక్తినే అది పొరబడి చంపింది. దీంతో విధుల్లో అజాగ్రత్తగా (Careless in duties)వ్యవహరించినందుకు అక్కడి భద్రతా నిర్వాహకులపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వెంటనే సురక్షితమైన వ్యవస్థను రోబోట్స్‌లో ప్రోగ్రాం చేయవల్సిందిగా కంపెనీ యాజమన్యాన్ని ఆదేశించారు. 

నవంబర్‌ 6 రోబోట్‌లో సాంకేతి సమస్య తలెత్తితే ఆ మరుసటి రోజు ఈ సంఘటన చోటు చేసుకుంది. దక్షిణ కొరియాలో (South Korea) ఇలాంటి ప్రమాదం జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో ఓ ఆటోమొబైల్(Automobile) విడిభాగాల తయారీ కర్మాగారంలో పనిచేస్తున్నప్పుడు రోబో చేతిలో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు. గత జులై నెలలో రష్యాలో చెస్‌ ఆడుతున్నక్రమంలో వేగంగా కదులుతున్న ఏడేళ్ల బాలుడి చేతిని పట్టుకుని వేళ్లు విరిచేసింది. 

మనుషుల పనులను, జీవనశైలిని మరింత సులభతరం చేసేందుకు టెక్నాలజీ(Technology) ఉపయోగపడుతుంది. అయితే టెక్నాలజీ అనేది భవిష్యత్ తరాల్లో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పలువురు టెక్ దిగ్గజాలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇది భవిష్యత్ తరాల్లో మానవ మనుగడకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీలో లోపాలుంటే రోబో వ్యవస్థ(Robot system) ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ.