Titanic: వేలంలో లక్షలు పలికిన టైటానిక్ మెనూ

మెనూలో ఏమున్నాయి అంటే..

Courtesy: Pexels

Share:

Titanic: వేలం (Auction)లో ఎన్నో పురాతన వస్తువులు కోట్లలో పలుకుతూ ఉంటాయి. ఎప్పటి వస్తువులో వేలం (Auction) వెయ్యగా వాటిని దక్కించుకునేందుకు చాలామంది మక్కువ చూపిస్తూ ఉంటారు. భారతదేశంలో ముఖ్యంగా వినాయక చవితి లడ్డూలు వేలం (Auction) వేస్తే లక్షల్లో పలికినట్లు, ఇతర దేశాలలో పురాతన వస్తువులు, పాపులర్ వస్తువులను వేలం (Auction) వేస్తూ వాటిని కోట్లలో విక్రయిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో చోటు దక్కించుకుంది టైటానిక్ (Titanic) ఫుడ్ మెనూ (Menu). 

 

వేలంలో లక్షలు పలికిన టైటానిక్ మెనూ: 

 

ఇంగ్లండ్‌లో శనివారం సాయంత్రం వేలానికి వెళ్లిన టైటానిక్ (Titanic) ఫస్ట్-క్లాస్ డిన్నర్ మెనూ (Menu) 83,000 పౌండ్లు, అంటే అక్షరాల ₹ 84.5 లక్షలు పలికింది. ఈ విషయాన్ని UK ఆధారిత వార్తాపత్రిక ది గార్డియన్ నివేదించింది. అట్లాంటిక్ సముద్రయానంలో మంచుకొండను ఢీకొట్టి, ఏప్రిల్ 14, 1912 రాత్రి మునిగిపోవడానికి కేవలం మూడు రోజుల టైటానిక్ (Titanic) షిప్ లో మనుగడలో ఉన్న డిన్నర్ మెనూ (Menu). అయితే టైటానిక్ (Titanic) చివరి క్షణాలలో లైఫ్ బోట్‌లలో ప్రజలను తరలిస్తున్నప్పుడు, డిన్నర్ మెనూ (Menu) ఎవరు తీసుకున్నారు? అందులో ఉన్న విక్టోరియా పుడ్డింగ్ అంటే ఏమిటి అనే ప్రశ్నలు ఇంకా ప్రశ్నార్ధకంగానే మిగిలాయి.

 

ఆ సాయంత్రం ఆప్రికాట్లు మరియు ఫ్రెంచ్ ఐస్‌క్రీమ్‌తో, పాటుగా డెజర్ట్‌ విషయానికి వస్తే అందులో, గుడ్లు, జామ్, బ్రాందీ, యాపిల్స్, చెర్రీస్, పీల్, షుగర్, సుగంధ ద్రవ్యాల మిశ్రమం ఉంటుందని మెనూ (Menu)లో కనిపిస్తుంది. మెనూ (Menu), నీటిలో తడిసిన, వైట్ స్టార్ లోగో అలాగే ఉంది. ఏప్రిల్ 11న ఆస్టెర్స్, సాల్మన్, బీఫ్, స్క్వాబ్, బాతు మరియు చికెన్‌తో పాటు బంగాళాదుంపలు, బియ్యం మరియు పార్స్నిప్ పురీతో సహా పలు వంటకాలు మెనూ (Menu)లో కనిపించడం జరిగాయి. 

 

ఈ చారిత్రక మెనూ (Menu) ఐర్లాండ్‌లోని క్వీన్స్‌టౌన్ నుండి న్యూయార్క్‌కు బయలుదేరిన టైటానిక్ (Titanic) మరుసటి రోజు అందించిన భోజనానికి సంబంధించింది. దీనిని హెన్రీ ఆల్డ్రిడ్జ్ & సన్ ఆఫ్ విల్ట్‌షైర్ వేలం (Auction) వేస్తున్నారు, దానితో పాటు టార్టాన్ డెక్ బ్లాంకెట్‌తో సహా ఇతర టైటానిక్ (Titanic) కళాఖండాలు ఉన్నాయి. నోవా స్కోటియాలోని డొమినియన్‌లోని కమ్యూనిటీ చరిత్రకారుడు లెన్ స్టీఫెన్‌సన్‌కి చెందిన 1960ల ఫోటో ఆల్బమ్‌లో ఈ మెనూ (Menu) కనిపించింది. మిగిలి కొన్ని ఫస్ట్-క్లాస్ మెనూ (Menu)లలో ఈ మెనూ (Menu) ఒకటి అని వేలం (Auction) హౌస్ మేనేజర్ ఆండ్రూ ఆల్డ్రిడ్జ్ వెల్లడించారు. వేలం (Auction)లో టైటానిక్ (Titanic) కళాఖండాలు శిధిలాల నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులు, మరియు ఏప్రిల్ 11న టైటానిక్ (Titanic) షిప్ లోని డిన్నర్ మెను వంటి ఇతర వస్తువులతో సహా చాలా వేలం (Auction) వేయడం జరిగింది.

 

యూనివర్శిటీ ఆఫ్ ప్లైమౌత్‌లో సముద్ర చరిత్రకు సంబంధించిన అసోసియేట్ ప్రొఫెసర్ హ్యారీ బెన్నెట్, . టైటానిక్ (Titanic) షిప్ మునిగిపోయినప్పుడు, అప్పట్లో అందులో చనిపోయిన మృతదేహాలనుంచి కొన్ని వస్తువుల సేకరించినట్లు చెప్పడం జరిగింది. 

 

భారతదేశంలో ఇదే అతిపెద్ద వేలం: 

 

భారతదేశంలో అంగరంగ వైభవంగా గణేష్ పండుగ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక రాష్ట్రంలో కూడా గణేష్ ఉత్సవాలు జరిగాయి. నిమజ్జనం సమయానికి జరిగే ఉత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి తీసుకువెళ్లే క్రమం చూపురులకు కనువిందు చేస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ గణపతి చేతిలో ఉండే లడ్డు (Laddu) కోసం పోటీ పడుతూ ఉంటారు. ఆ లడ్డు (Laddu) వేలం (Auction) పాటలో సంపాదించి, ఎంతో పవిత్రంగా తమ కుటుంబీకులకు, సన్నిహితులకు, తమ ఆరోగ్యాల కోసం, తమ ఆస్తుల పెరుగుదల కోసం తమ ఇంటికి వచ్చిన గణపతి లడ్డు (Laddu) వల్ల శుభం చేకూరుతుందని నమ్మకం.

 

నగరంలో గణేష్ ఉత్సవాలలో ముఖ్యంగా నిమజ్జనం రోజు బాలాపూర్ లడ్డూ వేలం (Auction) కన్నుల పండుగగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సుమారు 30 ఏళ్ల క్రితం, వినాయక నిమజ్జనం నాడు 1994లో కోలం మోహన్ రెడ్డి రూ.450కి లడ్డూని వేలం (Auction) పాట వేసే ప్రక్రియ మొదలైంది. ఒక ముఖ్యమైన మైలురాయిలని దాటిన ఈ క్రమంలో, ప్రత్యేకించి ఈ వేలం (Auction) పాట సుమారు ప్రతి ఒక్క ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది. ఈ ఏడాది పోటీలో 36 మంది వేలం (Auction)పాట వెయ్యగా.. సుమారు రూ. 27 లక్షలకు లడ్డు (Laddu)ను వేలం (Auction) పాడి, తుర్కయాంజాల్‌కు చెందిన దాసరి దయానాద్ రెడ్డి ఈ బాలాపూర్ గణేష్ లడ్డూని సొంతం చేసుకున్నాడు.

Tags :