War: హాస్పిటల్స్ నుంచి తరలివెళ్లడమే మంచిది అంటున్న WHO

ఇంకా చల్లారిన ఇజ్రాయిల్ - హమాస్ యుద్ధం..!

Courtesy: Twitter

Share:

War: యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- హ‌మాస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడి (Attack)ని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ (Israel) వాసులను సైతం బందీలు (Hostages)గా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హ‌మాస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. హఠాత్తుగా జరిగిన హమాస్ (Hamas) ఎటాక్ (Attack) కారణంగా ఎన్నో జీవితాలు కుప్పకూలాయి. ఇప్పుడు ఇరువైపుల నుంచి యుద్ధం (War) కొన్ని వేల జీవితాలను బలిగొంది. అమానుషంగా హాస్పిటల్స్ (Hospital) అని కూడా లేకుండా దాడులు నిర్వహిస్తున్నారు. హాస్పిటల్స్ (Hospital) లో తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రజలను కూడా పొట్టన పెట్టుకుంటుంది యుద్ధం. ఇక ప్రాణాలు కాపాడుకోవడానికి, హాస్పిటల్స్ (Hospital) నుంచి తరలి వేరే ప్రాంతాలకు వెళ్లడమే చివరి ప్రయత్నం అంటుంది WHO. 

తరలివెళ్లడమే మంచిది అంటున్న WHO: 

 

ఇజ్రాయెల్ ముట్టడిలో ఉన్న గాజాలోని, మూడు హాస్పిటల్స్ (Hospital) లో ఉన్న పేషంట్లను తరలించడంలో సహాయాన్ని అభ్యర్థించాయని, ప్రణాళిక ప్రారంభించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎన్నో హాస్పిటల్స్ (Hospital) మీద బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. గాజా ఉత్తర భాగంలోని అన్ని హాస్పిటల్స్ (Hospital) ముఖ్యంగా పనిచేయడం మానేశాయి, అయినప్పటికీ తమ ప్రాణాలను కాపాడుకోలేని స్థితిలో ఉన్న ఎంతోమంది శరణార్థులను హాస్పిటల్స్ (Hospital) లోనే ఉంచేయడం జరిగింది.

డబ్ల్యూహెచ్‌ఓ (WHO) ప్రతినిధి క్రిస్టియన్ లిండ్‌మీర్ మాట్లాడుతూ, చివరి ప్రయత్నంగా హాస్పిటల్స్ (Hospital) నుంచి, చిన్నపిల్లలను, పేషంట్లను తరలించడమే మంచిది అంటూ, మరి ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా ఇదే సరైన మార్గం అని జెనీవా ప్రెస్ బ్రీఫింగ్‌లో అన్నారు. అంతేకాకుండా మూడు హాస్పిటల్స్ (Hospital) నుంచి ఇప్పటికే కొంతమందిని తరలించినట్లు వెల్లడించింది డబ్ల్యూహెచ్ఓ. మరోవైపు వ్యాధులు వ్యాపించే అవకాశం కూడా ఉందని డబల్యుహెచ్ఓ హెచ్చరించింది. శరణార్థుల కోసం ఏర్పాటుచేసిన ప్రాంతాలలో ఎక్కువ మంది ఉండడం వల్ల, వ్యాధులు చిన్నపిల్లలకు ఈజీగా వ్యాప్తి చెందుతాయి అంటూ ప్రకటించింది UNICEF. అంతేకాకుండా నీళ్లు సదుపాయం లేకుండా చేయడం, మరి ముఖ్యంగా పరిశుభ్రత లేకపోతే మాత్రం మరింత మంది పిల్లలు వ్యాధులకు గురై చనిపోయే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తోంది UNICEF.

మానవ విలువలను కాపాడాలంటూ కాంగ్రెస్: 

ఇజ్రాయిల్ హ‌మాస్ యుద్ధం (War) కారణంగా ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. యుద్ధం (War) మొదలై ఇప్పటికే నెల కావస్తున్నప్పటికీ యుద్దం ఇంకా కొనసాగుతున్న వైనం కనిపిస్తోంది. ఇటువంటి హింసను ఆపేందుకు ఇటీవల కాంగ్రెస్ (Congress), భారత ప్రభుత్వం తరఫునుంచి అమెరికా, ఇజ్రాయిల్, యూరప్ యూనియన్లకు ప్రభుత్వాలకు ఒత్తిడి తీసుకురావాలి అంటూ విజ్ఞప్తి చేస్తుంది. ఎంతో మంది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు యుద్ధం (War) కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా, యుద్ధం (War)లో గాయపడిన వారికి చికిత్స పొందేందుకు హాస్పిటల్లో సౌకర్యాలు కూడా కొడవయ్యాయని, ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని, హింస కారణంగా మానవ విలువలు దిగజారిపోతున్నాయని, ఈ పరిస్థితి ముందుకు వెళ్లకుండా ఇతర దేశ ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని, భారత ప్రభుత్వం తరఫున నుంచి ఒత్తిడి తీసుకురావాలంటూ కాంగ్రెస్ (Congress) విజ్ఞప్తి చేసింది. ఎంతోమంది యుద్ధం కారణంగా మరణిస్తున్న, అసలు ఏమీ పట్టనట్టుగా ఇరుదేశాలు ఎలా వ్యవహరిస్తున్నాయి అంటూ.. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఒక్క దేశం కూడా తమ వైపు నుంచి ఇజ్రాయిల్ - హమాస్ యుద్ధకాండను ఆపేందుకు తమ వైపు నుంచి ప్రయత్నాలు చేయాలని, మరణ హోమాన్ని ఆపేందుకు శాంతిని చేకూర్చేందుకు ప్రయత్నం చేయాలని మాట్లాడుతున్నాయి. ఇప్పటికే అమెరికా దళాలు చాలా వరకు, తమ పౌరులను రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది.