Uber Driver: రైడ్ క్యాన్సిల్ చేసి రూ. 23 లక్షల సంపాదించిన ఉబర్ డ్రైవర్

Uber Driver: ప్రతి ఒక్కరూ తమ వైపు నుంచి కృషి చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు అయితే డ్రైవర్ (Driver) గా పనిచేస్తున్న ఒక రిటైర్ అయిన రైడ్స్ (Ride) క్యాన్సిల్ (Cancel) చేసి సుమారు 23 లక్షలు సంపాదించాడు (Earn) అంటే మీరు నమ్మగలరా? అవును మీరు చదివింది నిజమే. రైడ్స్ (Ride) క్యాన్సిల్ (Cancel) చేయడం ద్వారా సంవత్సరంలో సుమారు 23 లక్షలు సంపాదించాడు (Earn).  స్మార్ట్ గా పని చేయాలంటున్న డ్రైవర్..:  యునైటెడ్ […]

Share:

Uber Driver: ప్రతి ఒక్కరూ తమ వైపు నుంచి కృషి చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు అయితే డ్రైవర్ (Driver) గా పనిచేస్తున్న ఒక రిటైర్ అయిన రైడ్స్ (Ride) క్యాన్సిల్ (Cancel) చేసి సుమారు 23 లక్షలు సంపాదించాడు (Earn) అంటే మీరు నమ్మగలరా? అవును మీరు చదివింది నిజమే. రైడ్స్ (Ride) క్యాన్సిల్ (Cancel) చేయడం ద్వారా సంవత్సరంలో సుమారు 23 లక్షలు సంపాదించాడు (Earn). 

స్మార్ట్ గా పని చేయాలంటున్న డ్రైవర్..: 

యునైటెడ్ స్టేట్స్‌లోని నార్త్ కరోలికు చెందిన 70 ఏళ్ల ఉబర్ (Uber) డ్రైవర్ (Driver) ఒక సంవత్సరంలో తన ట్రిప్‌లలో 30 శాతానికి పైగా క్యాన్సిల్ (Cancel) చేయడం ద్వారా సుమారు $28,000 (రూ. 23.3 లక్షలు) సంపాదించాడు (Earn). ఇన్‌సైడర్‌లోని ఒక నివేదిక ప్రకారం, “బిల్” అనే డ్రైవర్ (Driver), తాను 10 శాతం కంటే తక్కువ కస్టమర్లకు ఓకే చెప్పి.. కేవలం సంవత్సరంలో 1,500 ట్రిప్పులకు వెళ్లినట్లు వెల్లడించాడు. 

ఆ వ్యక్తి ఆరు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యి.. ఇప్పుడు ఎక్స్ట్రా ఆదాయాన్ని సంపాదించడానికి (Earn) ఉబర్ (Uber) ప్లాట్‌ఫారమ్‌లో పార్ట్‌టైమ్ పని చేయడం ప్రారంభించాడు. అయినప్పటికీ, తను సమయానికి బట్టి రైడ్స్ (Ride) సెలెక్ట్ చేసుకుంటాడని.. రద్దీగా ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఎక్కువగా తాను రైడ్స్ (Ride) ఒప్పుకుంటూ ఉంటానని, ఉబర్ (Uber) డ్రైవర్ (Driver) చెప్పడం జరిగింది. అంతేకాకుండా తను వారానికి 40 గంటలు పని చేయడానికి, తన స్మార్ట్ వర్క్ తో 30 గంటలకు తగ్గించానని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా కరోనా (Corona) సమయంలో కూడా తను పనిచేసినట్లు వెల్లడించాడు డ్రైవర్ (Driver). అంతేకాకుండా, గంటకు 50 డాలర్లు సంపాదించేవాడని (Earn), అయితే మిగిలిన డ్రైవర్ (Driver)లు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కరోనా (Corona) సమయంలో లేకపోవడమే తన సంపాదనకు కారణం అన్నాడు. అయితే ఇప్పుడు పరిస్థితి మామూలుగా ఉన్నప్పటికీ, తన గంటకి 15 నుంచి 20 డాలర్ల వరకు సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు డ్రైవర్ (Driver). 

సంపాదించడం ఆర్ట్ అంటున్న డ్రైవర్ (Driver): 

మంచి డబ్బు సంపాదించడానికి (Earn) తను అనేక స్ట్రాటజీలు ఫాలో అవుతానంటూ, ఉబర్ (Uber) డ్రైవర్ (Driver) బిల్ చెప్పాడు. అతను శుక్రవారాలు మరియు శనివారాల్లో రాత్రి 10:00 నుండి తెల్లవారుజామున 2:30 గంటల మధ్య రద్దీ సమయాల్లో విమానాశ్రయాలు, బార్‌ల వంటి ప్రదేశాలలో తన అవైలబిలిటీ ఉండేలా చూసుకుంటానని, ఇది ధరల పెరుగుదలకు సహాయపడుతుందని చెప్పుకొచ్చాడు ఉబర్ (Uber) డ్రైవర్ (Driver). అతను అవుట్‌లెట్‌తో ఇలా అన్నాడు, ఒక విమానం ల్యాండ్ అయినప్పుడు..ప్రజలు Ubersని సెలెక్ట్ చేసుకునే సమయంలో ధర భారీగా పెరుగుతుందని.. 20 నిమిషాల రైడ్ (Ride) కోసం $10, $20 నుండి $40.. ధర ఉండగా, కొన్నిసార్లు $50 వరకు ఉంటుందని డ్రైవర్ (Driver) చెప్పుకొచ్చాడు. 

డ్రైవర్ (Driver) కు కేవలం 50 శాతం తక్కువగా వస్తుంది కాబట్టి 35 నిమిషాల రైడ్ (Ride) కు $30 నుండి $60 వరకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించాడు.బిల్ ఒక కస్టమర్‌ను తన సిటీ నుండి దాదాపు రెండు గంటల డ్రైవ్‌లో, దూరప్రాంతానికి తీసుకెళ్లిన రైడ్ (Ride) గురించి గుర్తుచేసుకున్నాడు. అతను రైడ్ (Ride) కు $27 అందుకున్నప్పటికీ, తిరిగి వచ్చే మార్గంలో కస్టమర్‌లు ఎవరూ లేనందున అతను ఎవరూ లేకుండానే డ్రైవ్ చేసుకొని తిరిగి రావాల్సి వచ్చిందని మాట్లాడాడు డ్రైవర్ (Driver).

అయితే, ఈ వ్యూహాలు కొన్ని ప్రమాదాలకు దారి తీయొచ్చని నొక్కి చెప్పాడు ఉబర్ (Uber) డ్రైవర్ (Driver). Uber ప్రకారం, డ్రైవర్ (Driver) కస్టమర్ వెళ్లాల్సిన డెస్టినేషన్ లొకేషన్ చూసి, ట్రిప్‌ను క్యాన్సిల్ (Cancel) చేయడం కారణంగా, ఒక్కోసారి డ్రైవర్ (Driver) వారి ఎకౌంట్ యాక్సెస్‌ను కోల్పోయే అవకాశం ఉంది. బిల్ ఈ పరిస్థితిని స్వయంగా అనుభవించనప్పటికీ, దూర ప్రయాణాలను క్యాన్సిల్ (Cancel) చేసినందుకు, కొంతమంది డ్రైవర్ (Driver)లను విమానాశ్రయం పికప్‌ల నుండి నిషేధించడం గురించి అతను విన్నాడు. అయినప్పటికీ, ఉబర్ (Uber) డ్రైవర్ (Driver) బిల్, ప్రస్తుతానికి తన గేమ్ ప్లాన్‌కు కట్టుబడి ఉండాలని, అది ప్రయోజనకరంగా ఉంటుందని అతను విశ్వసించినప్పుడు మాత్రమే డ్రైవ్ చేయాలని భావిస్తున్నాడు. ఆదాయం కోసం ఉబర్ (Uber)‌పై ఆధారపడకపోవడం తనకు ప్రయోజనకరమని ఆయన పేర్కొన్నారు.