Israel: పాలస్తీనియన్ల మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు

సంస్థ నుండి US వెంచర్ క్యాపిటలిస్ట్ అవుట్

Courtesy: Pexels

Share:

Israel: యుద్ధం (War) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్ (Israel)- మాస్(Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం (War) మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (War) జరుగుతున్న సమయన సుమారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడి (Attack)ని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ (Israel) వాసులను సైతం బందీలు (Hostages)గా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న మాస్ (Hamas) షేర్ చేయడం జరిగింది. హఠాత్తుగా జరిగిన హమాస్ (Hamas) ఎటాక్ (Attack) కారణంగా ఎన్నో జీవితాలు కుప్పకూలాయి. ఇప్పుడు ఇరువైపుల నుంచి యుద్ధం (War) కొన్ని వేల జీవితాలను బలిగొంది. అయితే యుద్ధం జరుగుతున్న క్రమంలో, పాలస్తీనియన్ల మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు, తమ సొంత సంస్థ నుండి US వెంచర్ క్యాపిటలిస్ట్ను తొలగించడం (Fired) జరిగింది.

పాలస్తీనియన్ల మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు:

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య పాలస్తీనియన్లపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పోస్ట్ (Post) చేసిన తర్వాత, US పెట్టుబడి సంస్థ నుండి, సహ వ్యవస్థాపకుడు వెంచర్ క్యాపిటలిస్ట్ను తొలగించడం (Fired) జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో VC సంస్థ ఓస్టెర్ వెంచర్స్లో సహ వ్యవస్థాపకుడు అయిన కెన్నెత్ బల్లెనెగర్ Xలో ఇలా వ్రాశాడు, యుద్ధం అనంతరం చైనా, జిన్జియాంగ్ ను హ్యాండిల్ చేసినట్లు, గాజను ఇజ్రాయిల్ హ్యాండిల్ చేయాలని వాక్యానించాడు. అంతే కాకుండా పూర్తిగా కట్టుదిట్టంగా వ్యవహరించాలని పోస్ట్ (Post) చేసాడు. స్టెరిలైజేషన్, రీ ఎడ్యుకేషన్ వంటివి చేయాలని, పాలస్తీనియన్ల గురించి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. అయితే ఇది ట్విట్టర్ లో వైరల్ గా మారిన అనంతరం, చాలామంది అతనిని ప్రశ్నించడం జరిగింది. తర్వాత కూడా తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ (Post) చేస్తూ, ఉగ్రవాదులు అనేవాళ్ళు కుందేలు లాగా పుట్టుకొస్తున్నారని, ఉగ్రవాదాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారని, ఇటువంటి పరిస్థితిని మనం ఎందుకు తెచ్చుకోవాలి అంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు కెన్నెత్ బల్లెనెగర్. అతని పోస్ట్ (Post) వివాదాస్పదంగా మారిన తర్వాత అతను తన X ప్రొఫైల్ను ప్రైవేట్గా మార్చుకున్నాడు.

చైనా గురించి ప్రస్తావించడం, ఇటువంటి యుద్ధ పరిస్థితుల్లో ఇజ్రాయిల్ వాసులను చైనా వన్ చైల్డ్ పాలసీ వంటి కొన్ని విషయాలతో పోల్చడం ఏమిటి అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. యుద్ధం జరుగుతున్న క్రమంలో, పాలస్తీనియన్ల మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు, తమ సొంత సంస్థ నుండి US వెంచర్ క్యాపిటలిస్ట్ను తొలగించడం (Fired) జరిగింది. ఇలాగే చాలా సంస్థలు, యుద్ధానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన చాలామంది ఉద్యోగులను తొలగించినట్లు (Fired) ప్రకటించాయి.

యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది:

గత నెలలో ఇజ్రాయిల్‌ (Israel)లోని ఒక మ్యూజిక్ ఫెస్టివల్ జరిగిన ప్రదేశం, హమాస్ (Hamas) చేసిన మొదటి దాడులలో ఒకటి. ఇక్కడ 250 మందికి పైగా మరణించారు. అప్పుడు, మ్యూజిక్ ఫెస్టివల్ హాజరైన ఒక ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model), హమాస్ (Hamas) ఎటాక్ (Attack) నుంచి తప్పించుకోవడానికి తన బాయ్ ఫ్రెండ్ తో సహా, మృతదేహాల కుప్ప కింద గంటల తరబడి ఎలా దాక్కోవలసి వచ్చిందో వివరించింది.

నిజానికి తాము తప్పించుకోవడానికి కారులో ప్రయాణమవుతున్న సందర్భంలో, చాలామంది సెక్యూరిటీ గార్డులు తమని తమ ప్రాణాల కోసం రక్షించుకోమంటూ తమకి చెప్పారని, అంతేకాకుండా ఎవరిని బడితే వాళ్ళని విచక్షణ రహితంగా తుపాకీలతో కాల్చి చంపుతున్నారని, సెక్యూరిటీ గార్డులు హెచ్చరించినట్లు చెప్పుకొచ్చింది ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model). అయితే ఎటాక్ (Attack) జరుగుతున్న సందర్భంలో తాము నిజానికి ఒక పెద్ద డస్ట్ బిన్ వెనక దాకున్నామని, తనతో పాటు 14 మంది మూడు గంటలు దాకున్నప్పటికీ, చాలామంది వాళ్లని కనిపెట్టి తన బాయ్ ఫ్రెండ్ ను కాల్చి చంపారని బాధాకరమైన విషాద కథను వెల్లడించింది ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model). సమయంలోనే చాలామంది తమని కాపాడమంటూ తమని బందీలుగా చేయొద్దు అంటూ ఆర్తనాదాలు చేసినట్లు ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model) వెల్లడించింది. ఘోరమైన సంఘటన నుంచి బయటపడేందుకు చాలామందికి ఫోన్లు చేస్తూ, భయానక సందర్భం మరొకసారి గుర్తు చేసుకుంది ఇజ్రాయిల్‌ (Israel) మోడల్ (Model).