Siddharth Mallya: ప్రియురాలితో విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం

దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా(Vijay mallya) పేరు అందరికీ తెలిసిందే. అయితే అతని కుమారుడు సిద్ధార్థ్ మాల్యా(Siddharth mallya) ఇటివల తన ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. సరికొత్త పద్ధతిలో తన ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.    హాలోవీన్ పార్టీని అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పాశ్చాత్య సంస్కృతిలో ఈ రోజుకి భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ సందర్భంగా విజయ్ మాల్యా(Vijay Mallya) తనయుడు సిద్ధార్థ్ […]

Share:

దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా(Vijay mallya) పేరు అందరికీ తెలిసిందే. అయితే అతని కుమారుడు సిద్ధార్థ్ మాల్యా(Siddharth mallya) ఇటివల తన ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. సరికొత్త పద్ధతిలో తన ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.   

హాలోవీన్ పార్టీని అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పాశ్చాత్య సంస్కృతిలో ఈ రోజుకి భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ సందర్భంగా విజయ్ మాల్యా(Vijay Mallya) తనయుడు సిద్ధార్థ్ మాల్యా(Siddharth Mallya) తన ప్రియురాలితో నిశ్చితార్థం(Engagement) చేసుకున్నాడు. సిద్ధార్థ్ నిశ్చితార్థానికి హాలోవీన్‌కి ఏమి సంబంధం అని మీరు ఆశ్చర్యపోవచ్చు? సిద్ధార్థ్ గర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్‌కి ప్రపోజ్ చేసిన హాలోవీన్ థీమ్‌ దెయ్యం తరహాలో ఉండటం విశేషం.

ఈ విషయాన్ని నవంబర్ 1న సిద్ధార్థ్ మాల్యా తన స్నేహితురాలు జాస్మిన్‌తో తన నిశ్చితార్థానికి(Engagement) సంబంధించిన కొన్ని చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) హ్యాండిల్‌లో పంచుకున్నాడు. మొదటి చిత్రంలో సిద్ధార్థ్ తన మోకాళ్లపై కూర్చుని తన ప్రేయసికి ప్రపోజ్(Propose) చేస్తున్నాడు. హాలోవీన్ ట్రెండ్‌(Halloween trend)కి తగ్గట్టుగా విజయ్ మాల్యా కొడుకు గుమ్మడికాయ డ్రెస్ వేసుకున్నాడు. అతని స్నేహితురాలు మంత్రగత్తె థీమ్ దుస్తులను ధరించింది. రెండవ చిత్రంలో ఇద్దరూ ఒకరితో ఒకరు పోజులివ్వడం కనిపిస్తుంది. చిత్రాలలో జాస్మిన్ తన ఉంగరాన్ని చూపుతూ కనిపిస్తుంది.

 ఈ చిత్రాలను పంచుకుంటూ సిద్ధార్థ్ ఇలా వ్రాశాడు. ఐ లవ్ యూ మై జాఫెట్ అని పేర్కొన్నాడు. ఆ క్రమంలో గుమ్మడికాయ, రెడ్ హార్ట్, రింగ్ ఎమోజీని పోస్ట్ చేశాడు. ఈ గుమ్మడికాయకు అవును అని చెప్పినందుకు ధన్యవాదాలు అని అతను రాసుకొచ్చాడు. అతని పోస్ట్‌పై సుస్సానే ఖాన్(Sussane Khan) స్పందిస్తూ ‘అభినందనలు, ఇది చాలా క్యూట్‌గా ఉంది’ అని అన్నారు. ఇది తెలిసిన పలువురితోపాటు అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. 

సిద్ధార్థ్ మాల్యాకు(Siddharth Mallya) ప్రేమ వ్యవహారాలు ఏమీ కొదవ కాదు. ఇది వరకూ దీపికా పదుకునేతో(Deepika Padakune) కూడా కొన్నాళ్లు ప్రేమాయణాన్ని సాగించాడు విజయ్ మాల్యా తనయుడు. మరి ఇప్పుడు తమ వ్యాపార సామ్రాజ్యం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్నా.. తండ్రి విదేశానీకి పరారీ అయినా చిన్న మాల్యా సోగ్గాడి వేషాలు మాత్రం ఏమీ తగ్గలేదని స్పష్టం అవుతోంది.

అయితే సోషల్ మీడియాలో జాస్మిన్(Jasmine) ఎవరనే సమాచారం పెద్దగా లేదు. జాస్మిన్ సిద్ధార్థ్‌తో చాలా కాలంగా డేటింగ్(Dating) చేస్తోంది. ఇద్దరూ చాలా కాలంగా లివ్ ఇన్ రిలేషన్ షిప్(Live in relationship)లో జీవిస్తున్నారు. జాస్మిన్ ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం ఆమె ప్రయాణాలను ఇష్టపడుతుంది. ఆమె ప్రపంచమంతా తిరుగుతుంది. ఆమె తన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పంచుకుంటూ ఉంటుంది. ఈ చిత్రాలు చూశాక ఆయన ప్రయాణ ప్రియుడని అర్థమవుతుంది. ఇది మాత్రమే కాదు, జాస్మిన్ ప్రకృతి, డాగ్స్ లవర్ అని కూడా తెలుస్తోంది.

సిద్ధార్థ్ మాల్యా నటుడు, మోడల్. అతని తండ్రి విజయ్ మాల్యా(Vijay Mallya), యూబీ గ్రూప్(UB Group) మాజీ ఛైర్మన్. సిద్ధార్థ్ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌లో జన్మించాడు. లండన్, యూఏఈలో పెరిగాడు. వెల్లింగ్టన్ కాలేజీ మరియు క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో చదువుకున్నాడు. అలాగే రాయల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ స్పీచ్ అండ్ డ్రామాలో చదువుకున్నాడు. సిద్ధార్థ్ డ్రామా స్కూల్ నుండి పట్టా పొందిన తరువాత మోడల్, నటుడిగా పనిచేయడం ప్రారంభించాడు. కామెడీ చిత్రం బ్రహ్మన్ నామంతో సహా అనేక చలనచిత్రాలు, టెలివిజన్ షోలలో అతను కనిపించాడు. అలాగే ఆన్‌లైన్ వీడియో షోను కూడా హోస్ట్ చేశాడు. అదేవిధంగాద గిన్నిస్‌కు మార్కెటింగ్ మేనేజర్‌గా కూడా పనిచేశాడు.