Vivek Ramaswamy: అందరం దేవుడి బిడ్డలమే అంటున్నా వివేక్ రామస్వామి

నమ్మకమే నడిపిస్తుంది అంటూ..

Courtesy: Twitter

Share:

Vivek Ramaswamy: యూఎస్ ప్రెసిడెంట్ (President) 2024 ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న వేళ బరిలోకి చాలామంది పోటీదారులు చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, భారతీయ-అమెరికన్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి (Vivek Ramaswamy), గత నెలలో జరిగిన పోల్ విధానం ప్రకారం రిపబ్లికన్ ప్రెసిడెంట్ (President) ఫీల్డ్‌లో రెండవ స్థానంలో నిలిచారు. అయితే అత్యధికంగా మాజీ ప్రెసిడెంట్ (President)డోనాల్డ్ ట్రంప్ కు అమెరికా ప్రజలు పాల్గొన్న పోలింగ్ ద్వారా అత్యధికంగా ఆధర అభిమానాలు లభించినట్లు తెలుస్తోంది. ఇటీవల డిబేట్ లో పాల్గొన్న వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) చేసిన ప్రతిపాదన అందర్నీ ఆశ్చర్యానికి చేసింది. అయితే అందరం కూడా దేవుని (God) బిడ్డలమే అంటూ, విశ్వాసమే మనల్ని నడిపిస్తుంది అంటూ మాట్లాడారు వివేక్ రామస్వామి (Vivek Ramaswamy). 

దేవుడి బిడ్డలమే అంటున్నా వివేక్ రామస్వామి: 

డైలీ సిగ్నల్ ప్లాట్ఫారం ద్వారా శనివారం నాడు జరిగిన ఒక కార్యక్రమం,లో ఇండియన్ అమెరికన్ ఎంటర్ప్రీనర్ అయిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy), దేవుడు (God) గురించి ప్రస్తావించాడు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇష్ట దైవాన్ని నమ్ముతూ ముందుకు సాగాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఈ భూమి మీదకి ఒక ప్రత్యేకమైన పని గురించి వస్తామని, అందరూ దేవుడి (God) బిడ్డలమే అంటూ ప్రస్తావించాడు. మరి ముఖ్యంగా కార్యక్రమంలో మాట్లాడిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) తన చిన్నతనం నుంచి కూడా తమ తల్లిదండ్రులు తనకి దేవుని (God) పట్ల గౌరవాన్ని, విశ్వాసాన్ని ఎంతగా నేర్పించారో తనకి గుర్తుందని, అంతేకాకుండా తాను చదివిన హైస్కూల్లో ముఖ్యంగా బైబిల్ చెబుతున్న 10 ముఖ్య విషయాలను గుర్తు చేస్తాడు. పెద్దలను గౌరవించాలి అంటూ, పాపం చేయకూడదు, దొంగలించకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచారించకూడదు ఇలా చాలా విషయాలు క్రిస్టియానిటీ ద్వారా నేర్చుకున్నానని అదేవిధంగా తన హిందూ (Hindu) మతంలో కూడా దేవుడు (God) చెప్పే విషయాలను దేవుడు (God) పట్ల ఉండే విశ్వాసాన్ని ముందుకు తీసుకు వెళ్తూ జీవించాలి అని చెప్పుకొచ్చాడు వివేక్ రామస్వామి (Vivek Ramaswamy). అయితే దేశానికి అధ్యక్షుడు ఎవరు కూడా కేవలం క్రిస్టియన్ లోనే నడవాలని, హిందూ (Hindu) మతంలోనే నడవాలని చెప్పడం జరగదని, కేవలం మతాలలో ఉండే కొన్ని విలువలను ముందు తరాలకు తీసుకువెళ్లడానికి అందరూ ప్రయత్నిస్తారని గుర్తు చేస్తాడు. 

వివేక్ రామస్వామి ప్రతిపాదన: 

అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి (Vivek Ramaswamy), తన రెండవ రిపబ్లికన్ అధ్యక్ష డిబేట్ లో, యుఎస్‌లోని అక్రమ వలసదారుల పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు తనవైపు నుంచి కూడా సపోర్ట్ అందిస్తున్నట్లు ఇటీవల ప్రకటించాడు. కాలిఫోర్నియాలోని సిమి వ్యాలీలోని రోనాల్డ్ రీగన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ కం. మ్యూజియంలో, బుధవారం జరిగిన 2024 ఎన్నికల సందర్భంగా జరిగిన రెండవ రిపబ్లికన్ డిబేట్ ఇది. ఇందులో ముఖ్యంగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి నిక్కీ హేలీతో సహా మరో ఆరుగురు అభ్యర్థులలు డిబేట్ లో పాల్గొనడం జరిగింది.

ఎటువంటి అధికార ఆధారాలులేని వలసదారులను, అంతేకాకుండా అమెరికాలో జన్మించిన వారి పిల్లలను దేశం నుండి బహిష్కరించడానికి ఎటువంటి చట్టాన్ని తీసుకువస్తారని, అంతేకాకుండా ఎటువంటి హక్కుల సవరణ చేసే ఉద్దేశం ఉంది అని.. యూఎస్ ప్రెసిడెంట్ (President) ఎలక్షన్స్ బరిలో ఉన్న వివేక్ రామస్వామి (Vivek Ramaswamy)ని అడగడం జరిగింది.. అయితే దీనికి బదులుగా సమాధానమిచ్చిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy)..ప్రతిపాదించిన జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేసే, అప్పటి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 2015 ప్రతిపాదనను పునరుజ్జీవింపజేసినట్లు, బుధవారం వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. 

US రాజ్యాంగంలో ఉన్న 14వ సవరణ పౌరసత్వ నిబంధనలోని దాని ప్రకారం, యూఎస్ కి వలసదారులుగా వచ్చినప్పటికీ.. అంతేకాకుండా ఇక్కడే తమ బిడ్డలకు జన్మనిచ్చిన పౌరులు, తమ వారసత్వ పిల్లలు.. యూఎస్ పౌరులు అవుతారు.  యుఎస్ గడ్డపై జన్మించిన వారికి పౌరసత్వాన్ని మంజూరు చేస్తూ, ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయాన్ని చాలా మంది అంగీకరిస్తున్నప్పటికీ, కొంతమంది న్యాయమూర్తులు మాత్రం.. పౌరుసత్వ హక్కును పరిమితం చేయడానికి ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఉంటుంది అని వాదించారు. రాజ్యాంగ సూత్రాలను పరిమితం చేయవచ్చని కూడా నివేదిక పేర్కొంది.