Moon: చంద్రడు భూమిని ఢీ కొన్నాడో..

ఏం జరుగుతుందో తెలుసా

Courtesy: Unsplash

Share:

Moon: చంద్రుడు (Moon) కనుక భూమిని (Earth) ఢీ కొంటే ఏం జరుగుతుందని చాలా మంది ఆలోచిస్తూనే ఉంటారు. అసలు భూమి చుట్టూ చంద్రుడు (Moon) తిరుగుతాడని చెబుతారు. అటువంటపుడు చంద్రుడు (Moon) భూమి మీద ఎందుకు పడడు అని కూడా అనేక మంది ఆలోచిస్తారు. భూమికి గురుత్వాకర్షణ శక్తి (Gravitational Force) ఉంటుంది. అది భూమి నుంచి దూరంగా విసిరేసిన వస్తువులను తనవైపు కు లాక్కుంటుంది. అలాగే చంద్రుడిని (Moon) కూడా లాక్కోదా? అని అనేక మంది మెదళ్లలో సందేహాలు మెదులుతూ ఉంటాయి. అవును భూమికి గురుత్వాకర్షణ శక్తి (Gravitational Force) ఉంటుంది. ఆ శక్తి చంద్రుడి (Moon)ని భూమి వైపు లాక్కొంటుంది వాస్తవమే. అందుకోసమే చంద్రుడు (Moon) భూమి వైపుకు రావాలి కానీ ఇక్కడ ఓ కిటుకు ఉంది. అందువల్లే చంద్రుడు భూమి వైపుకు రావడం లేదు.. భూమి మీద పడడం లేదు. 

దాని వల్లే దూరం..

భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్న మాట వాస్తవమే కానీ చంద్రుడిని భూమి వైపుకు రాకుండా ఓ శక్తి నిలువరిస్తుంది. అందుకోసమే చంద్రుడు (Moon)  తన కక్ష్యలో (Orbit) తానే తిరుగుతుంటాడు. తన కక్ష్య దాటి బయటకు రాకుండా ఉంటాడు. సెంట్రిపెటల్ ఫోర్స్ (Centripetal Force) చంద్రుడిని నిలువరిస్తుంది. అందుకోసమే చంద్రుడు తన కక్ష్య (Orbit) నుంచి బయటకు రాకుండా ఉంటాడు. అందుకోసమే మన భూమి (Earth) చాలా సేఫ్ గా ఉంది. లేకపోతే ఎన్నడో చంద్రుడు మన భూమి మీద పడిపోయి.. అంతా అల్లకల్లోలం అయ్యేది. 

అలా చేసిన మొదటి దేశం మనదే.. 

చందమామ (Moon) మనకు చాాలా దగ్గర అనే మాటను ఇండియా మరో మారు ప్రూవ్ చేసింది. అందుకోసమే మనం చంద్రయాన్ మిషన్ (Chandrayaan Mission) ను ప్రవేశపెట్టి విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవం (South Pole) మీద ల్యాండ్ చేసి చూపెట్టింది. ఈ విధంగా చంద్రుడి దక్షిణ ధృవం మీద ల్యాండ్ (Land)  చేసిన మొదటి దేశంగా ఇండియా రికార్డు (Record) క్రియేట్ చేసింది. మన ఇస్రో ఎన్నో చారిత్రాత్మక ప్రయోగాలు చేపట్టినా కానీ చంద్రయాన్-3 ప్రయోగం మాత్రం ఒక మైలురాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

చంద్రుడు అలానే పుట్టాడు.. 

అసలు చంద్రుడు (Moon) ఎలా ఆవిర్భవించాడని కొంత మంది ఆలోచిస్తారు. భూమి చాలా వేగంగా తిరుగుతుండగా.. కొంత పదార్థం విరిగిపోయి గ్రహం చుట్టూ తిరగడం ప్రారంభించింది. దీని వల్లే చంద్రుడు(Moon) ఉద్భవించాడని చాలా మంది నమ్ముతారు. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు మన గ్రహం (Planet) మీద ఎందుకు పడడు మరియు అది జరిగితే ఏమి జరుగుతుంది అని కూడా కొంత మంది  ఆలోచిస్తారు. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి చంద్రుడిని తన వైపుకు లాగుతుంది, కానీ సెంట్రిపెటల్ ఫోర్స్ దానిని మన గ్రహం నుండి దూరంగా ఉంచుతుంది. ఈ రెండు శక్తుల ఫలితంగా చంద్రుడు(Moon) భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు.. తప్పా.. తన కక్ష్య (Orbit)ను విడిచిపెట్టి మన భూమి మీద పడడు. ఒక వేళ ఈ రెండు శక్తులు అంతరించిపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఊహించడానికే భయంగా ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు (Scientists) చెబుతున్నారు. ఇది జరిగితే, చంద్రుడు భూమిని ఢీకొనడం వల్ల చాలా వినాశకరమైన ప్రభావాలు ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. 

చాలా ఘోరాలు.. 

చంద్రుడు (Moon) కనుక భూమి మీద పడిపోతే ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదురుకానున్నాయి. అనేక రకాలుగా మానవజాతికి (Mans) నష్టం వాటిల్లనుంది. కానీ చంద్రుడు మెల్లగా రోజురోజుకూ భూమి నుండి దూరంగా కదులుతున్నాడని కావున ఎటువంటి భయం (Fear) చెందాల్సిన అవసరం లేదని కొంత మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ చంద్రుడు కనుక భూమిని ఢీకొంటే పెద్ద ఎత్తున భూకంపాలు (Earthquake), సునామీలు మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తాయట. అంతే కాకుండా తీరానికి సమీపంలో ఉన్న నగరాలు కూడా పూర్తిగా మునిగిపోతాయట. ధూళి (Dust) మరియు వాయువు యొక్క మేఘాలు ఆకాశాన్ని కప్పివేస్తాయని, చీకటి భూమిని చుట్టుముడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అటువంటి సమయంలో జీవితం పూర్తిగా నిలిచిపోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతానికి ఇటువంటి విపత్తు సంభవించే అవకాశం లేదు కావున.. చాాలా నిశ్చింతగా ఉండొచ్చు. చంద్రుడు ప్రతి సంవత్సరం భూమి నుండి 1.5 అంగుళాలు కదులుతున్నట్లు పరిశోధనలో కనుగొనబడింది. చివరికి, ఈ సహజ ఉపగ్రహం భూమి (Earth) నుండి పూర్తిగా దూరంగా వెళ్లి అదృశ్యమయ్యే సమయం వస్తుంది, ఇది వినాశకరమైన పరిణామాలకు కూడా కారణమవుతుంది. అయితే ఇది ఒక బిలియన్ సంవత్సరాల తర్వాత జరుగుతుంది కాబట్టి మనం లేదా రాబోయే తరాల వేలాది మంది దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.కావున ఇది ఈ మధ్య రాదు కాబట్టి మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఏ విధమైన ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత రోజుల్లో చంద్రుడి వలన మన భూ గ్రహానికి వచ్చిన నష్టం ఏమీ లేదు కావున మానవ జాతి రిలాక్స్ డ్ గా ఉండొచ్చు. కేవలం కాలుష్యం (Pollution) తగ్గించుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Tags :