Viral Video: ఎయిర్‌పోర్ట్‌లో ప్రియుడికి  డ్యాన్స్‌తో స్వాగతం.. వీడియో వైరల్

Viral Video: ఐదేళ్ల తరువాత వస్తున్న బాయ్‌ఫ్రెండ్‌(Boyfriend)కు ఎయిర్‌పోర్టు(Airport)లో డ్యాన్స్‌(Dance) చేస్తూ స్వాగతం పలికిన ఓ మహిళ వీడియో నెట్టింట వైరల్‌(Viral Video)గా మారింది. మనసుపడ్డవారిపై ప్రేమ ఉండటం సహజమే కానీ ఆ భావాన్ని అవతలి వారి మనసుకు తాకేలా వ్యక్తీకరించడం ఓ కళ. ఈ కళలో ఆరితేరిన ఓ మహిళ వీడియో నెట్టింట వైరల్‌(Viral)గా మారింది. వీడియోలోని యువతి అయిదేళ్ల తరువాత వచ్చిన తన బాయ్‌ఫ్రెండ్‌(Boy Friend)కు ఇచ్చిన ఓ బహుమతి అతడితో కంట తడి […]

Share:

Viral Video: ఐదేళ్ల తరువాత వస్తున్న బాయ్‌ఫ్రెండ్‌(Boyfriend)కు ఎయిర్‌పోర్టు(Airport)లో డ్యాన్స్‌(Dance) చేస్తూ స్వాగతం పలికిన ఓ మహిళ వీడియో నెట్టింట వైరల్‌(Viral Video)గా మారింది.

మనసుపడ్డవారిపై ప్రేమ ఉండటం సహజమే కానీ ఆ భావాన్ని అవతలి వారి మనసుకు తాకేలా వ్యక్తీకరించడం ఓ కళ. ఈ కళలో ఆరితేరిన ఓ మహిళ వీడియో నెట్టింట వైరల్‌(Viral)గా మారింది. వీడియోలోని యువతి అయిదేళ్ల తరువాత వచ్చిన తన బాయ్‌ఫ్రెండ్‌(Boy Friend)కు ఇచ్చిన ఓ బహుమతి అతడితో కంట తడి పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది. 

కెనడాలోని టొరంటో(Toronto)లో నివాసం ఉండే ఓ యువతి.. చాలా రోజులుగా తన బాయ్‌ఫ్రెండ్‌ను కలుసుకోలేదు. ఇద్దరూ వేరు వేరు దేశాల్లో ఉండటంతో ఫోన్లో మాట్లాడుకోవడమే తప్ప డైరెక్ట్‌గా కలుసుకుని కబుర్లు చెప్పుకుంది లేదు. ఈ క్రమంలో సుమారు ఐదేళ్ల తర్వాత ప్రియుడు (Meets Boyfriend After 5 Years) తన వద్దకు వస్తుండటంతో ఆ యువతి పట్టరాని ఆనందంతో ఉంది. ఈ క్రమంలోనే ప్రియుడికి ప్రత్యేకంగా స్వాగతం పలకాలనుకుంది. ఈ మేరకు విమానాశ్రయం(Airport)లో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. 

ముందుగా విమానాశ్రయంలో (Canadian Airport) దిగి బైటకు వచ్చిన యువతి ప్రియుడికి కొందరు అబ్బాయిలు గులాబీ పువ్వులతో స్వాగతం పలుకుతారు. దీంతో ఆ యువకుడు తన ప్రియ సఖి కోసం అటూఇటూ చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ యువతి షేర్షా చిత్రంలోని ‘రాతన్‌ లంబియాన్‌..’(Rataan Lambiyan) పాటకు డ్యాన్స్‌ చేస్తూ అతడి ముందుకు వెళ్తుంది. దీంతో ఆ యువకుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతాడు. అనంతరం యువతిని గట్టిగా కౌగలించుకుంటాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌(Viral) అవుతోంది.

నికిషా(niki shah) అనే ఇన్‌స్టా హ్యాండిల్‌లో తొలిసారి ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ఓ మహిళ తన ప్రియుడికి కెనడా(Canada) విమానాశ్రయంలో అతడు కలలో కూడా ఊహించని రీతిలో స్వాగతం పలికింది. రాత్రుళ్లు ఒంటరిగా గడుస్తున్నాయన్న చరణాలతో సాగే ఈ పాటకు డ్యాన్స్‌ చేస్తూ ఆమె తనపై ప్రేమను వ్యక్తీకరించిన తీరు యువకుడితో కన్నీళ్లు పెట్టించింది. 

ఆ డ్యాన్స్ వారిద్దరినీ మరింత దగ్గరా చేసినప్పటికీ ఎయిర్‌పోర్టులోని ఇతర ప్రయాణికులకు వింతగా తోచింది. దీంతో, వారు డ్యాన్స్ చేస్తున్న మహిళను వింతగా చూడటం వీడియోలో రికార్డైంది. కానీ, ఈ వీడియో నెటిజన్లకు విపరీతంగా నచ్చడంతో కొద్ది రోజుల్లోనే ఏకంగా 3.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే, ఇలా ఎయిర్‌పోర్టు(Airport) డ్యాన్సుల వీడియోలు గతంలోనూ వైరల్ అయ్యాయి. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో కొందరు అకస్మాత్తుగా గార్బా డ్యాన్స్ చేయడం నెట్టింట వైరల్‌గా మారింది.

నికిషా(Niki Shah) సుదూర సంబంధాలతో వ్యవహరించడం గురించి పంచుకుంది, సవాళ్ల ద్వారా నావిగేట్ చేయడంలో నమ్మకం, కమ్యూనికేషన్, సహనం మరియు ప్రేమ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. అన్ని సంబంధాలు సమస్యలను ఎదుర్కొంటాయని, అయితే సుదూర సంబంధాలు ప్రత్యేక సమస్యలను కలిగి ఉన్నాయని ఆమె అంగీకరించింది. సుదూర సంబంధాన్ని కొనసాగించడం వల్ల బంధం బలపడుతుందని, ప్రజలు పట్టుదలతో ఉండాలని, సంతోషాన్ని కలిగించే భాగస్వామిని కనుగొని, కలలకు తగిన సంబంధాన్ని నిర్మించుకునే అనుభవం నుండి బయటపడాలని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

యూకేలో, తన ప్రియుడిపై ప్రేమను తెల్పడానికి అనా స్టాన్స్‌కోవ్‌స్కీ(Ana Stankowski) అనే ఇన్‌ఫ్లుయెన్సర్  తన బాయ్ ఫ్రెండ్ పేరు ‘కెవిన్’ అని తన నుదుటిపై శాశ్వతంగా పచ్చబొట్టు పెట్టుకున్నట్లు చెప్పుకోవడం ద్వారా ఇంటర్నెట్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. టాటూ ఆర్టిస్ట్ తన నుదిటిపై పెద్ద నల్ల అక్షరాలతో పేరు రాస్తున్నట్లు చూపుతున్న వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.