Samsung Galaxy S23 సిరీస్ పై భారీగా ధర తగ్గింపు.. ఓ లుక్కేయండి

Samsung Galaxy S23 సిరీస్ మొబైల్స్ కొనుగోలు చేయాలనుకున్న వారికి శుభవార్త. ఈ సిరీస్ భారతీయ మార్కెట్‌లో భారీ ధర తగ్గింపును పొందింది.

Courtesy: Top Indian News

Share:

Samsung Galaxy S23 సిరీస్ మొబైల్స్ కొనుగోలు చేయాలనుకున్న వారికి శుభవార్త. ఈ సిరీస్ భారతీయ మార్కెట్‌లో భారీ ధర తగ్గింపును పొందింది. Samsung Galaxy S24 సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో Samsung Galaxy S23 సిరీస్ పై భారీ తగ్గింపు రావడం విశేషం. Samsung Galaxy S24 సిరీస్‌ను జనవరి 17, 2024న లాంచ్ చేయబోతోంది. లాంచ్‌కు ముందు, Galaxy S23 మరియు Galaxy S23+ మొబైల్స్ పై ధరలు రూ.10,000 తగ్గింపు కంపెనీ అందిస్తోంది. వినియోగదారులు మరో రూ.10,000 తక్షణ బ్యాంక్ తగ్గింపును కూడా పొందవచ్చు. అంటే మొత్తం రూ.20,000 తగ్గింపు పొందవచ్చు. Samsung Galaxy S23 సిరీస్ పవర్ ఫుల్ డిస్‌ప్లే, ప్రాసెసర్ మరియు కెమెరాను కలిగి ఉన్నందున కొంతమంది వినియోగదారులకు ఇది మంచి డీల్ గా చెప్పొచ్చు.

Samsung Galaxy S23 బేస్ మోడల్ 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ.74,999కి ప్రారంభించబడింది. ఇప్పుడు దీన్ని రూ.54,999కి మాత్రమే పొందవచ్చు. అయితే, Galaxy S24 సిరీస్ కోసం వేచి ఉన్న వారు మరికొద్ది రోజులు ఆగడం మంచిది. ఎందుకంటే Galaxy S24 సిరీస్ భారతదేశంలో Galaxy S23 సిరీస్ కంటే తక్కువ ధరలో ఉంటుందని భావిస్తున్నారు. అదే జరిగితే, బ్యాంక్ డిస్కౌంట్‌లతో పాటు, S24 సిరీస్ కూడా కస్టమర్‌లకు మంచి డీల్‌గా ఉంటుంది. 

Samsung Galaxy S23 సిరీస్ Qualcomm Snapdragon 8 Gen 2 SoC ద్వారా వస్తుంది, అయితే S24 సిరీస్ ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే స్నాప్‌డ్రాగన్ 8 Gen 3తో వస్తుందని భావిస్తున్నారు. భారతదేశం కోసం, Samsung మళ్లీ Exynos చిప్‌లను అందిస్తోందని తెలుస్తోంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల విషయంలో Qualcomm నుండి వచ్చిన స్నాప్‌డ్రాగన్ చిప్‌లతో పోల్చినప్పుడు Exynos చిప్‌లకు అంతగా మంచి పేరు లేదు. 

Galaxy S23 స్పెసిఫికేషన్లు
Galaxy S23 డిస్‌ప్లే 2340x1080 పిక్సెల్‌లకు మద్దతుతో వస్తుంది మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. S23 సిరీస్ వెనుక కెమెరాల ద్వారా గరిష్టంగా 8K ఫార్మాట్‌లో 30 fps లేదా 4K 60 fps వద్ద వీడియోలను రికార్డ్ చేయగలదు. గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13తో కూడిన వన్‌యూఐ 5.1తో వస్తోంది. ఇందులో 6.1 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే, డైనమిక్‌ అమోలెడ్‌ 2ఎక్స్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో డిస్‌ప్లే అమర్చారు. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్ ‌2 ప్రాసెసర్‌ను వినియోగించారు. వెనుక వైపు 50 ఎంపీ కెమెరా, 12 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 10 ఎంపీ టెలీఫోటో కెమెరాను అమర్చారు. ముందు వైపు 12 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5జీ, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌, ఐపీ68 రేటింగ్‌ కలిగిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ అందిస్తున్నారు. 3900 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25W వైర్డ్‌ ఛార్జింగ్‌కు, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.