2023 లో అత్యధికంగా అమ్ముడైన OnePlus స్మార్ట్ ఫోన్ ఇదే..!

Oneplus: ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ భారతదేశంలో తన 10 సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. అంతేకాకుండా, ఈ కంపెనీ అమెజాన్‌తో 10 సంవత్సరాల భాగస్వామ్యాన్ని కూడా పూర్తిచేసుకుంది.

Courtesy: Top Indian News

Share:

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్ మొబైల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ భారతదేశంలో తన 10 సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. అంతేకాకుండా,  ఈ కంపెనీ అమెజాన్‌తో 10 సంవత్సరాల భాగస్వామ్యాన్ని కూడా పూర్తిచేసుకుంది. ఇప్పుడు కూడా ఈ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ OnePlus 12 మరియు OnePlus 12R లను లాంచ్ చేయడానికి 'స్మూత్ బియాండ్ బిలీఫ్' ఈవెంట్‌ను జనవరి 23న 2024 జరపడానికి సిద్ధమైంది.  ఈ క్రమంలో ఆ కంపెనీ 2023 సంవత్సరం లో అమెజాన్ ఇండియాలో తమ ఉత్పత్తుల అత్యధిక అమ్మకాల వివరాలను వెల్లడించింది. OnePlus 11R 5G మరియు OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌లు అద్భుతమైన అమ్మకాలను నమోదు చేసుకున్నట్లు పేర్కొంది. ఈ సంవత్సరం అమెజాన్ లో రూ.30,000 లలో OnePlus 11R 5G ఫోన్ అత్యధికంగా అమ్ముడైన ఆండ్రాయిడ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా అవతరించిందని OnePlus పేర్కొంది. ఈ మేరకు బుధవారం OnePlus ఓ ప్రకటనలో దశాబ్ది ఉత్సవాల గురించి వెల్లడించింది. అమెజాన్ ఇండియాతో 10 సంవత్సరాల భాగస్వామ్యం గురించి కూడా కంపెనీ ప్రకటించింది. 


OnePlus 11R 5G టాప్ :
ధర రూ.30,000 సెగ్మెంట్లో అమెజాన్ లో అత్యధికంగా అమ్ముడైన ఆండ్రాయిడ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా OnePlus 11R 5G టాప్ లో నిలిచిందని పేర్కొంది. అదేవిధంగా, 2023 లో అమెజాన్ లో OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లోని అన్ని ధరల విభాగాలలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. OnePlus 11R 5G ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC తో ఫిబ్రవరిలో లాంచ్ అయింది. లాంచ్ సమయంలో దీని ధర రూ. 39,999 వద్ద ఉంది. అదేవిధంగా, ఏప్రిల్‌లో OnePlus Nord CE 3 Lite 5G రూ.19,999 ప్రారంభ ధరతో ఆవిష్కరించబడింది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ పై పనిచేస్తుంది.

వన్‌ప్లస్ సంస్థ 2014 లో OnePlus One యొక్క లాంచ్ తో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుండి, అమెజాన్ కంపెనీకి OnePlus కంపెనీ ప్రత్యేకమైన ఇ-కామర్స్ భాగస్వామిగా ఉంది. సంస్థ సీఈఓ, పీట్ లా నేతృత్వంలోని ఈ బ్రాండ్, ప్రారంభమైనప్పటి నుండి ఇ-కామర్స్ భాగస్వామి ద్వారా దేశంలో 98.9 శాతం పిన్ కోడ్‌లలో 12 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించినట్లు తెలిపింది. 10 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, జనవరి 23న న్యూఢిల్లీలో వన్‌ప్లస్ 'స్మూత్ బియాండ్ బిలీఫ్' ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ లాంచ్ ఈవెంట్‌లో తమ కొత్త OnePlus 12 మరియు OnePlus 12R ఫోన్ల లాంచ్ కూడా జరుగుతుంది. OnePlus 12 ఫోన్ ఇప్పటికే చైనా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.ఈ కార్యక్రమం భారతదేశంలో జనవరి 23న సాయంత్రం 7:30 PM ISTకి జరుగుతుంది. ఈ లాంచ్ ఈవెంట్‌లో OnePlus 12 మరియు OnePlus 12R లాంచ్ చేయబడతాయి. ఎప్పటిలాగే, OnePlus 12 అనేది కంపెనీ యొక్క హై-ఎండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోడల్ గా రాబోతోంది.