Sam Altman: ఓపెన్‌ఏఐలో కొత్త ట్విస్ట్‌.. సీఈఓగా తిరిగి రానున్న శామ్‌ ఆల్ట్‌మన్‌

సత్యనాదెళ్ల ఏమన్నారంటే..

Courtesy: Twitter

Share:

Sam Altman: ఓపెన్ఏఐ సీఈఓగా ఉద్వాసనకు గురైన శామ్ఆల్ట్మన్‌(Sam Altman) తిరిగి బాధ్యతల్లోకి రానున్నారు. మేరకు ఒప్పందం కుదిరినట్లు కంపెనీ ప్రకటించింది.

చాట్జీపీటీ(Chat GPT) సృష్టికర్త శామ్ఆల్ట్మన్‌ (Sam Altman) తొలగింపుతో ఓపెన్ఏఐలో నెలకొన్న నాటకీయ పరిణామాలకు తెరపడింది. ఆల్ట్మన్తిరిగి ఓపెన్ఏఐ (OpenAI)కి రానున్నారు. సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే కంపెనీకి కొత్త బోర్డు సైతం రానున్నట్లు ఓపెన్ఏఐ ప్రకటించింది. మేరకు ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. విషయాన్ని ఆల్ట్మన్‌ (Sam Altman) సైతం ఎక్స్వేదికగా ధ్రువీకరించారు.

ఆల్ట్మన్‌ (Sam Altman) తొలగింపు తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓపెన్ఏఐ (OpenAI)లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న మైక్రోసాఫ్ట్సీఈఓ సత్య నాదెళ్ల(Satya Nadella) సైతం ఆయనకు మద్దతుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే కంపెనీలో చాలా మంది ఉద్యోగులు రాజీనామా చేస్తామని హెచ్చరించినట్లు వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. మరోవైపు ఇన్వెస్టర్లు సైతం ఆల్ట్మన్‌ (Sam Altman)ను తిరిగి తీసుకురావాలని కోరినట్లు వెల్లడించారు. నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

సేల్స్ఫోర్స్మాజీ కో-సీఈఓ బ్రెట్టేలర్‌(Brett Taylor) అధ్యక్షతన అమెరికా మాజీ ట్రెజరీ సెక్రటరీ లారీ సమ్మర్స్‌(Larry Summers), కోరా సీఈఓ ఆడమ్డీ-ఏంజిలోతో(Adam D-Ang) కూడిన కొత్త బోర్డు ఏర్పాటు కానున్నట్లు ఓపెన్ఏఐ (OpenAI) వెల్లడించింది. తాజా నిర్ణయంపై ఆల్ట్మన్‌ (Sam Altman) స్పందిస్తూ.. ఓపెన్ఏఐ (OpenAI) అంటే తనకెంతో ఇష్టమన్నారు. కంపెనీ లక్ష్యాన్ని, దాని కోసం శ్రమిస్తున్న బృందాన్ని నిలిపి ఉంచడం కోసమే తాను గతకొన్ని రోజులుగా నిర్ణయాలు తీసుకున్నానని తెలిపారు. ఓపెన్ఏఐకి తిరిగొచ్చి మైక్రోసాఫ్ట్తో బలమైన బంధాన్ని నెలకొల్పడానికి ఆసక్తిగా ఉన్నానని ఎక్స్లో పోస్ట్చేశారు.

ఓపెన్ఏఐ (OpenAI) తొలగింపు తర్వాత ఆల్ట్మన్‌ (Sam Altman)ను తమ కొత్త ఏఐ పరిశోధన బృందంలోకి తీసుకుంటున్నట్లు, కొత్త అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ టీమ్కి ఆల్ట్మన్ సీఈఓగా ఉంటారని సత్య నాదెళ్ల(Satya Nadella) ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఓపెన్ఏఐ (OpenAI)తో తమ బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు ఆల్ట్మన్తిరిగి ఓపెన్ఏఐకి రావడాన్ని తాను స్వాగతిస్తానని నాదెళ్ల పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను(AI) ఎంత వేగంగా అభివృద్ధి చేయాలి. డబ్బు ఆర్జించాలి అనే దానిపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో శుక్రవారం ఓపెన్ఏఐ(OpenAI) బోర్డుచే ఆల్ట్మాన్ తొలగించబడ్డారు. తర్వాత అతను తిరిగి రావడానికి కంపెనీతో చర్చలు జరిపారు. ఇప్పటికే ఉన్న బోర్డు సభ్యులు రాజీనామా చేయాలని ఆల్ట్మన్(Sam Altman) ఇతరుల ఒత్తిడి కారణంగా చర్చలు ఆదివారం ప్రతిష్టంభనకు చేరుకున్నాయి. బదులుగా బోర్డు కొత్త లీడర్గా మాజీ ట్విచ్ సీఈవోఎమ్మెట్ షియర్ ను నియమించుకుంటామని కూడా ప్రతిపాదించారు. కానీ క్రమంలో మళ్లీ అతన్ని ఒప్పించినట్లు తెలుస్తోంది. బోర్డు తొలగింపు సహా తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని ఆల్ట్మన్‌(Sam Altman) షరతులు విధించినట్లు వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఆయన డిమాండ్ల మేరకు.. బోర్డు పునర్నిర్మాణం జరిగినట్లు తాజా పరిణామాలతో స్పష్టమైంది.

ఆల్ట్మన్పునరాగమనంపై సత్య నాదెళ్ల(Satya Nadella) స్పందించారు. ఓపెన్ఏఐ(OpenAI) బోర్డులో మార్పులు తమను ఉత్సాహపరిచాయన్నారు. మరింత స్థిరమైన, ప్రభావవంతమైన పాలనా విధానాలకు అవసరమైన తొలి అడుగు ఇదేనని తెలిపారు. దీనిపై ఆల్ట్మన్‌, బ్రాక్మన్తో చర్చించినట్లు పేర్కొన్నారు. ఓపెన్ఏఐ నాయకత్వంతో పాటు వారికి కంపెనీలో కీలక స్థానం ఉంటుందని తెలిపారు. తద్వారా సంస్థ లక్ష్యం నిరాటంకంగా ముందుకు సాగుతుందన్నారు. తమ భాగస్వాములు, కస్టమర్లకు విలువతో కూడిన ఏఐని అందించేందుకు ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్బంధం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.