Whatsapp: వాట్సప్ నుంచి కొత్త ఫీచర్

ఛానల్ వాళ్ళకి ప్రత్యేకం..

Courtesy: Twitter

Share:

Whatsapp: ఈజీగా స్టిక్కర్లు (Stickers), జిఐఎఫ్ లను వాట్సాప్ (Whatsapp) ఛానల్స్ లో షేర్ చేసే విధానాన్ని వాట్సప్ కొత్త ఫీచర్లను తీసుకురాబోతుంది. వాట్సప్ కొత్త స్టిక్కర్లు (Stickers) త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి. కీబోర్డు లో సులువుగా వీటిని సెర్చ్ చేసేలా కొత్త కీబోర్డు కూడా రూపొందిస్తున్నట్టు ఇంతకుముందే తెలిసింది. వాట్సప్ కొత్త ప్యాక్ త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ఆల్రెడీ ఇది ఆపిల్ వెర్షన్లో అందుబాటులో ఉంది. ఆపిల్ స్టోర్ లో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.  iOS కోసం WhatsApp బీటా టెస్టింగ్ ప్రోగ్రామ్‌లో భాగమైన, TestFlight యాప్ ద్వారా తాజా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే వినియోగదారులు ఇప్పుడు ఛానెల్ (Channel)‌లలో స్టిక్కర్ (Stickers)‌లను షేర్ చేయడానికి అనుమతించే ఫీచర్‌కి యాక్సెస్‌ ఉంటుంది. 

ఛానల్ వాళ్ళకి ప్రత్యేకం..: 

చాట్ బార్‌లో స్టిక్కర్ (Stickers) బటన్ కనిపిస్తుంది కాబట్టి స్టిక్కర్ (Stickers)‌లను షేర్ చేసే సామర్థ్యం iOS వినియోగదారులకు కూడా అందుబాటులో ఉందని WABetaInfo షేర్ చేసిన స్క్రీన్‌షాట్ వెల్లడించింది. వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ఫీచర్‌లను స్థిరంగా ఉండేలా చేయడం, ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటినీ ఉపయోగించి ఛానెల్ (Channel) యజమానులకు మొత్తం అనుభవాన్ని మెరుగుపరచడం కోసం ఇది ముఖ్యమైన అప్డేట్. వాట్సాప్ (Watsapp) కి సంబంధించి

యాప్ తాజా వెర్షన్ ఇప్పుడు యానిమేటెడ్ స్టిక్కర్ (Stickers)‌లను పంపడానికి మద్దతు ఇస్తుందని, ఛానెల్ (Channel)‌ల వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అంటూ గమనించాలి. ఇంకా, యాప్ స్టోర్ నుండి వాట్సాప్ (Watsapp) బిల్డ్‌ను ఇన్‌స్టాల్ చేసే వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. 

వాట్సాప్ ఈమెయిల్ ఐడి ఆడ్ చేసుకున్నారా?: 

వాట్సాప్ (Watsapp) ఫీచర్లు (Feature) కూడా అందరికీ అర్థమవుతాయి. ప్రస్తుతం చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు వాడే ఏకైక అప్లికేషన్ వాట్సప్. వాట్సప్ అందుబాటులోకి వచ్చాక ఫోన్లలో మెసేజ్ చేసుకోవడం తగ్గింది. ఏ అవసరం ఉన్నా అందరూ వాట్సాప్ (Watsapp) ఏ వాడుతున్నారు. ఇప్పుడు వాట్సప్ గురించి తెలియని వాళ్లు ఎవరు ఉండరు. 

ఇప్పటివరకు మన మొబైల్ (Mobile) ఫోన్ నెంబర్ ఉపయోగించి వాట్సాప్ (Watsapp) అకౌంట్ లో లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు, మన ఈమెయిల్ ఐడి ద్వారా వాట్సాప్ (Watsapp) ఉపయోగించే వెసులుబాటు కనిపిస్తోంది వాట్సాప్ (Watsapp) కొత్త ఫీచర్ (Feature). అయితే ఈ కొత్త విధానం బట్టి, మన కాంటాక్ట్స్ లో ఉన్న ఇతరులకు మన ఈమెయిల్ అడ్రస్ కనిపించే అవకాశం ఉండదు. మీ వాట్సాప్ (Watsapp) అకౌంట్ ఈమెయిల్ అడ్రస్ కి లింక్ చేసుకోవాలంటే, మీరు మీ iPhoneలోని యాప్ (App) స్టోర్ నుండి WhatsApp తాజా వెర్షన్‌ను యూస్ చేస్తున్నారో లేదో చూసుకోవాలి. . ఒకవేళ పాత వర్షన్ ఉపయోగిస్తున్నట్లయితే iOS 2.23.24.70 అప్‌డేట్ కోసం WhatsAppను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, సెట్టింగ్‌ల మెనుకి వెళ్లి, మీ ఇమెయిల్ అడ్రస్ యాడ్ చేసుకోవడానికి > ఇమెయిల్ అడ్రస్ అంటే చేయండి అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. ఈ నెల ప్రారంభంలో ఆండ్రాయిడ్, iOS యాప్ (App) బీటా వెర్షన్‌లలో ఈ ఫీచర్ (Feature) అందుబాటులో ఉంది కాబట్టి మీరు కూడా యూస్ చేసుకోవచ్చు. 

ఈ కొత్త ఫీచర్ (Feature) ముఖ్యంగా వాట్సాప్ (Whatsapp) తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఒకవేళ మీరు వాట్సాప్ (Whatsapp) ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే, అదే సమయంలో మొబైల్ (Mobile) నెట్వర్క్ పరిధిలో లేకపోతే, అటువంటి సమయంలో మీ ఈమెయిల్ అడ్రస్ కు ఎస్ఎంఎస్ కోడ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మీరు టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పటికీ మీరు సులువుగా వాట్సాప్ (Whatsapp) లోకి లాగిన్ అవ్వచ్చు.

Tags :