Health: పొల్యూషన్ లో మార్నింగ్ వాక్ చేయొచ్చా?

Health: రోజు రోజుకి ఎక్కువైపోతున్న కాలుష్యం కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయి. మనం ఆరోగ్యంగా ఉండేందుకు చేస్తున్న వ్యాయామం (Exercise) కూడా మన ఆరోగ్యానికి (Health) ముప్పు తెచ్చి పెడుతోంది. కాలుష్యం (Pollution)లో వ్యాయామం (Exercise) ఆరోగ్యానికి (Health)  ముప్పు తెచ్చి పెడుతుందని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రతి పట్టణంలో కూడా కాలుష్యం లేని చోటు అంటూ లేదు. మరి అటువంటి ప్రదేశాలలో వ్యాయామం (Exercise) చేయడం నిజంగా ఆరోగ్యానికి (Health) హాని తలపెడుతుందని […]

Share:

Health: రోజు రోజుకి ఎక్కువైపోతున్న కాలుష్యం కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయి. మనం ఆరోగ్యంగా ఉండేందుకు చేస్తున్న వ్యాయామం (Exercise) కూడా మన ఆరోగ్యానికి (Health) ముప్పు తెచ్చి పెడుతోంది. కాలుష్యం (Pollution)లో వ్యాయామం (Exercise) ఆరోగ్యానికి (Health)  ముప్పు తెచ్చి పెడుతుందని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రతి పట్టణంలో కూడా కాలుష్యం లేని చోటు అంటూ లేదు. మరి అటువంటి ప్రదేశాలలో వ్యాయామం (Exercise) చేయడం నిజంగా ఆరోగ్యానికి (Health) హాని తలపెడుతుందని భావిస్తున్నారు.

కాలుష్యంలో వ్యాయామం శరీరానికి ముప్పే: 

ప్రపంచంలోని అనేక నగరాల్లో కాలుష్య స్థాయిలు పెరుగుతున్నందున, అటువంటి కలుషిత (Pollution) వాతావరణంలో వ్యాయామం (Exercise) చేయడం లేదా నడవడం వల్ల కలిగే సంభావ్య ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.

Read More: Animals: దీపావళి రోజు ఆ జంతువులను చూస్తే..

హానికరమైన వాయువులు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి: 

కలుషిత (Pollution) వాతావరణంలో వ్యాయామం (Exercise) చేయడం అంటే గాలిలో ఉండే హానికరమైన కణాలు మరియు కాలుష్య కారకాలను అధిక స్థాయిలో పీల్చడం. వాహనాల నుండి వెలువడే పొగ, ధూళి మరియు కాలుష్య కారకాలు వంటి ఈ కణాలు మన ఊపిరితిత్తుల (Lungs)లోకి లోతుగా చొచ్చుకుపోయి, వాపు, ఏదో శ్వాసకోశ వ్యవస్థకు హాని కలిగిస్తాయి. ఎక్కువ సమయం కాలుష్యంలో వ్యాయామం (Exercise) చేయడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, ఇప్పటికే ఉన్న శ్వాసకోశ పరిస్థితుల తీవ్రతరం చేయడం.. అంతేకాకుండా ముఖ్యంగా గుండెకు సంబంధ వ్యాధులకు కూడా దారితీయవచ్చు. 

ఊపిరితిత్తుల పనితీరు తగ్గుతుంది: 

కలుషితమైన (Pollution) గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ మరియు పర్టిక్యులేట్ మ్యాటర్ వంటి కాలుష్య కారకాలు అధికంగా ఉంటాయి, ఇవి ఊపిరితిత్తుల (Lungs) పనితీరుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. వ్యాయామం (Exercise) చేసేటప్పుడు లేదా నడిచేటప్పుడు కలుషితమైన (Pollution) గాలిని ఎక్కువ మొత్తంలో పీల్చుకోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గురక, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. మెల్లమెల్లగా, ఇది ఊపిరితిత్తుల (Lungs) పనితీరును తగ్గిస్తుంది. ఆస్తమా మరియు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. 

ఈ జాగ్రత్తలు తీసుకోండి: 

రోజురోజుకీ కాలుష్యం (Pollution) ఎక్కువైపోతున్న వేళ, ఇంట్లోనే ఎక్సర్సైజ్ (Exercise)  చేసుకోవడానికి నిపుణులు సూచిస్తున్నారు. మనకి అందుబాటులో ఉండే వాటితోనే ఎక్సర్సైజ్ (Exercise) చేసుకోవడం ఎంతో ఉత్తమంటున్నారు. మరి ముఖ్యంగా దగ్గరలో ఉండే జిమ్ కు వెళ్లి ఎక్ససైజ్ చేసుకోవడం మంచిదైనప్పటికీ, అక్కడ స్వచ్ఛమైన గాలి ఉన్నదా లేదా అనే దాని గురించి స్పష్టత తెలుసుకోండి. అయితే ఇప్పుడు పెరుగుతున్న ఢిల్లీ కాలుష్యం (Pollution) కారణంగా ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి సరైన ఆరోగ్య (health) జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

ఎక్కువ అవుతున్న కాలుష్యం: 

2023 సంవత్సరం ప్రపంచ చరిత్రలోనే అత్యధిక వేడి నమోదైన సంవత్సరంగా శాస్త్రవేత్తలు (scientists) గుర్తించారు. ముఖ్యంగా కాలాలు మారుతున్నప్పటికీ ఎడతెరపలేని ఎండ కారణంగా, ప్రపంచంలో అనేక ప్రాంతాలు ఎడారుల మారుతున్నాయి. దీనంతటికీ కారణం కేవలం గ్లోబల్ వార్మింగ్ (Global Warming). అంతేకాకుండా రాను రాను భూమి (Earth) మీద మనుగడ సాగించడం కూడా కష్టమే అంటూ వాతావరణాని (Climate)కి సంబంధించిన కొన్ని అంశాలను శాస్త్రవేత్తలు (scientists) వివరించడం జరిగింది. 

ఏది ఏమైనప్పటికీ అకాల వర్షాలు (Rain), అధిక వర్షాలు (Rain) ప్రస్తుత కాలంలో ఎక్కువ అయ్యాయని చెప్పుకోవాలి. దీనంతటికీ కారణం కేవలం పెరుగుతున్న కాలుష్యమే (Pollution) కారణం. అధిక వర్షాలు (Rain) వచ్చినప్పుడు, వరదలు (flood) ముప్పు పొంచి ఉన్నప్పుడు తీసుకునే జాగ్రత్తలు వర్షాలు (Rain) పడక ముందు కాలుష్యం (Pollution) తగ్గించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కాలుష్యం (Pollution) కారణంగా ఆరోగ్య (Health) సమస్యల రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ (Global Warming) కారణంగా, అధిక మొత్తంలో మంచు కరగడం వల్ల నీటిమట్టం అమాంతం పెరగడం వల్ల వర్షాలు (Rain) వచ్చే సమయానికి చాలా ప్రాంతాలలో వరదలు (flood) వచ్చి ముంచెత్తుతున్నాయి. 

ఇదిలా కొనసాగితే, భూమి (Earth)మీద నీటిమట్టం అధికం అవ్వడమే కాకుండా, త్వరలోనే మానవాళి నిర్మూల పరిస్థితి ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటినుంచే పలు జాగ్రత్తలు తీసుకుంటూ, కాలుష్య (Pollution) రహిత పదార్థాలను వాడడం వల్ల, నీటి కాలుష్యం (Pollution), వాయు కాలుష్యం (Pollution) ఇలా పలు రకాల కాలుష్యాలు తగ్గించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.

గ‌మ‌నిక‌: ఇది కేవ‌లం అవ‌గాహ‌న కోసం అందించిన స‌మాచారం మాత్ర‌మే. ఆరోగ్యం, ఆహారానికి సంబంధించిన నిర్ణ‌యాలు తీసుకునే ముందు వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.