Eyes: కళ్ళ కోసం ఆరోగ్యకరమైన ఆహారం

అవేంటో చూసేద్దాం రండి..

Courtesy: Twitter

Share:

Eyes: చలికాలం (Winter) మొదలైందంటే, మన కళ్ల (Eyes) గురించి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలని అర్థం. ముఖ్యంగా చలికాలం (Winter)లో పొడిబారిపోయే చర్మంతో పాటుగా కళ్ళు (Eyes) కూడా పొడిబారడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఈ విషయాలు మనల్ని కలవర పెడుతూ ఉంటాయి కదా. అయితే కళ్ళ (Eyes)కు సంబంధించి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని ఆహార (Food) విషయాలలో మరింత జాగ్రత్త తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఈ ఆహార (Food) పదార్థాలు తినడం వల్ల కంటికి ఎంతో మేలు అంటున్నారు నిపుణులు. 

కళ్ళ కోసం ఆరోగ్యకరమైన ఆహారం: 

క్యారెట్లు: క్యారెట్‌లో సహజంగానే బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది, ఇది విటమిన్ (Vitamin) ఎ ఎక్కువగా అందించే ఆహారం (Food), ఇది ఆరోగ్యకరమైన దృష్టిని, కంటి చూపు మెరుగుపరడానికి ప్రోత్సహిస్తుంది. 

పాలకూర: ఈ ఆకుకూరలో లుటిన్, జియాక్సంతిన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి హానికరమైన UV కిరణాల నుండి కళ్ళ (Eyes)ను రక్షించడంలో సహాయపడతాయి.

స్వీట్ పొటాటో: ఇవి క్యారెట్‌ల మాదిరిగానే బీటా-కెరోటిన్‌ను కలిగి ఉంటాయి మరియు మొత్తం కంటి ఆరోగ్యానికి గొప్పవి.

సాల్మన్ స్ చేప: సాల్మన్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వృద్ధులలో కంటి చూపు కోల్పోయే ప్రమాదాన్ని మరియు కళ్ళు (Eyes) పొడిబారడం ఇటువంటి అనేక సమస్యలను దూరం చేస్తుంది.

గుడ్లు: గుడ్లు కూడా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమైన లుటిన్ మరియు జియాక్సంతిన్‌లకు మంచి మూలం.

సిట్రస్ పండ్లు: నారింజ మరియు ద్రాక్షపండ్లు విటమిన్ (Vitamin) సిని అందిస్తాయి, ఇది కంటిశుక్లం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బాదం: ఈ గింజలు విటమిన్ (Vitamin) ఇని అందిస్తాయి, ఇది కంటిశుక్లం మరియు ఇతర కంటి పరిస్థితులను నివారించడంలో సహాయపడుతుంది.

బ్లూబెర్రీస్: యాంటీఆక్సిడెంట్లతో నిండిన బ్లూబెర్రీస్ కంటి అలసటను తగ్గించడానికి మరియు దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

బ్రోకలీ: విటమిన్ (Vitamin) సి, బీటా-కెరోటిన్ మరియు విటమిన్ (Vitamin) బి2 సమృద్ధిగా ఉన్న బ్రోకలీ కళ్లను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

డార్క్ చాక్లెట్: మితంగా, అధిక కోకో కంటెంట్ ఉన్న డార్క్ చాక్లెట్ రెటీనాకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, కంటి చూపు పనితీరును మెరుగుపరుస్తుంది. 

చలికాలంలో కంటిని కాపాడుకోండి: 

చలికాలం (Winter)లో చాలా మంది వెచ్చగా ఉండటానికి ఇంట్లోనే ఉంటూ వేడిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆరు బయట మంట వేసుకొని కూర్చుంటారు. ఈ క్రమంలోనే కళ్ళ (Eyes)కు తగిన తేమ లేకపోవడం వల్ల పొడిబారిపోతూ అసౌకర్యానికి గురవుతూ ఉంటాయి. పొడిబారిపోవడం వల్ల కళ్ల మంటలు, దురద వంటివి కామన్ గా వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండేందుకు ముఖ్యంగా.. దురద కారణంగా ఆస్తమాను కళ్ళ (Eyes)ల్లో చేతులు పెట్టుకోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం లేకపోలేదు.

ఎక్కువ శాతం నీళ్లు (Water) తాగడం అనేది చలికాలం (Winter)లో తక్కువగా జరిగే పని కదా. కానీ ముఖ్యంగా చలికాలం (Winter)లో మాత్రమే మనం ఎక్కువ నీళ్లు (Water) తాగాలని గుర్తుంచుకోవాలి. మన శరీరం హైడ్రేట్ అవ్వాలి, దానికోసం తగినన్ని నీళ్లు (Water) క్రమం తప్పకుండా తాగుతూ ఉండాలి. ఇలా తాగకపోవడం వల్ల కూడా మన శరీరంలో తేమశాతం తగ్గిపోయి, చర్మం పొడి బారడమే కాకుండా కళ్ళు (Eyes) కూడా పొడిబారి దురద పుడుతూ ఉంటుంది. అస్తమానం చేతులనేవి కళ్ళ (Eyes)ల్లో పెట్టుకోవడం వల్ల, లేనిపోని అంటు వ్యాధులు వస్తూ ఉంటాయి. తప్పకుండా మన కళ్ళ (Eyes)ను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే నీళ్లు (Water) క్రమం తప్పకుండా తాగాలి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది సిస్టం ముందు కూర్చుని గంటల తరబడి పని చేయడం ద్వారా పని ఒత్తిడి కారణంగా కళ్ళు (Eyes) స్ట్రెస్ అవుతున్నాయని కళ్ళ (Eyes)కు సంబంధించిన డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు. కళ్ళు (Eyes) మంటలు కారణంగా డ్రాప్స్ వాడటం కామన్. కానీ మనం ఒక్కసారి దాని ఎక్స్పైరీ డేట్ అనేది అయిపోయినప్పటికీ చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. కానీ కళ్ళ (Eyes) విషయంలో ఎలాంటి పొరపాటు చేయడం చాలా తప్పు. అందుకనే మనం ఎక్స్పైరీ డేట్ అయిపోయిన కళ్ళ (Eyes) డ్రాప్స్ వాడడం ద్వారా కూడా కళ్ళ (Eyes)కు హాని కలిగే అవకాశం ఉంటుంది.