Weight: బరువు తగ్గకపోవడానికి కార్టిసాల్ లెవెల్స్ కారణమా?

బరువు తగ్గడానికి చిట్కాలు..

Courtesy: Twitter

Share:

Weight: చాలామంది బరువు (Weight) తగ్గేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఎక్సర్సైజులు. తినే ఆహారంలో, అలవాట్లు ఇలా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బరువు (Weight) తగ్గడంలో విఫలమవుతుంటారు. అయితే దీనికి కారణం మన శరీరం (Body)లో విడుదలయ్యే కార్టిసాల్ (cortisol) లెవెల్స్ అని మీకు తెలుసా? అవునండి మన శరీరం (Body)లో కార్టిసాల్ (cortisol) లెవెల్స్ అధికంగా ఉన్నప్పుడు మన పొట్టలోని కొవ్వు (Fat) అధికంగా చేరుతుంది. దీనికి కారణంగా తనేకమైన అనారోగ్య సమస్యలు, గుండెకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఇలా ఎన్నో వాటిల్లుతూ ఉంటాయి. నిజానికి అధికంగా ఉండడానికి మన బరువు (Weight) పెరగడానికి అసలైన కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

దీనికి గల కారణాలు: 

కొవ్వు (Fat) నిల్వ: శరీరం (Body)లోని కొవ్వు (Fat) కణాలు ఎక్కువ కార్టిసాల్ (cortisol) లెవెల్స్ ను ఆకర్షించే విధంగా ఉంటాయి. అందువల్ల, కార్టిసాల్ (cortisol) ప్రభావం శరీరం (Body)లో మరెక్కడా లేని విధంగా పొట్టలో ఉండే కొవ్వు (Fat)లో చాలా ఎక్కువగా ఉంటుంది. 

పెరిగిన ఆకలి: అధిక కార్టిసాల్ (cortisol) స్థాయిలు నిద్రకు భంగం కలిగిస్తాయి. ఆకలిని నియంత్రించే హార్మోన్లను ప్రభావితం చేస్తాయి, తద్వారా మనం ఎక్కువగా ఆహారాన్ని తింటూ ఉంటాము. 

ఇన్సులిన్ నిరోధకత: పెరిగిన కార్టిసాల్ (cortisol) స్థాయిలు స్థిరంగా అధిక బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ పెరిగేందుకు దోహదపడతాయి, కొవ్వు (Fat) నిల్వను ప్రోత్సహిస్తాయి.. ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపిస్తాయి. 

కండరాల నష్టం: కార్టిసాల్ (cortisol) శక్తి కోసం కండరాల కణజాలాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, తద్వారా బేసల్ మెటబాలిక్ రేటును తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ రేటు తగ్గుదల బరువు (Weight) పెరగడానికి దారితీస్తుంది. 

ఇలా అనేక రకాల కారణాలవల్ల, మన శరీరం (Body)లో కార్టిసాల్ (cortisol) లెవెల్స్ పెరుగుదల కారణం వల్ల మన బరువు (Weight) తగ్గడంలో అంతరాయం కలుగుతుంది. 

వెయిట్ లాస్ కోసం మినీ మిల్స్ : 

రోజంతా మనం తీసుకునే మినీ మీల్స్ తరచుగా తినడం వల్ల, జీవక్రియ మందగించకుండా నిరోధిస్తుంది. ఆకలి (Hunger) బాధలను తగ్గిస్తుంది, మీ శరీరానికి సరైన ఎనర్జీ అనేది ఇస్తుంది. కొలెస్ట్రాల్ (Cholestral) మరియు ఇన్సులిన్ స్థాయిలపై సానుకూల ప్రభావం చూపుతుంది. పోషకాహార ప్రపంచంలో, మన శరీర బదువు (weight), కొవ్వు (Fat) తగ్గడానికి మీరు తీసుకునే దానికంటే ఎక్కువ కేలరీ (Calorie)లు బర్న్ చేయాలనేది మనందరికీ తెలిసిన వాస్తవం. కానీ ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే.. సరైన భోజనం ఫ్రీక్వెన్సీ ద్వారా. ప్రతి మూడు గంటలకు ఒకసారి సమయాన్ని పెట్టుకుని మినీ మీల్స్ అనేవి మనం తినడం ప్రారంభిస్తే, మన శరీర బదువు (weight) అదుపులో ఉండడం ఖాయం. కాబట్టి మినీ మీల్స్ (Mini Meals) అనేవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మూడు గంటలకి ఒకసారి ఒక రకమైన మినీ మీల్ అనేది తీసుకోవచ్చు.

మినీ మీల్స్:

1. 1 కప్పు సోయా పాలు.. బాదంతో పాటుగా.

2. 1 స్లైస్ హోల్ వీట్ బ్రెడ్‌తో చేసిన హాఫ్ శాండ్‌విచ్, అందులో తురిమిన చికెన్, దోసకాయ, టొమాటోతో చట్నీ లేదా పనీర్.

3. ఏదైనా మంచి సలాడ్‌తో 1 బౌల్ మూంగ్ మొలకలు.

3. 1:1 నిష్పత్తిలో చనాతో కొన్ని వేరుశెనగలు(ఉడికించినవి).

4. మీ రోటీలకు బదులుగా గోధుమ రవ్వ రోటీలు చేసుకోండి. రోటీల సంఖ్యను మీరు రెగ్యులర్ గా తీసుకునే సగానికి తగ్గించండి.

5. 2 గుడ్లలోని తెల్లసొన ఆమ్లెట్ వేసుకోవడం. లేదా ఒక ఫుల్ ఎగ్ ఆమ్లెట్‌తో 1 టోస్ట్ చేసుకోవచ్చు.

6. ఒక పండు ఒక ఆపిల్, నారింజ, స్వీట్ లైమ్, 20 చెర్రీస్. లేదా 1 గిన్నె పుచ్చకాయ.

7. సలాడ్‌తో పాటుగా ఒక గిన్నె పప్పు లేదా పెరుగు. 

ఇవన్నీ కూడా ఏడురకాల మినీ మీల్స్ (Mini Meals). మూడు గంటల వ్యవధి సమయం పెట్టుకుని, ఒక రకమైన మినీ మీల్ ఆస్వాదిస్తూ, మీ బదువు (weight)ని అదుపులో ఉంచుకోవచ్చు.

 

గ‌మ‌నిక‌: ఇది కేవ‌లం అవ‌గాహ‌న కోసం అందించిన స‌మాచారం మాత్ర‌మే. ఆరోగ్యం, ఆహారానికి సంబంధించిన నిర్ణ‌యాలు తీసుకునే ముందు వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.