Seeds: రోగనిరోధకశక్తిని పెంచే గింజలు

ఎన్నో ప్రయోజనాలు..

Courtesy: Twitter

Share:

Seeds: గింజలు (Seeds) చిన్నగా కనిపించినప్పటికీ, అవి పోషకాలలో మాత్రం చాలా సమృద్ధిగా ఉంటాయి. ఎంతో కాలంగా, ఆరోగ్యపరంగా ఎంతో మంది మెప్పు పొందింది గింజలు (Seeds). గింజలు (Seeds) శతాబ్దాలుగా వాటి ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రచారం చేయబడ్డాయి. గింజలలోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి, బలమైన ఎముకల ఆరోగ్యం (Health) కోసం మరియు రక్తంలో షుగర్ మేనేజ్మెంట్ చేయడానికి కూడా గింజలు (Seeds) ఎంతగానో సహాయపడతాయి. అయితే ఇందులో ఎన్నో రకాల గింజలు (Seeds) ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందామా..

సబ్జా గింజల ఆరోగ్య ప్రయోజనాలు:

సబ్జా (Chia) గింజలు (Seeds) సాల్వియా హిస్పానికా ఎల్ అనే మొక్క నుండి వచ్చిన చిన్న నలుపు, తెలుపు రంగులో ఉండే విత్తనాలు. అవి మధ్య అమెరికాకు చెందినవని నమ్ముతారు. అజ్టెక్ మరియు మాయన్ నాగరికతలు తమ ఆహారంలో, అలాగే ఔషధ ప్రయోజనాల కోసం, రోగనిరోధకశక్తి (immunity) పెంపొందించుకోవడం కోసం మతపరమైన ఆచారాలు మరియు సౌందర్య సాధనాల కోసం సబ్జా (Chia) గింజలను ఉపయోగించారు. నేడు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సబ్జా (Chia) గింజల కారణంగా ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. సబ్జా (Chia) గింజలల్లో ఉండే ఫైబర్ మరియు ప్రొటీన్ బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తాయి. ఒక ఔన్స్ (28 గ్రాములు) చియా గింజల్లో దాదాపు 10 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది. 35% ఫైబర్ ఉన్నందువల్ల ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

గుమ్మడికాయ గింజలు:

వాటి రుచికరమైన క్రంచ్కు మించి, విత్తనాలు సంతానోత్పత్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. జింక్ మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.. జీవశక్తిని ప్రోత్సహిస్తాయి. గింజలు (Seeds), విత్తనాలను ఎక్కువగా తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇవి బరువు తగ్గించడం, మధుమేహం మరియు గుండె జబ్బులతో పాటు మినరల్స్, ప్రొటీన్లు, మంచి కొవ్వు (Good Fat)లు, ఫైబర్ మరియు మరిన్నింటిని మన ఆరోగ్యకరమైన శరీరానికి అందిస్తాయి. బాదం, వాల్నట్లు, పెకాన్లు, హాజెల్నట్లు, మకాడమియా గింజలు (Seeds) మరియు గుమ్మడికాయ (Sunflower), జనపనార, చియా మరియు నువ్వుల (Black sesame seeds) అన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

నల్ల నువ్వులు: నువ్వుల (Black sesame seeds) గింజలతో వృద్ధాప్యాన్ని అడ్డుకోండి. మెలనిన్-బూస్టింగ్ ప్రాపర్టీస్లో పుష్కలంగా ఉంటాయి, ఇవి మెరిసే జుట్టుకు దోహదం చేస్తాయి. మరి ముఖ్యంగా శరీరంలో బ్లడ్ లెవెల్స్ పెంచడానికి కూడా దోహదపడతాయి.

అవిసె గింజలు (Seeds): హార్మోన్ల పనితీరు కోసం అవిస గింజలు (Seeds) అవలీలగా పనిచేస్తాయి. అవిసె (Flax) గింజలు (Seeds) మీ అంతర్గత పర్యావరణ వ్యవస్థను సమతుల్యం చేయడమే కాకుండా శక్తివంతమైన చర్మ ఆరోగ్యానికి దోహదపడడమే కాకుండా, రోగనిరోధకశక్తి (immunity)ని పెంచుతాది.

జనపనార గింజలు (Seeds): సహజంగా యాంటీ ఏజింగ్కోసం చూస్తున్నట్లయితే జనపనార గింజలు (Seeds) చాలా బాగా పనిచేస్తాయి. గామా-లినోలెనిక్ యాసిడ్ముఖ్యంగా అందించే జనపనార గింజలు (Seeds) మీ చర్మాన్ని పోషించి.. చక్కని చాయను అందిస్తాయి. మరి ముఖ్యంగా సగటు మనిషికి రోగనిరోధకశక్తి (immunity)ని అందించి బలాన్ని చేకూరుస్తాయి.

నిగెల్లా గింజలు (Seeds): యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిగెల్లా గింజలు (Seeds) సంరక్షకులుగా నిలుస్తాయి, మీ శరీరం రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయం చేసి ఆరోగ్యంగా (Health) ఉంచుతాది.

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా (Health) ఉండేందుకు చక్కని ఆహారం తీసుకోవడమే కాకుండా, ఇటువంటి గింజలను అల్పాహారం సమయంలో గాని సాయంత్రం సమయంలో గానీ తీసుకున్నట్లయితే చక్కని రోగనిరోధకశక్తి (immunity)ని అందించడంలో దోహదపడతాయి. అందుకే ఇటువంటి గింజలను, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి రోజువారి ఆహారంలో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం.