Winter: చలికాలంలో గుండెను మరింత శ్రద్ధగా చూసుకోవాలట

గుండె ఆరోగ్యం జాగ్రత్త

Courtesy: Twitter

Share:

Winter: చలికాలం (Winter) చాలామందికి ఆహ్లాదకరంగా ఉంటుంది. చలికాలం (Winter)లో చిల్ అవుతూ ఆరోగ్యాన్ని పక్కన పెడితే మాత్రం ముప్పే అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చలికాలం (Winter)లో గుండె ఆరోగ్యం (Health) గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. మరోపక్క చలికాలం (Winter) కారణంగా మనిషి మరింత డిప్రెషన్ లోకి వెళ్లిపోయే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు మరి కొంతమంది. మరి చలికాలం (Winter) మన గుండె (Heart) ఆరోగ్యానికి హానికరంగా ఎలా మారుతుంది! అదే విధంగా డిప్రెషన్కి ఎలా కారణం అవుతుంది అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. 

గుండెను మరింత శ్రద్ధగా చూసుకోవాలట: 

చలికాలం (Winter)లో ఎక్కువగా బయటికి వెళ్లడం మంచిది కాదట ముఖ్యంగా వయసులో పెద్దవాళ్లు ఆరోగ్యం (Health)గా ఉండేందుకు, గుండె (Heart)ను మరింత పదిలంగా ఉంచుకునేందుకు చలిలోకి వెళ్లకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే చలికాలం (Winter)లో చలి కారణంగా మరి ముఖ్యంగా మన శరీరంలో ఉండే బ్లడ్ వెజల్స్ అనేవి నేరోగా అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి కారణంగా బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ ప్రవహించడానికి ఒత్తిడికి గురవుతుంది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ మరింత ఎక్కువయ్యి చివరిగా మన గుండె (Heart)కు ముప్పు కలిగిస్తుంది. అందుకే శీతాకాలం (Winter)లో గుండె (Heart)కు సంబంధించిన ఆరోగ్యం (Health) ఎంతో తీసుకోవాలంటున్నారు నిపుణులు. 

బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోండి: 

శీతాకాలం (Winter)లో ముఖ్యంగా ఎప్పటికప్పుడు మన బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటూ ఉండాలి శీతాకాలం (Winter) గడిచే నెలలు అన్నీ కూడా మనలోని బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినట్లయితే డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం. లేదంటే గుండె (Heart)కు హాని కలిగే అవకాశం ఉంటుంది. 

వెచ్చగా ఉండండి: 

శీతాకాలం (Winter)లో చాలామంది బయటకు వెళ్లి ఆహ్లాదంగా గడిపేందుకు మాకు చూపిస్తూ ఉంటారు అయితే ఇదే సమయంలో మన ఆరోగ్యం (Health) కూడా ఎంతో ముఖ్యమని గుర్తుంచుకోండి. ముఖ్యంగా వేడిగా, వెచ్చగా ఉండేందుకు స్వెటర్లు ధరించండి, అదేవిధంగా షూ వేసుకోండి, చేతులకు గ్లౌజెస్ వేసుకోండి ఇలా చలికాలం (Winter)లో వెచ్చగా ఉండటం వల్ల మన గుండె (Heart)కు సంబంధించిన రిస్క్ తగ్గుతుంది. 

ఇంట్లో ఉండేందుకు ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి, ఎప్పటికప్పుడు వాటర్ తాగుతూ ఉండండి, ఒత్తిడిని తగ్గించుకోవడం ప్రయత్నించండి. ఇవన్నీ ప్రయత్నాలు కూడా మన గుండె (Heart) ఆరోగ్యానికి శీతాకాలం (Winter)లో ఎంతో తోహదపడతాయి.

శీతాకాలంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందట: 

శీతాకాలం (Winter)లో చలి మాత్రమే ఎక్కువగా ఉంటుంది అనుకుంటాము, కానీ కొత్తగా చేసిన అధ్యయనాల ప్రకారం, శీతాకాలం (Winter)లో చాలామంది డిప్రెషన్ (Depression) లోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని దీనికోసం ప్రత్యేకమైన ఆహారం తీసుకోవడం వల్ల అటువంటి రిస్క్ నుంచి బయటపడవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలం (Winter)లో ఎక్కువగా చాలామందికి చెడు ఆలోచనలు కారణంగా, ఎక్కువగా ఆలోచించే ధోరణి కారణంగా డిప్రెషన్ (Depression) లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. 

సూపర్‌ఫుడ్‌ (Superfood)లు పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు, ఇవి ముఖ్యమైన ఆరోగ్య (Health) ప్రయోజనాలు కలిగి ఉన్నాయని నమ్ముతారు. ఇందులో సాధారణంగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. సూపర్‌ఫుడ్‌ (Superfood)ల ఉదాహరణలు బెర్రీలు, ఆకు కూరలు, కొవ్వు చేపలు, గింజలు, కొన్ని రకాల బీన్స్. ఈ మెరుగైన ఆరోగ్యం (Health) కోసం, డిప్రెషన్ (Depression), బాధ ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు మీ ఆహారంలో చేర్చుకోగల సూపర్‌ఫుడ్‌ (Superfood) గురించి తెలుసుకోగలగాలి.

1. పాలకూర: 

ఇందులో ముఖ్యంగా మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది, పాలకూరను సలాడ్‌లలో పచ్చిగా తినచ్చు.. లేదా సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD)ని ఎదుర్కోవడానికి సూప్‌లలో కలిపి కుక్ చేసుకుని తినొచ్చు.

2. సాల్మన్: 

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి, బాగా కుక్ చేసిన సాల్మన్‌ను తినడం వల్ల మానసిక స్థితిని పెంచడానికి, SAD లక్షణాలతో పోరాడటానికి సహాయపడుతుంది.

3. చిలగడదుంపలు: 

విటమిన్ ఎ మరియు ఫైబర్‌ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. చలికాలం (Winter)లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి చిలగడదుంపలను కాల్చుకుని, గుజ్జు లేదా సూప్‌లుగా తయారు చేయచ్చు.