Pollution: కాలుష్యంతో చర్మానికి ముప్పు తప్పదా!

Pollution: ఢిల్లీ (New Delhi)లో రోజురోజుకీ కాలుష్యం అధికంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ (New Delhi) కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్యలు  (Problem) వాటిల్లుతాయి అంటూ కొన్ని విషయాలు పాటించవలసిందిగా కోరుతుంది ప్రభుత్వం. మరోవైపు ఇప్పటికే పాఠశాలలకు (School) సెలవులు ప్రకటించింది ఢిల్లీ (New Delhi). కాలుష్యం (Pollution) తారస్థాయికి చేరడంతో శ్వాసకోశ  (Respiratory) సమస్యలు  (Problem) ఎదురవుతాయి అంటూ నిపుణులు సూచిస్తున్నారు. పలు జాగ్రత్తలు తీసుకోక తప్పదు అంటూ ఢిల్లీ (New Delhi) ప్రభుత్వం […]

Share:

Pollution: ఢిల్లీ (New Delhi)లో రోజురోజుకీ కాలుష్యం అధికంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ (New Delhi) కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్యలు  (Problem) వాటిల్లుతాయి అంటూ కొన్ని విషయాలు పాటించవలసిందిగా కోరుతుంది ప్రభుత్వం. మరోవైపు ఇప్పటికే పాఠశాలలకు (School) సెలవులు ప్రకటించింది ఢిల్లీ (New Delhi). కాలుష్యం (Pollution) తారస్థాయికి చేరడంతో శ్వాసకోశ  (Respiratory) సమస్యలు  (Problem) ఎదురవుతాయి అంటూ నిపుణులు సూచిస్తున్నారు. పలు జాగ్రత్తలు తీసుకోక తప్పదు అంటూ ఢిల్లీ (New Delhi) ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. మరి ముఖ్యంగా చర్మవ్యాధులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 

కాలుష్యంతో జాగ్రత్త: 

ఢిల్లీ (Delhi)లోని ప్రజలు కాలుష్యానికి అతలాకుతలమైపోతున్నారు. ఎక్కడికి వెళ్లాలన్న ఏం చేయాలన్నా కాలుష్యం ((Pollution) వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే స్కూల్లకు, పలు కార్యాలయాలకు సెలవులు ప్రకటించగా.. పెరుగుతున్న కాలుష్యం ((Pollution) కారణంగా చాలామందికి చర్మవ్యాధులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి సమయంలో బయటికి వెళ్ళకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. 

స్కిన్ ఇరిటేషన్: 

కాలుష్యం ((Pollution) కారణంగా..చర్మం (Skin) మీద దురద పుట్టడం, ఎర్రగా మారడం, వాపుకు కారణమవుతుంది. గాలిలోని కణాలు మరియు రసాయనాలకు చర్మం (Skin) మీద ఉండే రంధ్రాలను మూసుకుపోతాయి. మొటిమలు మరియు ఇతర చర్మ పరిస్థితులకు దారితీస్తాయి. 

చర్మ పరిస్థితుల తీవ్రతరం: 

ఎగ్జిమా లేదా సోరియాసిస్ వంటివి ఉన్న వ్యక్తులు వాయు కాలుష్యం ((Pollution) కారణంగా అధ్వాన్నమైన లక్షణాలను అనుభవించవచ్చు. ఇది చర్మం (Skin)పై దురద మరియు ఎర్రబడటానికి దారితీస్తుంది. ఈ ముందుగా ఉన్న చర్మ పరిస్థితులను తీవ్రతరంగా మార్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు జాగ్రత్తలు పాటించక తప్పదు. 

చర్మం (Skin) మీద మచ్చలు:

కాలుష్య కారకాలకు గురికావడం వల్ల చర్మం (Skin)పై నల్లటి మచ్చలు మరియు రంగు మారుతాయి. కొన్ని కొన్ని సందర్భాలలో చర్మం (Skin) మీద తామర లాంటి మచ్చలు ఏర్పడతాయి.

పొడి బారడం: 

వాయు కాలుష్యం ((Pollution) చర్మం (Skin)లోని సహజ నూనెలను తొలగిస్తుంది, చర్మం (Skin) పొడిగా మరి చికాకుగా అనిపిస్తుంది. దీంతో చర్మం (Skin) నిర్జీవంగా కనిపిస్తుంది.

బలహీనమైన చర్మం: 

పెరుగుతున్న కాలుష్యం ((Pollution) కారణంగా చర్మం (Skin) కొన్ని సహజ గుణాలను కోల్పోవడం జరుగుతుంది. దీనికి కారణంగా చర్మం (Skin) బలహీనంగా, సెన్సిటివ్గా మారడం వల్ల, చర్మవ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతాయి. 

ఆరోగ్యం జాగ్రత్త: 

కలుషిత (Pollution) వాతావరణంలో వ్యాయామం (Exercise) చేయడం అంటే గాలిలో ఉండే హానికరమైన కణాలు మరియు కాలుష్య (Pollution) కారకాలను అధిక స్థాయిలో పీల్చడం. వాహనాల నుండి వెలువడే పొగ, ధూళి మరియు కాలుష్య (Pollution) కారకాలు వంటి ఈ కణాలు మన ఊపిరితిత్తుల (Lungs)లోకి లోతుగా చొచ్చుకుపోయి, వాపు, ఏదో శ్వాసకోశ వ్యవస్థకు హాని కలిగిస్తాయి. ఎక్కువ సమయం కాలుష్యం ((Pollution)లో వ్యాయామం (Exercise) చేయడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, ఇప్పటికే ఉన్న శ్వాసకోశ పరిస్థితుల తీవ్రతరం చేయడం.. అంతేకాకుండా ముఖ్యంగా గుండెకు సంబంధ వ్యాధులకు కూడా దారితీయవచ్చు. 

కలుషితమైన (Pollution) గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ మరియు పర్టిక్యులేట్ మ్యాటర్ వంటి కాలుష్య కారకాలు అధికంగా ఉంటాయి, ఇవి ఊపిరితిత్తుల (Lungs) పనితీరుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. వ్యాయామం (Exercise) చేసేటప్పుడు లేదా నడిచేటప్పుడు కలుషితమైన (Pollution) గాలిని ఎక్కువ మొత్తంలో పీల్చుకోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గురక, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. మెల్లమెల్లగా, ఇది ఊపిరితిత్తుల (Lungs) పనితీరును తగ్గిస్తుంది. ఆస్తమా మరియు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. 

రోజురోజుకీ కాలుష్యం (Pollution) ఎక్కువైపోతున్న వేళ, ఇంట్లోనే ఎక్సర్సైజ్ (Exercise)  చేసుకోవడానికి నిపుణులు సూచిస్తున్నారు. మనకి అందుబాటులో ఉండే వాటితోనే ఎక్సర్సైజ్ (Exercise) చేసుకోవడం ఎంతో ఉత్తమంటున్నారు. మరి ముఖ్యంగా దగ్గరలో ఉండే జిమ్ కు వెళ్లి ఎక్ససైజ్ చేసుకోవడం మంచిదైనప్పటికీ, అక్కడ స్వచ్ఛమైన గాలి ఉన్నదా లేదా అనే దాని గురించి స్పష్టత తెలుసుకోండి. అయితే ఇప్పుడు పెరుగుతున్న ఢిల్లీ (Delhi) కాలుష్యం (Pollution) కారణంగా ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి సరైన ఆరోగ్య (health) జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.