Cancer: పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

కారణాలు ఇవే..

Courtesy: Twitter

Share:

Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ (Cancer) బారిన పడి చనిపోతున్న వ్యక్తులు అధికంగా మారుతున్నట్లు బిఎంజె కోనకాలజీ సర్వే (Survey) ప్రకారం తెలుస్తోంది. గత 30 సంవత్సరాలలో అధికంగా 79% క్యాన్సర్ (Cancer) కేసులు పెరిగినట్లు, అందులో ముఖ్యంగా 50 ఏళ్లు కన్నా తక్కువ వయసు ఉన్న వారే అధికంగా ఉన్నట్లు వెళ్లడైంది. క్యాన్సర్ (Cancer) బారినపడి చనిపోయిన వ్యక్తులకు బంధించి చేసిన అధ్యయనాలు ప్రకారం ముఖ్యంగా క్యాన్సర్ (Cancer) భారీనా పడడానికి గల కారణం పొల్యూషన్ కూడా కావచ్చు అంటున్నారు నిపుణులు.

క్యాన్సర్ బారినపడుతున్న వారు అధికం:

30 సంవత్సరాల లో అధికంగా 79% క్యాన్సర్ (Cancer) కేసులు పెరగడం కలవరం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో క్యాన్సర్ (Cancer) బాధితులు ఎక్కువగా మారుతున్నారు. ముఖ్యంగా శ్వాసనాళం మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ (Cancer) కేసులు అధికంగా మారాయి. అంతేకాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ (Cancer), లంగ్ క్యాన్సర్ (Cancer), బౌల్, స్టొమక్ క్యాన్సర్ (Cancer)లతో బాధపడుతూ చనిపోయిన వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సర్వే (Survey) ప్రకారం తెలుస్తోంది.

1990 తర్వాత నుంచి క్యాన్సర్ (Cancer) బారినపడుతున్న వారి సంఖ్య అధికమైనట్లు సర్వే (Survey) ప్రకటించింది. ముఖ్యంగా ఇందులో 30 నుంచి 40 సంవత్సరాల ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా 2030 నాటికల్లా క్యాన్సర్ (Cancer) బారినపడే వారి సంఖ్య మరింత పెరగొచ్చు అంటూ, పొంచి ఉన్న రిస్క్ గురించి ప్రకటించింది సర్వే (Survey).

ఇన్ని రకాల క్యాన్సర్ ?:

ప్రపంచవ్యాప్తంగా సుమారు 204 దేశాలలోగాను 29 రకాల క్యాన్సర్ (Cancer)లు గుర్తించినట్లు సర్వే (Survey) ప్రకారం తెలిసింది. అయితే సర్వే (Survey) నిర్వహించిన గణాంకాల ప్రకారం 14 నుంచి 49 మధ్య ఉన్న వాయిస్కులలో క్యాన్సర్ (Cancer) లక్షణాలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. కేవలం 2019లోనే 50 కన్నా తక్కువ వయస్సున్న వాళ్లు సుమారు 11 లక్షల మందికి క్యాన్సర్ (Cancer) సోకినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ (Cancer) బారిన పడి ప్రపంచంలో ఇప్పటివరకు అనేకమంది చనిపోయినట్లు కూడా వెళ్లడైంది. లక్ష మందిలో సుమారు 3.5 మందుకి బ్రెస్ట్ క్యాన్సర్ (Cancer) వస్తున్నట్లు సర్వే (Survey)లో బయటపడింది.

ఊపిరితిత్తులకు సంబంధించి, పొట్ట క్యాన్సర్ (Cancer), బౌల్ క్యాన్సర్ (Cancer) వంటివి అధికంగా మారుతున్న వేళ, లివర్ క్యాన్సర్ (Cancer) బారినపడుతున్న వారి సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. సుమారు ప్రతి సంవత్సరం 2.88 శాతం తగ్గుతున్నట్లు వెళ్లడైంది.

క్యాన్సర్ కి గల ముఖ్య కారణాలు ఇవే:

రోగనిర్ధారణ సులభం అవడం:

అయితే ఇటీవల కాలంలో క్యాన్సర్ (Cancer) కేసులు ఎక్కువగా కనిపించడానికి రోగనిర్ధారణ ప్రక్రియ సులభం అవడం కూడా ఒక కారణం అవ్వచ్చు. ఒకప్పుడు క్యాన్సర్ (Cancer) నిర్ధారణకి చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న క్యాన్సర్ (Cancer) కనిపెట్టడానికి కూడా టూల్స్ వచ్చేసాయి.

వ్యసనం:

ధూమపానం (Smoking) మరియు మద్యపానం అనేది తల, మెడ, జీర్ణశయాంతర మరియు మూత్రపిండ/మూత్రాశయ క్యాన్సర్ (Cancer)లు మొదలైన అనేక రకాల క్యాన్సర్ (Cancer)‌లకు దారితీసే ప్రధాన కారణాలు. పట్టణ యువత (Youth)లో సిగరెట్ వాడకం బాగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాలు విశ్రాంతి కోసం కూడా హుక్కా,బీడీని ఉపయోగించడం కొనసాగిస్తున్నాయి, దీని వలన క్యాన్సర్ (Cancer) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అర్బనైజేషన్:

ఆలస్య వివాహాలు, గర్భం దాల్చే వయస్సు, ఊబకాయం, అధిక మద్యపానం లేదా స్త్రీలు ధూమపానం (Smoking) చేయడం, జీవనశైలిలో మార్కులు కారణంగా, పట్టణ స్త్రీలలో రొమ్ము, అండాశయ క్యాన్సర్ (Cancer) సంభవం పెరగడానికి కారణమయ్యాయి. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం కారణంగా పెద్దప్రేగు క్యాన్సర్ (Cancer)‌కు కారణమవుతుంది. పద్ధతికి అడ్డుకట్ట వేయాలి.

కాలుష్యం:

ప్రతి సంవత్సరం అధిక స్థాయి కాలుష్యం (pollution), అధ్వాన్నంగా మారుతున్న AQI, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో అధికంగా ఉండే కాలుష్యం (pollution) ఆరోగ్యానికి హానికరం. అందువల్ల ధూమపానం (Smoking) చేయని వారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ (Cancer)‌లను అభివృద్ధి చేసే కేసులు చాలా రెట్లు పెరిగాయి. బయటకు వెళ్లేటప్పుడు N95 ఫిల్టర్ మాస్క్లను ఉపయోగించడం మంచిది.