Brave: ధైర్యంతో ఉండేందుకు ఇలా చేయండి..

చక్కని చిట్కాలు మీకోసమే

Courtesy: Pexels

Share:

Brave: ఎన్ని అవకాశాలు వచ్చినా ఎంత పెద్ద అదృష్టం మనకి ఎదురుపడినప్పటికీ మనోధైర్యం (Brave)తో ముందుకు వెళితే మన మీద మనకి ఉన్న నమ్మకంతో ముందుకు వెళితే ఏదైనా సాధించొచ్చు. ఒకవేళ మనోధైర్యమే లేకపోతే చిన్న మెట్టు ఎక్కడానికి కూడా మనకి కష్టంగా మారుతుంది. అందుకే ఈరోజు మనోధైర్యం (Brave)తో ఉండేందుకు ఏం చేయాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఎలా ఉండాలి అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం.. 

 

మనో ధైర్యంతో ఉండేందుకు ఇలా చేయండి..: 

 

ఆలోచన:

మనం ఒక పని చేస్తున్నాము అంటే.. ముందుగా వాటి నుంచి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాము.. ఏదైనా జరగొచ్చు అనే ఉద్దేశంతో ఆలోచిస్తాము. కానీ.. ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటికి సొల్యూషన్స్ మన దగ్గరే ఉంటాయి అని ఆలోచించి ముందుకు సాగాలి. అది మన సంతోషకరమైన జీవితానికి పునాది.

 

బాధ్యత:

ప్రతి ఒక్కరి జీవితం (Life)లో ఆటుపోట్లు అనేవి సహజం, సమస్యలు అనేవి సర్వసాధారణం. కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే.. మనం ధైర్యం (Brave)గా నిజాయితీగా నిలబడాలి. ఆ సమస్య మన వల్ల ఏర్పడితే.. మనం నిజాయితీగా ఒప్పుకొని దానికి చక్కని పరిష్కారం మనమే ఆలోచించాలి. పరిష్కారం లేని సమస్య ఉండదు అని తెలుసుకోవాలి. మనం చేయగలిగిన పని మనం 100% బాధ్యతగా చేసుకోవాలి.


 

సంతోషమే సగం బలం:

జీవితం (Life)లో ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనలు కూడా మనకి సంతోషాన్ని ఇస్తాయి. అలాంటి వాటిని మనం చిన్నచూపు చూడకూడదు. ప్రతి ఒక్క సందర్భాన్ని సంతోషం (Happy)గా గడపడానికి చూడాలి. ప్రతి సమయాన్ని ఆనందంగా మార్చడానికి చూసుకోవాలి.

 

గతం గతః:

గడిచిన కాలంలో మనకు ఎదురైన సమస్యలను గుర్తుచేసుకుంటూ రాబోయే కాలం గురించి మర్చిపోకూడదు. రాబోయే కాలం గురించి మనం చక్కగా ప్లాన్ చేసుకోవాలి. ఒక గమ్యాన్ని ఏర్పరచుకొని.. దాని గురించే పాటుపడాలి. గతాన్ని గుర్తు చేసుకుంటూ.. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది.

 

శ్రద్ధ:

ఎప్పుడూ మనం చేస్తున్న పనుల్లో శ్రద్ధ వహించాలి. పూర్తిగా ఆ పనికి సంబంధించి.. చేయవలసిన ప్రయత్నాలు అన్ని మనం చేయాలి. లేదంటే మనం చేయబోయే పనికి కావలసిన స్టిల్స్.. మనం ముందుగానే డెవలప్ చేసుకోవాలి, అలా మనం చేయవలసిన పని లో ఒత్తిడి లేకుండా పూర్తిచేయగలుగుతారు.

 

పెట్టుబడి:

దేనిమీదైనా పెట్టుబడి పెడుతున్నాము అంటే.. లాభం వస్తుందని ఆశతో నే కదా. కాబట్టి పెట్టుబడి అనేది డబ్బు కు సంబంధించినది మాత్రమే కాదు మన ఆరోగ్యానికి సంబంధించినది కూడా. మనం ఆరోగ్యం (Health)గా ఉంటేనే ఏదైనా చేయగలము అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి.. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి.. ఆరోగ్యం (Health) లో పెట్టవలసిన పెట్టుబడి పెట్టాలి. దాని ద్వారా మనకి ప్రశాంతత అనేది లభిస్తుంది. ఒక వయసు వచ్చిన మనకి.. ఎటువంటి సమస్య వచ్చినా బెంగ ఉండదు. కాబట్టి పెట్టుబడి అనేది.. మన జీవితం (Life)లో ముఖ్య భాగం అని చెప్పవచ్చు.. అది డబ్బు విషయంలో కావచ్చు.. ఆరోగ్య విషయంలో కావచ్చు..

 

బంధాలు:

ప్రతి ఒక్కరి జీవితం (Life) బంధాలతో ముడిపడి ఉంటుంది. కానీ ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు అనే ఆప్షన్ మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఎవరితో ఎంత బాగా ఉంటే.. ఎంత లాభం వస్తుంది.. అనే ఆలోచనలతో బంధాలు ముడిపడి ఉంటున్నాయి అని చెప్పుకోవచ్చు. కానీ నిజమైన బంధాలు మనకి సంతోషాన్ని ఇస్తాయి.. జీవితం (Life)లో మనల్ని ఎత్తుకు తీసుకుని వెళ్లే విధంగా ఉండాలి. బంధాలు అనేవి మన బలం గా మారాలి.. మనలో ఉత్సాహాన్ని నింపేలా ఉండాలి. కాబట్టి సంతోషకరమైన బంధాలను ఏర్పరచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది.

 

క్షమాపణ.. మార్పు:

మన బాధ లోని.. సంతోషం (Happy) లోని.. ఆవేశం లోని.. కోపం లోని నిర్ణయాలు తీసుకోకూడదు అంటారు. ఎక్కువమంది నిర్ణయాలు.. ఇలాంటి సందర్భంలోనే తీసుకుంటూ ఉంటారు. కానీ తరవాత ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ.. ముఖ్యమైన సందర్భాలలో మనం నిర్ణయాలు తీసుకోకూడదు. కోపం లో ఉన్నప్పుడు.. ఆవేశంలో ఉన్నప్పుడు.. మనం ఆలోచించాలి. మనలో క్షమాపణ గుణం ఉండాలి. ఆవేశం, కోపం మనకు బాధ నే మిగులుస్తుంది. క్షమాపణ అనే ఆలోచన మనకి ఆనందాన్ని అందిస్తుంది.