World Cup 2023: హార్ధిక్‌పాండ్యకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ నెటిజన్లు..

ఎందుకో తెలుసా..?

Courtesy: Twitter

Share:

World Cup 2023: టీమ్ఇండియా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో(World Cup 2023) ఫైన‌ల్ కు దూసుకువెళ్లింది. భార‌త జ‌ట్టు(Team India) ఫైన‌ల్‌కు(Final) చేర‌డంలో స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ(Mohammed Shami) కీల‌క పాత్ర పోషించాడు. కివీస్‌తో జ‌రిగిన సెమీ పైన‌ల్ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసి న్యూజిలాండ్(New Zealand) ప‌త‌నాన్ని శాసించాడు. ఈ క్ర‌మంలో హార్ధిక్ పాండ్య‌కు (Hardik Pandya) నెటిజన్లు ధ‌న్య‌వాదాలు చెబుతున్నారు. అదేంటీ..? ష‌మీ వికెట్లు తీసి గెలిపిస్తే.. పాండ్య‌కు ఎందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు అనేగా మీ డౌట్.. అక్క‌డికే వ‌స్తున్నాం ఆగండి. 

ఈ మెగాటోర్నీ ఆరంభంలో టీమ్ఇండియా(Team India) ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ మ‌హ్మ‌ద్ ష‌మీకి(Mohammed Shami) చోటు ద‌క్క‌ని సంగ‌తి తెలిసిందే. ఎప్పుడైతే హార్ధిక్ పాండ్య(Hardik Pandya)  గాయంతో జ‌ట్టుకు దూరం అయ్యాడో ష‌మీకి జ‌ట్టులో చోటు ద‌క్కింది. త‌న‌కు అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ష‌మీ రెండు చేతులా ఒడిసి ప‌ట్టుకున్నాడు. ఈ ప్ర‌పంచక‌ప్‌లో తాను ఆడిన మొద‌టి మ్యాచులోనూ న్యూజిలాండ్(New Zealand) పై ఐదు వికెట్లు తీసి స‌త్తా చాటాడు. ఆ త‌రువాత ఇంగ్లాండ్ పై 4, శ్రీలంక పై 5, ద‌క్షిణాఫ్రికా పై 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక సెమీస్‌లో అయితే.. 7 వికెట్లు తీశాడు. మొత్తంగా 6 మ్యాచులు ఆడిన ష‌మీ 23 వికెట్లు ప‌డ‌గొట్టి అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు.

ఈ క్ర‌మంలో నెట్టింట ఆస‌క్తిక‌ర పోస్టులు పెడుతున్నారు. హార్థిక్ పాండ్య‌కు(Hardik Padya) ధ‌న్య‌వాదాలు(Thanks) చెబుతున్నారు. హార్థిక్ పాండ్య గాయ‌ప‌డ‌కుండా ఉంటే ష‌మీ(Mohammed Shami) కి జ‌ట్టులో స్థానం ద‌క్కేది కాద‌ని అంటున్నారు. స‌రైన స‌మ‌యంలో పాండ్య గాయ‌ప‌డ్డాడ‌ని అంటున్నారు. హార్థిక్ కు మ్యాన్ ఆఫ్ ది టోర్న‌మెంట్

(Man of the Tournament) అవార్డు ఇవ్వాలంటూ కొంద‌రు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు. 

 

ఒక‌వేళ హార్ధిక్ పాండ్య(Hardik Pandya) ఫిట్‌గా ఉండి ఉంటే అత‌డు ఖ‌చ్చితంగా తుది జ‌ట్టులో ఆడేవాడు. పేస‌ర్లుగా బుమ్రా(Bumrah), సిరాజ్(Siraj) లు కొన‌సాగేవారు. మూడో పేస‌ర్‌గా హార్థిక్ ఉండ‌డంతో తుది జ‌ట్టులో షమీకి(Mohammed Shami)  చోటు ద‌క్క‌డం క‌ష్ట‌మ‌య్యేది. హార్ధిక్ ఆల్‌రౌండ‌ర్ కాబ‌ట్టి అద‌నంగా ఓ బ్యాట‌ర్ లేదా స్పిన్న‌ర్ తీసుకునే వెసులుబాటు ఉండేది. మొద‌టి నాలుగు మ్యాచుల్లో ఇదే జ‌రిగింది. 

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్(India) నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయిన 398 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లీ(Virat Kohli) (117), శ్రేయ‌స్ అయ్య‌ర్(Shreyas Ayyar) (105) సెంచ‌రీలు చేశారు. కివీస్ బౌల‌ర్ల‌లో టిమ్ సౌథీ మూడు, ట్రెంట్ బౌల్డ్‌ ఓ వికెట్ తీశారు. భారత బౌలర్ల ధాటికి కీవీస్‌ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. టిమ్‌ సౌథీ 10 ఓవర్లలో వంద పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్‌ 10ఓవర్లలో 86 పరుగులు ఇచ్చి 1 వికెట్‌ తీసుకున్నాడు. ఫెర్గూసన్ 8 ఓవర్లలో 65, రచిన్‌ రవీంద్ర 7 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చారు. అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌డానికి బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవ‌ర్ల‌లో 327 ప‌రుగుల‌కు ఆలౌటైంది. డారిల్ మిచెల్ (134), కేన్ విలిమ‌య్స‌న్ (69) రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ(Mohammed Shami)  ఏడు వికెట్లు తీసి కివీస్ ప‌త‌నాన్ని శాసించాడు. బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌లు ఒక్కొ వికెట్ సాధించారు.

 

విశ్వ‌విజేత‌గా నిలిచేందుకు భార‌త్‌కు(India) ఇంకొక్క విజ‌యం చాలు. 12 ఏళ్ల క‌ల‌ను తీర్చుకునేందుకు టీమ్ఇండియా(Team India) ఎదుట సువ‌ర్ణావ‌కాశం. సెమీఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌ను మ‌ట్టిక‌రిపించిన భార‌త్ ద‌ర్జాగా ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. ఆదివారం (న‌వంబ‌ర్ 19)న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ద‌క్షిణాఫ్రికా(South Africa), ఆస్ట్రేలియా(Australia) జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న రెండో సెమీ ఫైన‌ల్(Semi Final) మ్యాచ్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టుతో ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ అమీ తుమీ తేల్చుకోనుంది. ఈ ఒక్క మ్యాచులో గెలిస్తే చాలు ప్ర‌పంచ‌క‌ప్(WorldCup 2023) విజేత‌గా భార‌త్ నిల‌వ‌నుంది.