India-England టెస్టు సిరీస్: భారత జట్టు ఇదే.. ప్రకటించిన బీసీసీఐ

India vs England test series: భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి ప్రారంభమయ్యే భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.

Courtesy: Top Indian news

Share:

భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి ప్రారంభమయ్యే భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొదటి రెండు టెస్టులకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా, జస్ప్రీత్ బూమ్రా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. చెతేశ్వర్ పుజారా, మహమ్మద్ షమీలకు జట్టులోకి తీసుకోకపోవడం గమనార్హం. 

జట్టులో ముగ్గురు వికెట్‌కీపర్లు
జట్టులో ముగ్గురు వికెట్‌కీపర్‌లను చేర్చుకోవడం కీలకమైన అంశంగా చెప్పొచ్చు. కేఎల్ రాహుల్, రైజింగ్ స్టార్ KS భరత్ మరియు తొలిసారి ఆరంగేట్రం చేస్తున్న ధృవ్ జురెల్ ముగ్గురు వికెట్ కీపర్లు జట్టులో స్థానం సాధించారు. స్పిన్ లో అనుభవజ్ఞులైన రవిచంద్రన్ అశ్విన్ మరియు రవీంద్ర జడేజా ఉన్నారు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, ప్రపంచ కప్ లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి ఫాం లో ఉన్న మహ్మద్ సిరాజ్ మరియు ముఖేష్ కుమార్‌తో పాటు, అవేష్ ఖాన్ కూడా జట్టులో ఉన్నాడు.

ఇంగ్లండ్‌తో జరిగే మొదటి రెండు టెస్టుల పూర్తి జట్టు వివరాలివే
జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (VC), అవేష్ ఖాన్.


భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టు మ్యాచ్ ల పూర్తి షెడ్యూల్ ఇదే
1వ టెస్టు: హైదరాబాద్ - జనవరి 25-29, 2024
2వ టెస్ట్: వైజాగ్ - ఫిబ్రవరి 2-6, 2024
3వ టెస్ట్: రాజ్‌కోట్ - ఫిబ్రవరి 15-19, 2024
4వ టెస్ట్: రాంచీ - ఫిబ్రవరి 23-27, 2024
5వ టెస్ట్: ధర్మశాల - మార్చి 7-11, 2024