Rahul Dravid: కోచ్‌గా వారిని ఇలా చూడటం చాలా కష్టంగా ఉంది

హెడ్ కోచ్ గా ముగిసిన ద్రవిడ్‌ పదవీ కాలం…

Courtesy: Twitter

Share:

Rahul Dravid: టీమ్‌ఇండియా (Team India) వన్డే ప్రపంచకప్‌ను(World Cup) చేజార్చుకుంది. ఫైనల్‌లో ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైంది. దాదాపు పదేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని(ICC Tropy) ముద్దాడాలనే కల కలగానే మిగిలిపోయింది. ఇదే సమయంలో భారత ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) పదవీ కాలం కూడా అధికారికంగా ముగిసింది. బీసీసీఐ కాంట్రాక్ట్‌(BCCI contract) ప్రకారం వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌తో(ODI World Cup Final) రాహుల్ ద్రవిడ్‌ పదవీకాలం పూర్తవుతుంది. తన రెండేళ్ల కాలంలో ఐసీసీ టోర్నీలకు సంబంధించి రెండుసార్లు ఫైనల్స్‌కు, ఒకసారి సెమీస్‌కు జట్టును తీసుకెళ్లాడు. ఆసియా కప్‌లో(Asia Cup) విజేతగా నిలిపాడు. దీంతో అతడిని కొనసాగిస్తారనే వాదనా ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) స్పందించాడు. కనీసం ఒక్క ఫార్మాట్‌లోనైనా జట్టుకు కోచ్‌గా వ్యవహరించే అవకాశం వస్తే స్వీకరిస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. 

‘‘ఇప్పటి వరకు అలాంటి ఆలోచనే లేదు. దాని గురించి తీరికా లేదు. మెగా టోర్నీపైనే దృష్టిసారించాం. సమయం ఉండుంటే ఆలోచించి ఉండేవాడినేమో. కానీ, వన్డే ప్రపంచకప్‌(World Cup) సమయంలో మా దృష్టంతా దీనిపైనే ఉంచాం. ఇక నా రెండేళ్ల పనితీరుపై బయట నుంచి ఎన్ని వ్యాఖ్యలు వచ్చినా పట్టించుకోను. నా బాధ్యతలను ఎలా నిర్వర్తించానని స్వయంగా విశ్లేషించుకుంటా. ఇలాంటి జట్టుతో పని చేసినందుకు గర్వపడుతున్నా. అన్ని ఫార్మాట్లలో ఆటగాళ్లతో కలిసిపోయి పని చేయడం ఆనందంగా ఉంది. ఎంతో గౌరవంగా భావిస్తున్నా’’ అని ద్రవిడ్(Dravid) తెలిపాడు.

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023(ICC ODI World Cup 2023) టోర్నీ ముగిసింది. మరో మూడు రోజుల్లో ఆస్ట్రేలియాతో(Australia) టీ20 సిరీస్(T20 Series) ఆడబోతోంది భారత జట్టు(Team India). నవంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచుల ఇండియా - ఆస్ట్రేలియా టీ20 సిరీస్(India - Australia T20 series) నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వంటి సీనియర్లకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్‌కి నవంబర్ 20 లేదా 21న టీమ్‌ని అనౌన్స్ చేయబోతోంది సెలక్షన్ కమిటీ(Selection Committee). ఇదే సమయంలో రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) అండ్ కో భవితవ్యంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా(Head Coach) బాధ్యతలు తీసుకున్నాడు రాహుల్ ద్రావిడ్..

వచ్చేఏడాది యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ దేశాల ఆతిథ్యంలో టీ20 ప్రపంచకప్‌(T20 World Cup) జరగనుంది. దీంతో ఆ టోర్నీకి కూడా జట్టుకు కోచింగ్‌ వ్యవహారాలు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నారా? అనే ప్రశ్నకు ద్రవిడ్ సమాధానం ఇచ్చాడు. ‘‘భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పలేరు. ఇప్పటికైతే ఎలాంటి ప్రణాళికలు లేవు.  అలాగే 2027 ప్రపంచకప్‌ గురించి కూడా ఇప్పుడే ఆలోచించడం సరికాదు. ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్లరు? అనేది చెప్పడం కష్టం. దానికి చాలా సమయం ఉంది’’ అని వ్యాఖ్యానించాడు.

‘‘రోహిత్ శర్మ(Rohit Sharma) సూపర్‌ కెప్టెన్. వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ను అద్భుతంగా నడిపించాడు. మైదానంలోనూ, డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ ఆటగాళ్లలో ఉత్తేజం నింపాడు. ఎప్పుడు అవసరమైనా తక్షణమే అందుబాటులో ఉంటాడు. చర్చకైనా, సమావేశాలకైనా వచ్చేస్తాడు. ప్రతి మ్యాచ్‌ కోసం ముందే పక్కాగా ప్లానింగ్‌ ఉంటుంది. అయితే, వరల్డ్‌ కప్ వంటి మెగా టోర్నీ ఫైనల్‌లో ఓడిపోవడంతో డ్రెస్సింగ్‌ రూమ్‌ తీవ్ర నిరుత్సాహానికి గురైంది. వారిని ఇలా చూడటం బాధగా ఉంది. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేసి ఇక్కడి వరకు వచ్చారు. కోచ్‌గా వారిని ఇలా చూడటం చాలా కష్టంగా ఉంటుంది’’ అని ద్రవిడ్‌ వెల్లడించాడు. రాహుల్ ద్రావిడ్(Rahul Dravid), టీమిండియా(Team india) హెడ్ కోచ్‌గా కొనసాగేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని సమాచారం. అయితే బీసీసీఐ మాత్రం జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 వరకూ ద్రావిడ్‌ని హెడ్ కోచ్‌గా కొనసాగించాలని భావిస్తోంది. మరి దీనికి ద్రావిడ్ ఒప్పుకుంటాడా? లేదా? అనేది త్వరలో తేలిపోనుంది.