Dhoni: ధోనీ వల్లే అది సాధ్యం అయింది

ఇండియన్ క్రికెట్ పై పాక్ మాజీ బౌలర్ వ్యాఖ్యలు వైరల్

Courtesy: pexels

Share:

Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) అంటే తెలియని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ (Cricket Fan) ఉండడంటే అతిశయోక్తి కాదు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన ధోనీ ఇండియన్ క్రికెట్ (Indian Cricket) నే శాసించాడు. ప్రపంచం మొత్తం ఇండియన్ క్రికెట్ వైపు చూసేలా ధోనీ (dhoni) చేశాడు. అందుకోసమే ప్రపంచంలో ఉన్న అనేక మంది క్రికెటర్లు ఇండియన్ క్రికెట్ ప్రస్తావన వస్తే ధోనీ ప్రస్తావనను తప్పకుండా తీసుకువస్తారు. మరి ధోనీ ఇండియన్ క్రికెట్ కోసం అంతలా సేవలందించాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ (Cricket World Cup) సెమీస్ దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ వరల్డ్ కప్ (Cricket World Cup) నుంచి పాకిస్తాన్ (Pakistan) టీమ్ ఇంటి దారి పట్టింది. గ్రూప్ స్టేజ్ లోనే పాకిస్తాన్ ఇంటికి రావడం ఆ దేశ మాజీ క్రికెటర్లను అంతగా రుచించడం లేదు. దీంతో వారు పాక్ జట్టులోని క్రికెటర్లపై విమర్శల బాణాలు ఎక్కువపెడుతున్నారు. పాక్ (Pak Team) జట్టును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

బాబర్ నాయకత్వమే కారణం.. 

ప్రపంచ కప్ (Cricket World Cup) వంటి మెగా టోర్నీలో ఇంత దారుణంగా విఫలం కావడం ఫ్యాన్స్ (Fans) తో పాటు అక్కడి మాజీ క్రికెటర్లకు కూడా నచ్చడం లేదు. దీంతోనే పాక్ (Pak) జట్టు మీద విమర్శలు చేస్తున్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమే అనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఒక్కరని కాకుండా మాజీలందరూ వరుసపెట్టి ఈ మాజీ చాంపియన్  (Former Champion)ను దూషిస్తూనే ఉన్నారు. మరీ ఇంత ఘోరంగా విఫలం కావడం అస్సలుకే బాగోలేదని విమర్శిస్తున్నారు. మాజీ చాంపియన్ అయిన జట్టు ఇలా ప్రదర్శన చేయడం అస్సలుకే బాగోలేదని మండిపడుతున్నారు. 

ధోనీని పొగడ్తలతో ముంచెత్తిన మాజీ బౌలర్

మాజీ బౌలర్ అమీర్ కూడా ఈ ఘటనపై స్పందించాడు. అతడు ఓ మీడియా (Media)తో మాట్లాడుతూ.. ఇండియన్ మాజీ కెప్టెన్ ధోనీని (Dhoni) పొగడ్తలతో ముంచెత్తాడు. ధోనీ ఇండియన్ క్రికెట్ ను మార్చేశాడని అమిర్ అన్నాడు. అతడు క్రికెట్ జట్టు (Cricket Team) స్థితిని మార్చాడు కానీ వ్యవస్థ గురించి పట్టించుకోలేదని తెలపాడు. వ్యవస్థ అనేది ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మోర్గాన్ కూడా ఇంగ్లండ్ క్రికెట్ (England Cricket) తీరునే మార్చేశాడని అన్నాడు. వారు తమకు కావాల్సిన ప్లేయర్ల ద్వారా అద్భుతాలు చేశారని తెలిపాడు. పాక్ కెప్టెన్ అయిన బాబర్ అజాం వద్ద కూడా అనేక మంది ప్లేయర్స్ ఉంటే అతడు మాత్రం వారితో ఏం సాధించలేక స్వదేశానికి వచ్చాడని దుయ్యబట్టాడు. పాక్ ప్రపంచకప్ నే కాకుండా టీ 20 వరల్డ్ కప్ మరియు చాంపియన్స్ ట్రోఫీని కూడా గెల్చుకుంది. అది గతం. కానీ ఈ వరల్డ్ కప్ లో వారు కనీసం సెమీస్ కు (Semis) కూడా చేరుకోలేకపోయారు. ఇదే ఆ దేశ మాజీలకు ఆగ్రహం తెప్పిస్తోంది. కనీసం సెమీస్ కు అయినా క్వాలిఫై కాకపోతే ఎలా అని విమర్శిస్తున్నారు. 

బోర్డు కీలక నిర్ణయం.. 

పాకిస్తాన్ జట్టు (Pakistan Team) ఇలా ఘోరమైన పరాభవంతో ఇంటికి వచ్చిన వేళ.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జట్టుకు సేవలందిస్తున్న విదేశీ కోచింగ్ సిబ్బందిన మొత్తం తీసేయాలని బోర్డు (Board) పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా బోర్డు తన మరో నిర్ణయాన్ని ప్రకటించింది. సెలెక్షన్ కమిటీని (Selection Committee) మొత్తం రద్దు చేసింది. కొత్త సెలెక్షన్ కమిటీని ఎప్పుడు నియమిస్తామనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. 

ఇప్పటికే రాజీనామా.. 

పాక్ జట్టు స్పీడ్ బౌలింగ్ కోచ్ గా సేవలందిస్తూ వచ్చిన సౌతాఫ్రికా మాజీ పేస్ బౌలర్ మోర్నీ మోర్కెల్ (Morkel) ఇప్పటికే తన రాజీనామాను సమర్పించాడు. మోర్కెల్ రాజీనామా చేయడంతో పాక్ జట్టు ఉమర్ గుల్ ను మోర్కెల్ స్థానంలో స్పీడ్ బౌలింగ్ కోచ్ గా నియమించింది. మోర్కెల్ నిర్వర్తించిన బాధ్యలనే గుల్ (Gul) నియమించనున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు పాక్ బోర్డు నుంచి ఇవే రెండు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. దీంతో పాక్ క్రికట్ లో పెను మార్పులు సంభవించడం ఖాయం అని అంతా అనుకుంటున్నారు. పాక్ క్రికెట్ ను రాజకీయాలకు అతీతంగా ఉంచాలని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇంటి దారి పట్టిన మరో టీం శ్రీలంకను ఐసీసీ సభ్యదేశాల జాబితా నుంచి తొలగించింది. ఆ దేశంలో ఉన్న రాజకీయ అనిశ్చితుల కారణంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం పాక్ క్రికెట్ జట్టు అని మాత్రమే కాకుండా పొరుగున ఉన్న శ్రీలంక క్రికెట్ జట్టు కూడా టీంలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. ఎలాగైనా సరే వచ్చే చాంపియన్స్ ట్రోఫీ వరకు జట్లను బలంగా తయారు చేయాలని పాక్ బోర్డు( Pak Board) భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాక్ మాజీలు ఫ్రస్టేట్ అవుతున్నారు. ఇలా ఫ్రస్టేట్ అవుతూ ఇండియన్ యాక్టర్ల (Indian Actors)పై తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఇండియా జట్టు సెమీస్ కు వెళ్తేనే పరిస్థితి ఇలా ఉందంటే ఇక జట్టు ఫైనల్ కు చేరుకుంటే పరిస్థితి మరీ ఎలా ఉంటుందో అని ఇండియన్ ఫ్యాన్స్ (Indian Fans) కామెంట్లు చేస్తున్నారు.