Mohammed Shami: మహమ్మద్ షామి వికెట్లు పడగొట్టడం కలలో చూసా..!

ఇప్పుడు అదే నిజమైంది..

Courtesy: Twitter

Share:

Mohammed Shami: బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అంటూ, ఇప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటనలను ఉదాహరణగా చాలామంది చెప్తూ ఉంటారు. అప్పుడు ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు కొన్ని విషయాలు జరుగుతున్నాయి అంటూ ఆశ్చర్యపరుస్తారు. ఇప్పుడు క్రికెట్ (Cricket) మ్యాచ్ లో కూడా ఇదే తరహా మొదలైంది. ప్రపంచ కప్ (World Cup) సెమీఫైనల్స్ లో మహమ్మద్ షామీ ఏడు వికెట్లు పడగొడతాడని తనకి ముందే తెలుసు అని, తాను కలలో చూశాను అంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో (Social Media) హల్చల్ చేస్తున్నాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ తమ ఫ్యూచర్ చెప్పమంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. 

వికెట్లు పడగొట్టడం కలలో చూసా..!: 

బుధవారం జరిగిన ఐసిసి ప్రపంచ కప్ (World Cup) 2023 సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించిన మహమ్మద్ షమీ (Mohammed Shami) స్టార్‌గా అవతరించాడు. 33 ఏళ్ల అతను ఏడు వికెట్లు పడగొట్టాడు, 50 ఓవర్ల ప్రపంచ కప్ (World Cup) చరిత్రలో భారత బౌలర్, అత్యుత్తమ వికెట్లను పడగొట్టిన ఆటగాడుగా పేరు దక్కించుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే సెమీ-ఫైనల్ జరగడానికి ఒక రోజు ముందు షమీ (Mohammed Shami) ఏడు వికెట్లు పడగొట్టడం గురించి కలలుగన్నట్లు ఒక సోషల్ మీడియాలో (Social Media) ఒక వ్యక్తి పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఇది చూసిన చాలామంది సోషల్ మీడియాలో (Social Media) తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. తమ ఫ్యూచర్ గురించి కూడా మంచిగా కలగని తమకు చెప్పమంటూ, ఫైనల్ మ్యాచ్ కూడా సవ్యంగా జరిగేలాగా స్క్రిప్ట్ ప్రిపేర్ చేయమంటూ, ఫ్యూచర్లో నెక్స్ట్ యూఎస్ ప్రెసిడెంట్ ఎవరు కాబోతున్నారో చెప్పమంటూ పలు కామెంట్లు చేస్తున్నారు నటిజెన్లు. 

మహమ్మద్ షామికి పెళ్లి ప్రపోజల్: 

భారతీయ క్రికెట్ (Cricket) ఆటగాడు మహమ్మద్ షమీ (Mohammed Shami) తన ఆటతీరుతో ప్రపంచ కప్ (World Cup) లో ముందుకు దూసుకుపోతున్నాడు. సెమీ ఫైనల్స్ కి ముందు జరిగిన కొన్ని మ్యాచ్లలో షమీ (Mohammed Shami) ఆడిన నాలుగు ఆటల్లో, 16 వికెట్లు పడగొట్టడంతో, ఫ్లాట్ అయిన నటి పాయల్ గోష్(Payal Ghosh), మహమ్మద్ షమీ (Mohammed Shami)ను పెళ్లి (Marriage) చేసుకుంటా అంటూ ముందుకు వచ్చింది. కానీ అంతకన్నా ముందు ఒక షరతు కూడా పెట్టింది.. 

నటి-రాజకీయ నాయకురాలు పాయల్ గోష్ (Payal Ghosh) భారత క్రికెటర్ మహ్మద్ షమీ (Mohammed Shami)ని పెళ్లి (Marriage) చేసుకోవాలని కోరికను వ్యక్తం చేసింది. అయితే, ఆమె ఒక షరతు కూడా పెట్టడం జరిగింది. 2023 ICC ODI ప్రపంచ కప్ (World Cup)‌లో అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత, పాయల్ (Payal Ghosh) తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షమీ (Mohammed Shami)కి పెళ్లి (Marriage) ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. అతను ప్రపంచ కప్ (World Cup) లో ఆడిన నాలుగు గేమ్‌లలో 16 వికెట్లు పడగొట్టాడు. అయితే, షమీ (Mohammed Shami) ఆట తీరుకు ఫ్లాట్ అయిన  పాయల్ (Payal Ghosh), షమీ (Mohammed Shami)కి రెండో భార్యగా ఉండటానికి సిద్ధంగా ఉన్నానని, అయితే తన షరతు ప్రకారం, షమీ (Mohammed Shami) ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని, ఆ తర్వాత తప్పకుండా అతనిని పెళ్లి (Marriage) చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పాయల్ (Payal Ghosh) చెప్పుకొచ్చింది. పాయల్ (Payal Ghosh) చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) చెక్కర్లు కొడుతోంది. 

నవంబరు 2013 న వెస్ట్ ఇండీస్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఆడి ఐదు వికెట్లను పడగొట్టాడు. మహ్మద్ షమీ (Mohammed Shami)కి గతంలో హసిన్ జహాన్‌తో వివాహమైంది. వారు 2014లో వివాహం (Marriage) చేసుకున్నారు, కానీ విడిపోయారు. ద్రోహం, మ్యాచ్ ఫిక్సింగ్, గృహ హింసకు పాల్పడ్డాడని హసిన్ ఆరోపించడంతో, షమీ (Mohammed Shami)-హసిన్ విడాకులు తీసుకున్నారు. ఈ జంట ఇప్పుడు విడిపోయారు. వీళ్ళిద్దరికీ కూతురు కూడా ఉంది.