హాఫ్ సెంచరీతో టెస్ట్ కెరీర్ ను ముగించిన వార్నర్.. మున్ముందు టీ20లకూ గుడ్ బై!

David Warner: ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్ మెన్ డేవిడ్‌ వార్నర్‌ ఆస్ట్రేలియా బ్యాట‌ర్ డేవిడ్ వార్న‌ర్(David Warner) త‌న చివ‌రి టెస్టు ఆడేశాడు. సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో ముగిసిన చివరి టెస్టులో ఆడిన విజయంతో తన టెస్ట్ కెరీర్ ముగించారు.

Courtesy: x

Share:

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్ మెన్ డేవిడ్‌ వార్నర్‌ ఆస్ట్రేలియా బ్యాట‌ర్ డేవిడ్ వార్న‌ర్(David Warner) త‌న చివ‌రి టెస్టు ఆడేశాడు. సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో ముగిసిన చివరి టెస్టులో ఆడిన విజయంతో తన టెస్ట్ కెరీర్ ముగించారు. వార్నర్‌ భాయ్ తన చివరి మ్యాచ్‌లోనూ అభిమానులను అలరించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 34, రెండో ఇన్నింగ్స్‌లో 56 పరుగులు చేశారు.

మరోవైపు ఆస్ట్రేలియా మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రెండ‌వ ఇన్నింగ్స్‌లో 130 ర‌న్స్ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి ఆ టార్గెట్‌ను చేజ్ చేసింది.

నేటి(జనవరి 6)తో సుదీర్ఘ ఫార్మాట్‌‌కు వీడ్కోలు పలికిన వార్నర్‌.. వన్డేలకు గుడ్ బై చెప్పారు. కాకపోతే తన సేవలు క్రికెట్ ఆస్ట్రేలియా కావాలనుకుంటే వచ్చే ఏడాది పాక్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో అడతానని అతను చెప్పినప్పటికీ అది జరుగుతుందని ఆశించలేం. వీడ్కోలు పలికిన ఆటగాడికి క్రికెట్ ఆస్ట్రేలియా మరో అవకాశమిచ్చే మంచి మనసు లేదు. దీంతో అతను మున్ముందు వన్డేల్లోనూ  కనిపించేది అసంభవమే. ప్రస్తుతం వార్నర్ వయసు  37 ఏళ్లు. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ అనంతరం వార్నర్‌ పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పవచ్చు.

భావోద్వేగానికి గురైన వార్నర్
టెస్టు కెరీర్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన అయిద‌వ ఆస్ట్రేలియా బ్యాట‌ర్‌గా వార్న‌ర్‌ నిలిచాడు. సిడ్నీ టెస్టులో నాలుగ‌వ రోజు వార్న‌ర్ ఔటైన త‌ర్వాత ప్లేయ‌ర్లు, ప్రేక్ష‌కులు వీడ్కోలు ప‌లికారు. త‌న హెల్మెట్‌ను, గ్లౌవ్స్‌ను ఓ చిన్నారి అభిమానికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. మైదానంలో ఉన్న త‌న కూతుళ్ల‌కు హ‌త్తుకున్నాడు. కన్నీళ్ల‌ను తుడుచుకుంటూ అభిమానుల‌కు అభివాదం చేశాడు.

2011లో ఆస్ట్రేలియా తరుపున టెస్ట్ అరంగ్రేటం చేసిన వార్నర్‌.. తన కెరీర్ మొత్తంలో 112 టెస్టులు ఆడారు. 205 ఇన్నింగ్స్‌లో 8786 పరుగులు చేశారు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు, 36 అర్థ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్.. 335 కాగా, సగటు 44.60. నేటితో టెస్టులు, వన్డేల నుంచి తప్పుకున్న వార్నర్‌.. మున్ముందు ఫ్రాంచైజీ క్రికెట్ లో ఎక్కువగా కనిపించనున్నారు.