David Warner: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్ కు షాకిచ్చిన వార్నర్.. వన్డేలకూ గుడ్ బై

David Warner : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ న్యూ ఇయర్ రోజున తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. స్వ‌దేశంలో పాకిస్థాన్‌(Pakistan)తో చివ‌రి టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌లుకనున్న డేవిడ్ భాయ్ వ‌న్డేల‌కు కూడా గుడ్ బై చెప్పేశాడు.

Courtesy: x

Share:

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ న్యూ ఇయర్ రోజున తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు.  స్వ‌దేశంలో పాకిస్థాన్‌(Pakistan)తో చివ‌రి టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌లుకనున్న డేవిడ్ భాయ్ వ‌న్డేల‌కు కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే.. 2025లో జ‌రిగే చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)కి అవసరమైతే అందుబాటులో ఉంటాన‌ని తెలిపాడు. 37ఏళ్ల వార్నర్ .. భారత్ పై వన్డే ఫైనల్ మ్యాచ్ తనకు చివరిదని ప్రకటించాడు. టీ 20 క్రికెట్ లో కొనసాగుతానని ప్రకటించాడు. ఈ ఏడాది  జూన్ లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో ఆడేందుకు అందుబాటులో ఉంటానని చెప్పాడు. 

వార్నర్ తన 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ లో  161 వన్డేలు ఆడిన వార్నర్ 6932 పరుగులు చేశాడు. ఇందులో 22 వన్డేలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 111 టెస్టులు ఆడిన వార్నర్ 8695 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు,36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో వార్నర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 335 నాటౌట్.  ‘నేను టెస్టులతో పాటు వ‌న్డేల నుంచి కూడా వైదొలుగుతున్నా. ఈ విష‌యాన్ని నేను వ‌న్డే ప్రపంచ క‌ప్(ODI World Cup) నుంచి చెప్తున్నా. రిటైర్మెంట్‌పై ఈ రోజు నిర్ణ‌యం తీసుకున్నా. భార‌త గ‌డ్డ‌పై వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం నా కెరీర్‌లో అతిముఖ్య‌మైన సంద‌ర్భం. ఒక‌వేళ నా శ‌రీరం స‌హ‌క‌రిస్తే వ‌చ్చే ఏడాది చాంపియ‌న్స్ ట్రోఫీలో ఆడుతా’ అని రెండుసార్లు వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత అయిన వార్న‌ర్ వెల్ల‌డించాడు. అంతేకాదు ఇక‌పై అంత‌ర్జాతీయ టీ20 లీగ్స్‌పై దృష్టి పెట్ట‌నున్న‌ట్టు ఈ స్టార్ ఓపెన‌ర్ స్ప‌ష్టం చేశాడు. ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్ ఇప్ప‌టివ‌ర‌కూ 161 వ‌న్డేల్లో 6,932 ప‌రుగులు సాధించాడు. అంతేకాదు 97.26 స్ట్రైక్ రేటుతో 22 సెంచ‌రీలు బాదిన డేవిడ్ భాయ్.. ఆసీస్ త‌ర‌ఫున అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన రెండో క్రికెట‌ర్‌గా రికార్డు నెల‌కొల్పాడు. మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(Ricky Ponting) 29 సెంచ‌రీలు అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు.

2023 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చడంలో వార్నర్‌ (David Warner) కీలక పాత్ర పోషించాడు. రెండు శతకాలు, రెండు అర్ధశతకాలతో సహా మొత్తం 528 పరుగులు చేశాడు. జట్టు నుంచి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.వార్న‌ర్ వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు దూరం కానున్నాడు. అయితే.. యూఏఈలో వ‌చ్చే ఏడాది జ‌రిగే ఇంట‌ర్నేష‌న‌ల్ టీ20(ILT20) లీగ్‌లో ఈ డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ మెరుపులు మెరిపించ‌నున్నాడు.


దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్ గా వార్నర్
ఆస్ట్రేలియా వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20-2024లో భాగం కానున్నాడు. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ అనుబంధ జట్టు దుబాయ్‌ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా అతడు నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని క్యాపిటల్స్‌ యాజమాన్యం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. కెప్టెన్‌ మార్వెల్‌ అంటూ వార్నర్‌ ఆగమాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ విడుదల చేసింది. కాగా టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఐపీఎల్‌-2023లో వార్నర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథిగా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.