Rahul Dravid: టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. మరో రెండేళ్ల కాంట్రాక్టు?

త్వరలో స్పష్టత

Courtesy: Twitter

Share:

Rahul Dravid: టీమ్ ఇండియా(Team India) ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్కు (Rahul Dravid) బీసీసీఐ (BCCI) మరో రెండేళ్ల కాంట్రాక్ట్ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ద్రవిడ్ కోచింగ్లో టీంఇండియా(Team India) ప్రపంచ కప్ 2023 రెండింటిలోనూ రన్నరప్గా నిలిచింది.

Rahul Dravid : టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్కు (Rahul Dravid) బీసీసీఐ మరో రెండేళ్ల కాంట్రాక్ట్ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ద్రవిడ్ కోచింగ్లో టీమిండియా ODI ప్రపంచ కప్ 2023, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండింటిలోనూ రన్నరప్గా నిలిచింది. అయితే ఐపీఎల్లో(IPL) పలు ఆఫర్లు కూడా ఉన్నందున ద్రవిడ్ తన నిర్ణయాన్ని ఇంకా తెలియజేయలేదు. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టుకు (Rahul Dravid ) మార్గనిర్దేశం చేయాలని బీసీసీఐ పాలకమండలి కోరుతోంది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే (ODI) ప్రపంచ కప్ (World Cup) రెండింటిలోనూ భారతదేశ జట్టును రన్నరప్గా ద్రవిడ్ (Rahul Dravid) నిలిపారు. కోచ్ గత రెండేళ్లలో మంచి రికార్డులు సాధించారు. ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జేషా కూడా గత వారం కోచ్ ద్రవిడ్ తో చర్చలు జరిపినా, కాంట్రాక్టు వ్యవహారం తేలలేదు. ద్రవిడ్ను టెస్టు జట్టుతో కలిసి దక్షిణాఫ్రికాకు వెళ్లాలని బీసీసీఐ కోరుతోందని బీసీసీఐ (BCCI) సీనియర్ ఆఫీస్ బేరర్ ఒకరు చెప్పారు. ఒప్పందంపై సంతకం చేయకుండా పర్యటనకు వెళ్లడానికి ద్రవిడ్ సిద్ధంగా ఉంటాడా, లేదా అనేది ఇంకా తేలలేదు.

రాహుల్ ద్రవిడ్ ను (Rahul Dravid) తమ జట్టు మెంటార్ గా ఉండాలని పలు ఐపీఎల్(IPL) ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. ద్రవిడ్ పదవీకాలం పొడిగింపు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. తదుపరి టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని ఒక సంవత్సరం పాటు ఉంటుందా లేదా 2025 సంవత్సరం వరకు కోచ్ గా కొనసాగుతారా అనే అంశాలపై త్వరలో స్పష్టత రానుందని బీసీసీఐ (BCCI) వర్గాలు తెలిపాయి.

పరిస్థితులు అనుకూలిస్తే రాహుల్‌ (Rahul Dravid) వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్కు ముందే లక్నో సూపర్జెయింట్‌ (Lucknow Super Giant) జట్టుకు మెంటర్గా మారే అవకాశాలున్నాయి. అయితే, ద్రవిడ్‌, బీసీసీఐ (BCCI) మధ్య జరిగే చర్చలపైనే ఏం జరుగుతుందనేది ఆధారపడి ఉన్నది. 2021 ప్రపంచకప్తర్వాత 2023 వన్డే వరల్డ్కప్వరకు రెండేళ్ల కాంటాక్టుపై టీమిండియా ప్రధాన కోచ్గా నియామకమయ్యాడు. రవిశాస్త్రి (Ravi Shastri) పదవీకాలం ముగిసిన తర్వాత అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్గంగూలీ, ప్రస్తుత కార్యదర్శి జైషా ప్రధాన కోచ్గా ద్రవిడ్ను (Rahul Dravid ) తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు.

లక్నో ఫ్రాంచైజీ ఇప్పటికే ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ను (Andy Flower) తొలగించింది. వచ్చే సీజన్నుంచి జస్టిన్ లాంగర్కు జట్టు ప్రధాన కోచ్బాధ్యతలు అప్పగించింది. అన్ని అనుకున్నట్లుగా జరిగే రాహుల్ద్రవిడ్సైతం లక్నో జట్టులో వచ్చే అవకాశం ఉంది. ద్రవిడ్ను (Rahul Dravid ) చేర్చుకునే ఆలోచనలో మరో ఫ్రాంచైజీ ఉంది. మరో వైపు రాజస్థాన్ రాయల్స్సైతం చర్చలు జరుపుతున్నది. ద్రవిడ్ రాజస్థాన్ ఫ్రాంచైజీకి చాలా సంవత్సరాలు క్రికెట్ ఆడాడు. అలాగే కెప్టెన్గానూ వ్యవహరించాడు. అలాగే, రాజస్థాన్కు (Rajastan) మెంటార్గానూ వ్యవహరించాడు. అయితే, ప్రస్తుతం ద్రవిడ్ను (Rahul Dravid) మెంటర్గా తీసుకోవడంలో ఎల్ఎస్జీ ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తున్నది.

ద్రవిడ్‌ (Rahul Dravid ) సారథ్యంలో టీమిండియా ఐసీసీ(ICC) ట్రోఫీలను గెలువలేకపోయింది. కానీ, మాజీ కెప్టెన్శిక్షణలో ద్వైపాక్షిక సిరీస్లో భారత్అద్భుత ప్రదర్శన చేసింది. అలాగే టీమిండియా ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో నెంబర్వన్జట్టుగా అవతరించింది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్లో (World Cup) భారత జట్టు వరుసగా పది మ్యాచ్లు గెలిచింది. అయితే, టైటిల్మ్యాచ్లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్లో తడబడి ఓటమిపాలైంది. ఏడాది ప్రారంభంలో ప్రపంచ టెస్ట్చాంపియన్లో ఆస్ట్రేలియాతో (Australia) జరిగిన ఫైనల్లోనూ టీమిండియా (Team India) ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

ద్రవిడ్‌ (Rahul Dravid ) మళ్లీ టీమిండియా ప్రధాన కోచ్బాధ్యతలు స్వీకరించకపోతే ప్రస్తుతం నేషనల్అకాడమీ చీఫ్గా కొనసాగుతున్న వీవీఎస్లక్ష్మణ్కోచ్గా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. గతకొంతకాలంగా ద్రవిడ్విరామం తీసుకున్న సమయంలో లక్ష్మణ్కోచ్గా వ్యవహరిస్తూ వచ్చాడు. ఎన్సీఏతో లక్ష్మణ్కు ఉన్న అనుబంధం నేపథ్యంలో.. ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ (BCCI) భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే ఐదు మ్యాచ్ టీ20 సిరీస్కు యువ భారత జట్టు తాత్కాలిక కోచ్గా వ్యవహరిస్తున్నాడు.