World Cup: ఇండియా, పాకిస్తాన్ సెమీస్‌లో తలపడే అవకాశముందా.. ?

World Cup: వరల్డ్ కప్‌(World Cup)లో సెమీస్(Semis) బెర్త్ కోసం శాయశక్తులా పోరాడుతున్న పాకిస్థాన్(Pakistan).. ఒకవేళ టాప్-4లో నిలవగలిగితే సెమీఫైనల్లో భారత్‌తో తలపడనుంది. రోహిత్ సేన ఇప్పటికే టేబుల్ టాపర్‌గా నిలవడం ఖాయమైంది. దీంతో పాక్ సెమీస్ చేరుతుందా అనేది ఇప్పుడున్న ప్రశ్న. ఆసీస్ చేతిలో అప్ఘాన్ ఓడటంతో పాక్ సెమీస్ అవకాశాలు మెరుగయ్యాయి. పాకిస్థాన్ సెమీస్‌కు అర్హత సాధించాలంటే.. తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌(England)ను చిత్తు చిత్తుగా ఓడించాలి. అప్పుడు నవంబర్ 15న వాంఖడే(Wankhede) […]

Share:

World Cup: వరల్డ్ కప్‌(World Cup)లో సెమీస్(Semis) బెర్త్ కోసం శాయశక్తులా పోరాడుతున్న పాకిస్థాన్(Pakistan).. ఒకవేళ టాప్-4లో నిలవగలిగితే సెమీఫైనల్లో భారత్‌తో తలపడనుంది. రోహిత్ సేన ఇప్పటికే టేబుల్ టాపర్‌గా నిలవడం ఖాయమైంది. దీంతో పాక్ సెమీస్ చేరుతుందా అనేది ఇప్పుడున్న ప్రశ్న. ఆసీస్ చేతిలో అప్ఘాన్ ఓడటంతో పాక్ సెమీస్ అవకాశాలు మెరుగయ్యాయి. పాకిస్థాన్ సెమీస్‌కు అర్హత సాధించాలంటే.. తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌(England)ను చిత్తు చిత్తుగా ఓడించాలి. అప్పుడు నవంబర్ 15న వాంఖడే(Wankhede) వేదికగా దాయాదుల మధ్య సెమీస్ పోరు జరుగుతుంది.

వరల్డ్ కప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన రోహిత్ సేన గ్రూప్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. భారత్‌తో పాటు సౌతాఫ్రికా(South Africa) సెమీ ఫైనల్ చేరగా.. మరో రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా(Australia), న్యూజిలాండ్(New Zealand), పాకిస్థాన్(Pakistan), అప్ఘానిస్థాన్(Afghanistan) మధ్య పోటీ ఉంది. ఆసీస్ కూడా సెమీస్ చేరడం ఖాయంగా కనిపిస్తుండగా.. చివరి బెర్త్ కోసం మూడు జట్లు కొట్లాడాల్సిన పరిస్థితి తలెత్తింది.   

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో సెమీ ఫైనల్లో(Semi final) తలపడనుంది. కాబట్టి పాకిస్థాన్(Pakistan) సెమీస్ చేరితే.. భారత్, పాక్ మధ్య సెమీఫైనల్ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సెమీస్ చేరే అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఇప్పటి దాకా లీగ్ దశలో 8 మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. దీంతో పాకిస్థాన్(Pakistan) పాయింట్ల పట్టికలో మూడో స్థానంతో లీగ్ దశను ముగించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పాక్ టాప్-3లో నిలవాలంటే.. న్యూజిలాండ్(New Zealand), ఆస్ట్రేలియా(Australia) మిగతా మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. అదే సమయంలో అప్ఘానిస్థాన్ కూడా ఆస్ట్రేలియాపై కొద్ది తేడాతో గెలిచి, సౌతాఫ్రికా చేతిలో ఓడాలి. అంటే ఇదంతా కుదిరే వ్యవహారం కాదన్నమాట.

పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే

ఇక పాకిస్థాన్(Pakistan) సెమీస్(Semis) చేరాలంటే.. ఆ జట్టు చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై గెలవడంతో పాటు.. ఇతర జట్ల ఫలితాలు కూడా దానికి అనుకూలంగా రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా నవంబర్ 9న జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను శ్రీలంక(Srilanka) ఓడించాలి. అప్ఘానిస్థాన్(Afghanistan) సైతం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లోనైనా ఓడాలి. అప్పుడు 10 పాయింట్లతో పాకిస్థాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ శ్రీలంకపై న్యూజిలాండ్(New Zealand) గెలిస్తే మాత్రం పాకిస్థాన్‌(Pakistan) సెమీస్ చేరే అవకాశాలు సన్నగిల్లుతాయి. 

శ్రీలంకపై న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో గెలిస్తే.. పాకిస్థాన్ దాదాపు 130 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించాలి. అప్పుడే పాకిస్థాన్ నెట్ రన్ రేట్ కివీస్ కంటే మెరుగ్గా ఉంటుంది. పాక్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు శ్రీలంక చేతుల్లో ఉన్నాయన్నమాట. ఒక వేళ కివీస్ లంకను జయిస్తే మాత్రం.. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 401 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో పాకిస్థాన్ (Pakistan)బ్యాటర్లు ఎలాంటి తెగువ ప్రదర్శించారో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో అంతకు మించి దూకుడుగా ఆడాలి. అప్పుడే పాక్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. పాకిస్థాన్ సెమీఫైనల్ చేరుకుంటే.. ఫైనల్ బెర్త్ కోసం దాయాది జట్లు తలపడతాయి. క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇంతకు మించిన మజా ఇంకేం ఉంటుంది. 

ఈ నెల 15వ తేదీన ముంబైలోని వాంఖడే(Wankhede) స్టేడియంలో తొలి సెమీ ఫైనల్స్(Semi Finals) షెడ్యూల్ అయింది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. భారత్- దక్షిణాఫ్రికా మధ్య సెమీ ఫైనల్స్ దాదాపుగా ఖరారైనట్టే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ ఈక్వేషన్‌లో మార్పు ఉండకపోవచ్చు. నవంబర్ 16 న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్(Gardens of Eden)లో జరగనుంది. టాప్ లో జట్టు, నాలుగు స్థానంలో జట్టుపై మొదటి సెమీస్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. 

అదే విధంగా 2,3 స్థానాల్లో నిలిచిన జట్లు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధించాయి. వీటిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు రెండు, మూడు స్థానాల్లో నిలవడం ఖాయమైపోయింది. అగ్ర స్థానంలో ఉన్న టీమిండియాతో సెమీస్ లో తలపడేందుకు పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు పోటీ పడనున్నాయి.ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. నవంబర్ 12 న లీగ్ మ్యాచ్ లు ముగుస్తాయి.