Glenn Maxwell:  మ్యాక్స్‌వెల్ వీరోచిత పోరాటానికి క్రికెట్ ప్రపంచం ఫిదా..!

Glenn Maxwell: వాంఖడే(Vankhade) వేదికగా గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) అద్భుతమే చేశాడు. ఆసీస్ ఇక గెలవలేదు అనుకున్న మ్యాచ్‌లో ఒంటి చేత్తో మ్యాచ్‌ను అఫ్ఘాన్(Afghan) నుంచి లాగేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే గ్రేటెస్ట్ ఇన్నింగ్స్(Greatest innings) అనదగ్గ ఆట ఆడిన మ్యాక్సీ.. ఆసీస్‌కు మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ(Double century) కొట్టడంతో 46.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రపంచకప్‌(World […]

Share:

Glenn Maxwell: వాంఖడే(Vankhade) వేదికగా గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) అద్భుతమే చేశాడు. ఆసీస్ ఇక గెలవలేదు అనుకున్న మ్యాచ్‌లో ఒంటి చేత్తో మ్యాచ్‌ను అఫ్ఘాన్(Afghan) నుంచి లాగేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే గ్రేటెస్ట్ ఇన్నింగ్స్(Greatest innings) అనదగ్గ ఆట ఆడిన మ్యాక్సీ.. ఆసీస్‌కు మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ(Double century) కొట్టడంతో 46.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రపంచకప్‌(World Cup)లో వరుసగా ఆరో విజయాన్ని అందుకుని సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది.

Read More: World Cup 2023: ఆస్ట్రేలియాపై ఓడినా అఫ్గానిస్థాన్ జట్టుకు సెమీస్ కు వెళ్లే అవకాశం..!

మ్యాచ్ అంటే అదీ, పోరాటం అంటే అదీ.. ఓ వైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు నొప్పి వేధిస్తున్నా మ్యాక్స్‌వెల్(Maxwell) ఆడిన ఆటన.. నభూతో న భవిష్యత్. సహచరులంతా పెవిలియన్ చేరుతూ గెలుపు ఆశలు సన్నగిల్లుతున్న వేళ.. నేనున్నానంటూ నిలబడిన తలబడిన మ్యాక్సీ.. ఓ గొప్ప యుద్ధమే చేశాడు. అప్పటి వరకూ ఆధిపత్యం చెలాయించిన అఫ్ఘాన్ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ అతనాడిన తీరు అద్భుతం, అనిర్వచనీయం. అసమాన, అసాధారణ పోరాటంతో ఆసీస్‌కు విజయాన్ని అందించిన మ్యాక్సీ సెమీస్(Semis) బెర్తును కూడా ఖాయం చేశాడు.

292 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలను.. అఫ్ఘాన్(Afghan) బౌలర్లు తొలుత కంగారు పెట్టేశారు. రెండో ఓవర్లోనే ఓపెనర్ ట్రావిస్ హెడ్‌(Travis Head)ను నవీనుల్ హక్(Navinul Haq) డకౌట్ చేశాడు. ఆ తర్వాత రెండు ఫోర్లు, రెండు సిక్సులతో జోరు మీదున్న మిచెల్ మార్ష్(Michelle Marsh)(24 )ను ఆరో ఓవర్లో ఎల్బీడబ్ల్యూ చేసి డబుల్ షాక్ ఇచ్చాడు. తొమ్మిదో ఓవర్లో ఫామ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్(David Warner)(18)ను, జోస్ ఇంగ్లిష్(Jos inglis)(0)ను అజ్మతుల్లా వరుస బంతుల్లో ఔట్ చేయడంతో.. 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా(Australia) పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత లబుషేన్ (14)రనౌట్ కావటంతో 69 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కంగారూల కష్టాలు రెట్టింపు అయ్యాయి.

స్పిన్నర్ రషీద్ ఖాన్(Rashid Khan) ఎంట్రీతో ఆస్ట్రేలియా కష్టాలు మరింత పెరిగాయి. మార్కస్ స్టయినిస్, మిచెల్ స్టార్క్‌లను రషీద్ ఖాన్ ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కానీ దశలో ప్యాట్ కమ్మిన్స్‌(Pat Cummins)తో కలిసి మ్యాక్స్‌వెల్(Maxwell) అద్భుతం చేశాడు. సిక్సులు, ఫోర్లు బాదుతూ 76 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న మ్యాక్సీ.. ఆ తర్వాత గాయంతోనూ పోరాడాడు. సరిగా నడవలేని పరిస్థితుల్లోనూ.. కమ్మిన్స్ అండతో చెలరేగి ఆడిన మ్యాక్స్‌వెల్ 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో డబుల్ సెంచరీ కొట్టాడు. ఆస్ట్రేలియాకు గ్రాండ్ విక్టరీ అందించాడు. సెమీస్ బెర్తు ఖాయం చేశాడు.

క్రికెట్ నిపుణుడు ఇయాన్ బిషప్ ముంబైలో అద్భుతమైన ప్రదర్శనను చూసిన తర్వాత “ఫుట్‌వర్క్ ఓవర్‌రేట్ చేయబడింది” అని ట్వీట్ చేశాడు. తీవ్రమైన తిమ్మిరిని ఎదుర్కొన్నప్పటికీ, ఆస్ట్రేలియన్ ఆల్-రౌండర్ తన జట్టు మొత్తం పరుగులలో 68.60% స్కోర్ చేయడానికి చేతి-కంటి సమన్వయం మరియు దృఢ సంకల్పంపై ఆధారపడ్డాడు, వన్డే ఇంటర్నేషనల్ (ODI) క్రికెట్ చరిత్రలో చాలా మంది గొప్ప ఇన్నింగ్స్‌లలో ఒకటిగా భావించే దానిని అందించాడు అని పేర్కొన్నాడు.

‘గోల్ఫర్’ మాక్స్‌వెల్ యొక్క బిగ్ షో

91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశ నుంచి మ్యాక్సీ, కమిన్స్(Maxi -Cummins) జోడీ ఎనిమిదో వికెట్‌కు 202 పరుగులు జోడించింది. అందులో కమ్మిన్స్ వాటా కేవలం 12 పరుగులే అంటే మ్యాక్సీ జోరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. పంటి బిగువున నొప్పిని భరిస్తూ. జట్టుకోసం గాయాన్ని సైతం లెక్కచేయక అతనాడిన ఇన్నింగ్స్ ప్రపంచ క్రికెట్(Cricket) చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. స్విచ్ హిట్లు, రివర్స్ స్వీపులతో నిన్నటి వరకూ అతనాడిన ఆట వేరు.. ముంబైలోని వాంఖడేలో మ్యాడ్ మ్యాక్సీ ఆడిన ఆట వేరు. అందుకే అతను రియల్ ఫైటర్.

గ్లెన్ మాక్స్‌వెల్, చిన్నప్పటి నుండి గోల్ఫ్‌(Golf)పై ప్రేమకు ప్రసిద్ధి చెందాడు. అతని చేతి-కంటి సమన్వయం మరియు పెద్దగా కొట్టే నైపుణ్యాలను మెరుగుపరిచినందుకు క్రీడకు ఘనత ఇచ్చాడు. ఇటీవల గోల్ఫ్-సంబంధిత గాయం అతని ప్రపంచ కప్ భాగస్వామ్యాన్ని బెదిరించినప్పటికీ, మ్యాక్స్‌వెల్ ఒక మ్యాచ్‌లో 10 సిక్సర్లు మరియు 21 బౌండరీలు కొట్టడంలో తన గోల్ఫ్ లాంటి ఖచ్చితత్వాన్ని ప్రదర్శించాడు.

గ్లెన్ మాక్స్‌వెల్ జట్టు ఆర్సీబీ(RCB) మాజీ కోచ్ సంజయ్ బంగర్(Sanjay Bangar), మాక్స్‌వెల్ గోల్ఫ్ సామర్థ్యాలను ప్రశంసించాడు. బంగర్ గోల్ఫ్ కోర్స్‌లో మాక్స్‌వెల్‌తో గడిపిన సమయాన్ని పేర్కొన్నాడు, మాక్స్‌వెల్ గోల్ఫ్ బంతిని అనూహ్యంగా 400 మీటర్ల స్ట్రైకింగ్ రేంజ్‌తో కొట్టగలడని హైలైట్ చేశాడు.

తీవ్రమైన తిమ్మిరిని ఎదుర్కొంటూ, మాక్స్‌వెల్ ఒక గోల్ఫర్‌(Golfer)గా తన వైఖరిని స్వీకరించాడు, పరిమిత ఫుట్‌వర్క్ ఉన్నప్పటికీ నిలకడగా నిలబడి శక్తివంతమైన షాట్‌లను అందించాడు. ఒకానొక సమయంలో, అతను తిమ్మిరి కారణంగా దాదాపుగా విరమించుకున్నాడు, కానీ ఫిజియో అతనిని వదిలివేయడం పరిస్థితిని మరింత దిగజార్చవచ్చని ఒప్పించిన తర్వాత మైదానంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. మాక్స్‌వెల్ 104 బంతుల్లో 150 పరుగులకు చేరుకున్నాడు మరియు సిక్సర్‌లకు రివర్స్ ల్యాప్‌లతో సహా సాంప్రదాయేతర షాట్‌లతో డబుల్ సెంచరీ సాధించాడు. అతని గోల్ఫ్ స్వింగ్ ద్వారా ప్రభావితమైన అతని ప్రత్యేకమైన విధానం వీక్షకులను ఆశ్చర్యపరిచింది. కొన్ని అసాధారణ ఎత్తుగడలు ఉన్నప్పటికీ, మాక్స్‌వెల్ యొక్క అత్యుత్తమ ఇన్నింగ్స్ అతని అసాధారణ శైలి యొక్క ప్రభావాన్ని చూపుతూ ఆస్ట్రేలియాను విజయానికి నడిపించింది.