World Cup 2023: కోహ్లీపై కుళ్లు చూపించిన పాక్ దిగ్గజం..

World Cup 2023 : భారత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023(World Cup 2023) టోర్నమెంట్ లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఎనిమిది మ్యాచ్ లు ఆడిన టీమిండియా(Team India) అన్ని మ్యాచ్ లలోనూ విజయాలను నమోదు చేసుకుంది. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తన 35వ పుట్టినరోజున 49వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డును సమం చేశాడు. ఈ […]

Share:

World Cup 2023 : భారత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023(World Cup 2023) టోర్నమెంట్ లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఎనిమిది మ్యాచ్ లు ఆడిన టీమిండియా(Team India) అన్ని మ్యాచ్ లలోనూ విజయాలను నమోదు చేసుకుంది. ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తన 35వ పుట్టినరోజున 49వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డును సమం చేశాడు. ఈ క్రమంలో కోహ్లీపై మాజీ, తాజా ప్లేయర్స్ నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇదే సమయంలో పలువురు మాజీ ప్లేయర్స్ కోహ్లీ స్వార్థపూరిత ఆట ఆడుతున్నాడంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్(Pakistan) మాజీ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్(Mohammad Hafeez) విరాట్ స్వార్థపూరిత ఆటఆడుతున్నాడంటూ విమర్శలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఇంగ్లండ్(England) మాజీ లెజెండ్ మైకేల్ వాన్(Michael Vaughan) మండిపడ్డాడు

పాకిస్థానీ టీవీ ఛానెల్ లో హఫీజ్(Hafeez) మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ(Virat Kohli) అద్భతుమైన మైలురాయిని చేరుకోవడానికి తనను తాను జట్టు కంటే ముందు ఉంచాడని ఆరోపించాడు. విరాట్ మంచిగా ఆడటంలేదని నేను అనడం లేదు.. 97 పరుగుల వరకు చేరేవరకు అతను అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. కానీ, ఆ తరువాత అతను సెంచరీకి చేరుకునేందుకు జట్టు ప్రయోజనాల కంటే తన మైలురాయిని చేరుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు పాక్ మాజీ ప్లేయర్ విమర్శించాడు. ఇదే సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పై హఫీజ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

Also Read: Hasan Raza: టీమిండియాపై నోరు పారేసుకున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్

భారత కెప్టెన్ జట్టు కోసం ఆడటానికి ఎంచుకున్నాడు. జట్టు ప్రయోజనం కోసం రోహిత్ తరచూ తనను తాను త్యాగం చేసే విధానం ఆకట్టుకుందని హఫీజ్ అన్నాడు. దక్షిణాఫ్రికా(South Africa)పై రోహిత్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. అతనికి తెలుసు పిచ్ కష్టంగా ఉంటుందని, పవర్ ప్లే(Power Play)లోనే అధిక పరుగులు రాబట్టాలని అతని భావించి ఆ మేరకు పరుగులు రాబట్టాడు. రోహిత్ సెంచరీ కొట్టాలనుకుంటే జట్టు ప్రయోజనాలను పక్కకు పెట్టి తన స్వార్థం కోసం ఆడే అవకాశాలు ఉన్నాయి.. కానీ, అతని లక్ష్యం అతని వ్యక్తిగతం కంటే జట్టు ప్రయోజనాల కోసం ఉందని హఫీజ్ అన్నాడు.

ఈ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ లెజెండ్ మైకేల్ వాన్(Michael Vaughan) మండిపడ్డాడు. ‘ఇండియా అద్భుతంగా ఆడుతూ 8 టీమ్స్‌ను చిత్తు చేసింది. కోహ్లీ ఇప్పుడు 49 సెంచరీలు చేశాడు. లాస్ట్ మ్యాచులో ఆ కఠిన పిచ్‌పై అతని పని యాంకర్ రోల్ పోషించడమే. అతని టీం 200 పరుగులపైగా తేడాతో మ్యాచ్ గెలిచింది. నీ మాటలు చెత్తగా ఉన్నాయి’ అంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తన సెంచరీ పూర్తయిన తర్వాత కోహ్లీ(Kohli) కూడా ఇలాంటి మాటలే చెప్పాడు. బంతి పాత పడేకొద్దీ బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారిందని, అప్పుడే టీం నుంచి తనకు కమ్యూనికేషన్ వచ్చిందని అన్నాడు. తను చివరి వరకు క్రీజులో ఉంటే, మిగతా వాళ్లు తన చుట్టూ ఆడటమే తనకు అందిన ప్లాన్ అని వివరించాడు. ఆ బాధ్యతను తాను నిర్వర్తించానని చెప్పుకొచ్చాడు.

పాక్ మాజీ ప్లేయర్ మహ్మద్ హఫీజ్ వ్యాఖ్యలకు టీమిండియా మాజీ ప్లేయర్ వెంకటేశ్ ప్రసాద్(Venkatesh Prasad) స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. విరాట్ కోహ్లీ స్వార్థపరుడు, వ్యక్తిగత మైలురాయికోసం ప్రాధాన్యత ఇస్తాడని ఫన్నీ విమర్శలు కొంతమంది చేస్తున్నారు. అవును కోహ్లీ స్వార్థపరుడు, శతకోటి ప్రజల కలలను అనుసరించేంత స్వార్థపరుడు. ఇంత సాధించిన తరువాత కూడా జట్టు విజయంకోసం ప్రయత్నించేంత స్వార్థపరుడు. కొత్త బెంచ్ మార్క్ లను సెట్ చేయగల స్వార్థపరుడు.. తన జట్టును గెలిపించేంత స్వార్థపరుడు  కోహ్లీ అంటూ వెంకటేశ్ ప్రసాద్ కోహ్లీపై విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశాడు.